📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

నెతన్యాహుతో భేటీ తర్వాత, ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ఖలీదా జియా మృతి ఎక్స్‌ప్రెస్‌వే పై ఘోర రోడ్డు ప్రమాదం.. 50 వాహనాలు ఢీ స్కూలు వేడుకలపై దుండగుల వీరంగం.. పలువురికి గాయాలు దుండగుల కాల్పుల్లో మరణించిన భారత విద్యార్థి కంబోడియాలో విష్ణు విగ్రహ ధ్వంసం.. తీవ్రంగా ఖండించిన భారత్ అమెరికా ఉద్యోగాలు స్థానికులకే అన్న ట్రంప్ నైజీరియాలో మసీదుపై బాంబు దాడి.. 10 మందికి పైగా మృతి విదేశీ చదువుల్లో ఏపీ స్టూడెంట్స్ టాప్ సోషల్ వెట్టింగ్ తో భారత్ కు భారీ కుదుపు! నెతన్యాహుతో భేటీ తర్వాత, ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ఖలీదా జియా మృతి ఎక్స్‌ప్రెస్‌వే పై ఘోర రోడ్డు ప్రమాదం.. 50 వాహనాలు ఢీ స్కూలు వేడుకలపై దుండగుల వీరంగం.. పలువురికి గాయాలు దుండగుల కాల్పుల్లో మరణించిన భారత విద్యార్థి కంబోడియాలో విష్ణు విగ్రహ ధ్వంసం.. తీవ్రంగా ఖండించిన భారత్ అమెరికా ఉద్యోగాలు స్థానికులకే అన్న ట్రంప్ నైజీరియాలో మసీదుపై బాంబు దాడి.. 10 మందికి పైగా మృతి విదేశీ చదువుల్లో ఏపీ స్టూడెంట్స్ టాప్ సోషల్ వెట్టింగ్ తో భారత్ కు భారీ కుదుపు!

China: తైవాన్‌లో చైనా సైనిక విన్యాసాలు

Author Icon By Vanipushpa
Updated: December 30, 2025 • 4:38 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తైవాన్ సరిహద్దుల్లో చైనా(taiwan-china) రెండవ రోజు కూడా భారీ సైనిక విన్యాసాలను కొనసాగిస్తోంది. ఈ విన్యాసాల ఉద్దేశం తైవాన్(taiwan) వేర్పాటువాద శక్తులకు, వారిని ప్రోత్సహిస్తున్న ‘బాహ్య శక్తులకు’ స్ట్రాంగ్ వార్నింగ్ పంపడమేనని చైనా స్పష్టం చేసింది. చైనా(China Military Drill) తన ఈస్టర్న్ థియేటర్ కమాండ్ ఆధ్వర్యంలో ‘జస్టిస్ మిషన్ 2025’ పేరుతో ఈ యుద్ధ విన్యాసాలను నిర్వహిస్తోంది. రెండవ రోజైన మంగళవారం (డిసెంబర్ 30, 2025), చైనా సైన్యం తైవాన్ చుట్టూ వాయుసేన, నౌకాదళం, రాకెట్ ఫోర్స్ యూనిట్లను రంగంలోకి దించింది. ఈ డ్రిల్స్‌లో సముద్ర, గగనతలంలో లైవ్-ఫైర్ విన్యాసాలు నిర్వహిస్తున్నారు. చైనా(China) రక్షణ మంత్రిత్వ శాఖ ప్రతినిధి జాంగ్ జియావోగాంగ్ మాట్లాడుతూ.. “చైనా కోర్ ప్రయోజనాలను సవాలు చేసే ఏ ప్రయత్నాన్నైనా తాము సహించబోమని, తైవాన్ ద్వారా చైనాను అణచివేయాలని చూస్తున్న దేశాలు తమ భ్రమలను వీడాలని” హెచ్చరించారు.

Read Also: America: రెండు హెలికాప్టర్లు ఢీ.. వీడియో వైరల్

China

తైవాన్‌కు ట్రంప్ 11.1 బిలియన్ డాలర్ల ఆయుధ ప్యాకేజీ

ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తైవాన్‌కు సుమారు 11.1 బిలియన్ డాలర్ల విలువైన భారీ ఆయుధ ప్యాకేజీని ప్రకటించారు. ఇది తైవాన్ చరిత్రలోనే అతిపెద్ద ఆయుధ ఒప్పందంగా భావిస్తున్నారు. తైవాన్‌పై దాడి జరిగితే జపాన్ సైన్యం జోక్యం చేసుకోవాల్సి ఉంటుందని జపాన్ ప్రధాని సనాయె తకాయిచి చేసిన వ్యాఖ్యలు బీజింగ్‌ను ఆగ్రహానికి గురిచేశాయి. చైనా చర్యలను తైవాన్ ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. తైవాన్ తన సైనిక బలగాలను అత్యున్నత అప్రమత్తతలో ఉంచింది. ఈ విన్యాసాల కారణంగా తైవాన్ జలసంధి మీదుగా వెళ్లే అంతర్జాతీయ విమాన మార్గాలను మళ్లించాల్సి వచ్చింది. దీనివల్ల సుమారు 1,00,000 మంది అంతర్జాతీయ ప్రయాణికులపై ప్రభావం పడింది. దాదాపు 850 అంతర్జాతీయ, 80 దేశీయ విమాన సర్వీసులు రద్దయ్యాయి.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

china China military China-Taiwan Relations defense East Asia Military Drills Military Exercises Military Presence Taiwan Taiwan News Telugu News Paper Telugu News Today tensions

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.