📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

China Maglev Train: విమానం కంటే స్పీడుగా వెళ్లే చక్రాలు లేని రైలు

Author Icon By Vanipushpa
Updated: July 14, 2025 • 10:57 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

మనం ఎక్కడికైనా వెళ్లాలి అనుకున్నప్పుడు మన బడ్జెట్, సమయాన్ని బట్టి బస్సు, రైలు, విమానం.. ఇలా ఏదో ఒకటి ఎంచుకుంటాం. కానీ అతి తక్కువ ఖర్చు, అందులోనూ విమానం కంటే స్పీడుగా వెళ్లే ఓ మార్గం ఉందని తెలిస్తే అంతా దాన్నే ఎంచుకుంటారు. కాస్త ఎక్కువ డబ్బులు ఖర్చైనా ఫర్వాలేదనుకుంటూ మరీ పరుగులు పెడతారు. కానీ ఈ మార్గం అందుబాటులో లేదు. కేవలం చైనీయులకు మాత్రమే. అయితే సర్లేండీ.. అసలా మార్గం ఏంటి అనిపిస్తోందా.. అంత కొత్తదేం కాదులెండి.. రైలు ప్రయాణమే. కాకపోతే అన్ని రైళ్లు గంటకు 70 నుంచి 200 కిలో మీటర్ల మాత్రమే వెళ్తే… ఈ రైలు మాత్రం గంటకు 600 కిలో మీటర్ల వేగంతో దూసుకుపోతుంది. తాజాగా ఈ మ్యాగ్‌లెవ్ (మాగ్నెటిక్ లెవిటేషన్)(China Maglev Train) రైలును చైనా(China) తయారు చేసింది.

విమానాల కంటే వేగంగా పట్టాలపై పరుగులు

ఇప్పటికే దీన్ని టెస్ట్ ట్రయల్(Test Trail) చేయగా.. విమానాల కంటే వేగంగా పట్టాలపై పరుగులు పెట్టి ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తోంది. చైనా రైల్వే రోలింగ్ స్టాక్ కార్పొరేషన్ (CRRC) అభివృద్ధి చేసిన ఈ మ్యాగ్‌లెవ్ రైలు, విమానాల వేగాన్ని కూడా మించిపోయింది. సాధారణ ప్రయాణీకుల జెట్‌లు గంటకు 547 నుంచి 575 మైళ్ల వేగంతో ప్రయాణిస్తే.. ఈ సూపర్ ఫాస్ట్ రైలు మాత్రం గంటకు 600 కిలో మీటర్ల (సుమారు 373 మైళ్లు) గరిష్ట వేగాన్ని అందుకోగలదు. అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. ఈ రైలు కేవలం 7 సెకన్లలోనే తన గరిష్ట వేగాన్ని చేరుకోగలదు. ముఖ్యంగా ఇది 1,200 కిలో మీటర్ల దూరాన్ని కేవలం 150 నిమిషాల్లో (అంటే 2.5 గంటల్లో) కవర్ చేస్తుంది. ఉదాహరణకు ప్రస్తుతం బీజింగ్, షాంఘై మధ్య 5.5 గంటలు పెట్టే ప్రయాణ సమయాన్ని ఇది 2.5 గంటలకు తగ్గించనుంది.

China Maglev Train: విమానం కంటే స్పీడుగా వెళ్లే చక్రాలు లేని రైలు

2025 జూన్‌లో దీన్ని పరీక్షించగా, రైలు బరువు 1.1 టన్నులని చెప్పారు. చూడటానికి చాలా నాజూగ్గా బుల్లెట్‌ షేప్‌ ముక్కుతో ఉందనే చెప్పాలి. కాగా, చైనాలోని హై స్పీడ్‌ రైలు వ్యవస్థ ప్రపంచంలోనే అతిపెద్దది. గతేడాది చివరి నాటికి మొత్తం 48 వేల కిలోమీటర్లకు విస్తరించింది. ఈ ఏడాది దాన్ని 50 వేల కిలోమీటర్లకు పెంచ లక్ష్యంగా పెట్టుకుంది. మరోవైపు హైస్పీడ్‌ రైళ్ల అభివృద్ధిలో కూడా బీజింగ్ దూసుకెళ్తోంది. ఇప్పటికే సీఆర్‌450 బుల్లెట్‌ రైలును ఆవిష్కరించింది. ఇది గంటకు 450 కిలోమీటర్ల గరిష్ఠ వేగంతో ప్రయాణిస్తుంది.

మ్యాగ్‌లెవ్ టెక్నాలజీ అంటే ఏమిటి?

మ్యాగ్‌లెవ్ సాంకేతికత అనేది అయస్కాంత ఆకర్షణ మరియు వికర్షణ శక్తులను ఉపయోగించి రైలును పట్టాలపై నుంచి పైకి లేపుతుంది. దీని వల్ల రైలు పట్టాలను తాకకుండా గాలిలో ప్రయాణిస్తుంది. దీని ద్వారా ఘర్షణ (ఫ్రిక్షన్) పూర్తిగా తగ్గిపోతుంది. ఫలితంగా రైలు చాలా మృదువుగా.. నిశ్శబ్దంగా, అత్యంత వేగంగా కదులుతుంది. ఇది సాంప్రదాయ రైల్వే వ్యవస్థల కంటే చాలా సమర్థవంతమైనది .

చైనాలో మాగ్లెవ్ రైళ్లు ఉన్నాయా?
చైనా కొత్త హై-స్పీడ్ రైలు...
అవును, చైనాలో మాగ్లెవ్ (మాగ్నెటిక్ లెవిటేషన్) రైళ్లు ఉన్నాయి. షాంఘై మాగ్లెవ్ రైలు (SMT) ప్రపంచంలోనే మొట్టమొదటి వాణిజ్య హై-స్పీడ్ మాగ్లెవ్ లైన్.
ఏ దేశంలో మాగ్లెవ్ రైళ్లు ఉన్నాయి?
చైనా 600 kph మాగ్లెవ్ రైలును ఆవిష్కరించింది - రాష్ట్ర మీడియా | రాయిటర్స్
ప్రస్తుతం, చైనా, జపాన్ మరియు దక్షిణ కొరియాలో కార్యాచరణలో ఉన్న మాగ్లెవ్ రైలు వ్యవస్థలు ఉన్నాయి. చైనా షాంఘై మాగ్లెవ్‌ను గొప్పగా చెప్పుకుంటుంది

Read hindi news: hindi.vaartha.com

Read Also: Ajinkya Rahane: నాకు టెస్ట్ క్రికెట్ చాలా ఇష్టం: రహానే

#telugu News China Maglev Train China Railway Fastest Train high-speed train Maglev Technology Maglev vs Airplane Magnetic Levitation Transportation Innovation

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.