📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Latest News: China Masters 2025 – ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి

Author Icon By Anusha
Updated: September 19, 2025 • 5:15 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఈ ఏడాది తొలి టైటిల్ కోసం తీవ్రంగా కృషి చేస్తున్న భారత స్టార్ షట్లర్ పీవీ సింధు (PV Sindhu) కు మరోసారి నిరాశ ఎదురైంది. బలమైన ఆటతీరుతో క్వార్టర్ ఫైనల్‌ వరకు వచ్చిన ఈ తెలుగు తేజం అక్కడే ఆగిపోవాల్సి వచ్చింది. శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో (In the women’s singles quarterfinals), వరల్డ్ నెంబర్ వన్ అయిన దక్షిణ కొరియా స్టార్ అన్ సే యంగ్ చేతిలో సింధు, ఓటమిపాలైంది.

ఈ పోరులో సింధు 14-21, 13-21 తేడాతో ఓడిపోవడం ఆమె అభిమానులను నిరాశకు గురిచేసింది. మ్యాచ్ మొత్తం 38 నిమిషాల్లోనే ముగిసింది. ప్రారంభం నుంచే అన్ సే యంగ్ (An Se Young) ఆధిపత్యం కనబరచగా, సింధు తన ప్రతిభను ప్రదర్శించేందుకు ప్రయత్నించినా ఫలితం దక్కలేదు. ఆటలో ఏ దశలోనూ సింధు బలమైన పోటీ ఇవ్వలేకపోయింది.

China Masters 2025

ఈ మ్యాచ్‌లో గెలిచిన అన్ సే యంగ్

యంగ్ చేతిలో సింధుకు ఇది వరుసగా 8వ ఓటమి. ఇప్పటి వరకు ఈ సౌత్ కొరియా ప్లేయర్‌పై సింధు ఒక్క సింగిల్స్ మ్యాచ్ గెలవలేదు. ఈ మ్యాచ్‌లో గెలిచిన అన్ సే యంగ్.. సెమీఫైనల్లో అకనే యమగూచి (Akane Yamaguchi) తో తలపడుతోంది.గురువారం జరిగిన ప్రీక్వార్టర్స్‌లో సింధు 21-15, 21-15తో ఆరో సీడ్‌ పోర్న్‌పవీ చోచువాంగ్‌ (థాయ్‌లాండ్‌)పై గెలిచింది.

14వ ర్యాంకర్ అయిన సింధు ఆరో ర్యాంకర్‌ను ఓడించడంతో ఫామ్‌లోకి వచ్చిందని అంతా అనుకున్నారు. కానీ సౌత్ కొరియా ప్లేయర్‌ ను సింధు ఓడించలేక ఇంటి దారి పట్టింది.భారత డబుల్స్‌ ఏస్‌ జోడీ సాత్విక్‌ సాయిరాజ్‌-చిరాగ్‌ షెట్టిలు కూడా ఈ టోర్నీలో క్వార్టర్‌ఫైనల్స్‌కు దూసుకెళ్లారు. డబుల్స్‌లో 8వ సీడ్‌ సాత్విక్‌ ద్వయం 21-13, 21-12తో తైపీ జంట సియాంగ్‌ చీ చియు-వాంగ్‌ చి లిన్‌ను ఓడించింది.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

https://vaartha.com/asia-cup-2025-team-india-to-face-oman-today/international/550485/

250th T20 international Abu Dhabi match Asia Cup 2025 Breaking News India Cricket Team latest news milestone match Oman vs India second team to achieve Super 4 qualification Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.