China influencer: సోషల్ మీడియాలో పాపులారిటీ, సంపాదన కోసం కొందరు ఎంతటి నీచానికైనా దిగజారుతున్నారు. భార్య ప్రసవ వేదన పడుతూ ప్రాణాలతో పోరాడుతున్న సమయంలోనూ ఓ ఇన్‌ఫ్లుయెన్సర్ యాడ్స్ ప్రమోట్ చేస్తూ డబ్బు సంపాదించుకోవడం ఇప్పుడు ఇంటర్నెట్‌లో హాట్ టాపిక్‌గా మారింది.
అమెరికాలోని సియాటెల్‌లో నివసించే చైనాకు చెందిన ‘పాల్ ఇన్ యూఎస్ఏ’ (అసలు పేరు జౌ జావో) ఓ ప్రముఖ ఇన్‌ఫ్లుయెన్సర్. అతడికి డౌయిన్ ప్లాట్‌ఫామ్‌పై 12.2 మిలియన్లకు పైగా ఫాలోవర్లు ఉన్నారు. ఇటీవల తన భార్య 23 గంటల పాటు పడిన ప్రసవ వేదనను అతను వీడియో తీసి పోస్ట్ చేశాడు. ఈ క్రమంలో ఆమెకు తీవ్ర రక్తస్రావం (3,344 ml) కావడంతో అత్యవసర ఆపరేషన్ చేయాల్సి వచ్చింది.
Read also: Operation Thrashi-1: కిష్టవాడ్ లో 326 రోజులు సాగిన ‘ఆపరేషన్ త్రాషి-1’ సక్సెస్
అయితే, భార్య అంత బాధలో ఉంటే పాల్ మాత్రం కెమెరా పట్టుకుని వీడియో తీశాడు. అంతటితో ఆగకుండా, ఆ వీడియో మధ్యలో న్యాపీలకు సంబంధించిన ఒక పెయిడ్ ప్రమోషన్ యాడ్ చదివి వినిపించాడు. ఈ ఘటనపై తన భార్య ఫిబ్రవరి 10న స్పందిస్తూ.. ప్రసవంలో ఉండే రిస్క్‌లను తెలియజేయడానికే ఈ వీడియో తీశామని వివరణ ఇచ్చింది. అయితే, ప్రజాగ్రహం చల్లారకపోవడంతో నిబంధనల ఉల్లంఘన కింద డౌయిన్, వీబో ప్లాట్‌ఫామ్స్ ఫిబ్రవరి 11న అతడి ఖాతాలను నిషేధించాయి.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: