యుద్ధానికి సై అంటూ అన్ని దేశాలపై విరుచుకుపడుతున్న అమెరికాకు చైనా(China) దిమ్మతిరిగే షాకిచ్చింది. సైలెంట్ అస్త్రం సంధిస్తూ రక్షణ రంగంలో కీలకంగా మారిన F-35 Fighter Jet కు చెక్ పెట్టేందుకు రెడీ అయింది. ఒక్క బుల్లెట్ పేల్చకుండానే అగ్రరాజ్యాన్ని దెబ్బతీసే ఎత్తుగడ వేసింది. అమెరికా రక్షణ రంగంలో అత్యంత కీలకంగా మారిన ఎఫ్-35 యుద్ధ విమానాల ఫ్యూచర్ ఇప్పుడు డ్రాగన్ కంట్రీ చేతుల్లోకి వెళ్లింది. దీనికి ప్రధాన కారణం ఏంటంటే.. యుద్ధ విమానాల తయారీకి వాడే ‘రేర్ ఎర్త్’ మూలకాలపై చైనా కఠిన ఆంక్షలు విధించడమే. చైనా ఇటీవల ప్రకటించిన 141 పేజీల 15వ పంచవర్ష ప్రణాళికలో.. US F-35 జెట్లు, ఇతర ఆధునిక రక్షణ వ్యవస్థలపై యుద్ధం లేకుండా చెక్ పెట్టగల విధానాన్ని సూచిస్తుంది. ఇక ప్రపంచవ్యాప్తంగా ఈ ఖనిజాల సరఫరాలో చైనాదే ఆధిపత్యం అని చెప్పవచ్చు. తాజాగా ఈ మూలకాలపై ఎగుమతుల విధానాన్ని డ్రాగన్ కఠినతరం చేస్తోంది.
Read Also: LB Nagar Cybercrime: లంచం తీసుకుంటూ దొరికిన సైబర్‌క్రైమ్ ఎస్సైలు
రోబోటిక్స్ పారిశ్రామిక ఉత్పత్తిని వేగవంతం
వాషింగ్టన్ ఇప్పుడ ఇరాన్ వంటి ప్రాంతీయ సవాళ్లలో బిజీగా ఉండగా.. బీజింగ్ దీర్ఘకాలిక, వ్యూహాత్మక సమతుల్యతను సృష్టించే అవకాశాన్ని ఉపయోగిస్తోంది. ఈ ప్రణాళిక ఒక సాధారణ ఆర్థిక పత్రంలా కాకుండా, రాబోయే దశాబ్దాల్లో చైనా సైనిక, ఆర్థిక బలాన్ని నిర్ణయించే అత్యాధునిక సాంకేతికతలపై ఆధిపత్యాన్ని ఏర్పాటు చేసే సమగ్ర వ్యూహంగా కనిపిస్తోంది. AI, హ్యూమనాయిడ్ రోబోటిక్స్, క్వాంటం కమ్యూనికేషన్, మెదడు-కంప్యూటర్ ఇంటర్‌ఫేస్‌ల వంటి సాంకేతికతలను కేంద్రబిందువుగా ఉంచిన ఈ ప్రణాళిక.. చైనాకు ఆర్థిక, సైనిక పరిధిలో కీలక ప్రయోజనాలను ఇస్తుంది. అలాగే చైనా AI-సంబంధిత పరిశ్రమలు తదుపరి ఐదు సంవత్సరాల్లో దాదాపు 1.4 ట్రిలియన్ డాలర్ల విలువకు చేరే అవకాశముందని అంచనా వేస్తున్నారు. రోబోటిక్స్ పారిశ్రామిక ఉత్పత్తిని వేగవంతం చేస్తుంది. క్వాంటం కంప్యూటింగ్, అంతరిక్ష మౌలిక సదుపాయాలు, అధునాతన ఎలక్ట్రానిక్ సామగ్రి ఉత్పత్తులలో దృష్టి సారిస్తుంది. ప్రతి US F-35 యుద్ధ విమానంలో దాదాపు 435 కిలోల రేర్ ఎర్త్ (Rare Earth) మూలకాలు ఉంటాయి, ఇవి ఇంజిన్లు, రాడార్, సెన్సార్లు, ఆయుధ వ్యవస్థలలో కీలకమైనవి. ఈ ఖనిజాలను శుద్ధి చేయడంలో 90 శాతానికి పైగా ఆధిపత్యం చైనాకు ఉంది. చైనా ఈ సరఫరాను నిలిపివేస్తే..అమెరికా F-35లను తయారు చేయలేకపోయే పరిస్థితి ఏర్పడుతుంది. చైనా గతంలో కేవలం ఖనిజాల ఎగుమతిపై నియంత్రణ కలిగి ఉండగా.. ఇప్పుడు ప్రాసెసింగ్ సాంకేతికతను కూడా కాపాడుతోంది. విదేశీ కంపెనీలు చైనా నుండి ప్రత్యేక లైసెన్సులు లేకుండా ఖనిజాలను పొందలేరు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: