📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

దుండగుల కాల్పుల్లో మరణించిన భారత విద్యార్థి కంబోడియాలో విష్ణు విగ్రహ ధ్వంసం.. తీవ్రంగా ఖండించిన భారత్ అమెరికా ఉద్యోగాలు స్థానికులకే అన్న ట్రంప్ నైజీరియాలో మసీదుపై బాంబు దాడి.. 10 మందికి పైగా మృతి విదేశీ చదువుల్లో ఏపీ స్టూడెంట్స్ టాప్ సోషల్ వెట్టింగ్ తో భారత్ కు భారీ కుదుపు! భారత్ లో వీసా సర్వీసులను నిలిపేసిన బంగ్లాదేశ్ కూలిన మెక్సికో నేవీ విమానం.. ఐదుగురు దుర్మరణం ఇండోనేషియాలో రోడ్డుప్రమాదం.. 16 మంది దుర్మరణం ట్రంప్ ప్రకటనలో భారీగా తగ్గనున్న మందుల ధర దుండగుల కాల్పుల్లో మరణించిన భారత విద్యార్థి కంబోడియాలో విష్ణు విగ్రహ ధ్వంసం.. తీవ్రంగా ఖండించిన భారత్ అమెరికా ఉద్యోగాలు స్థానికులకే అన్న ట్రంప్ నైజీరియాలో మసీదుపై బాంబు దాడి.. 10 మందికి పైగా మృతి విదేశీ చదువుల్లో ఏపీ స్టూడెంట్స్ టాప్ సోషల్ వెట్టింగ్ తో భారత్ కు భారీ కుదుపు! భారత్ లో వీసా సర్వీసులను నిలిపేసిన బంగ్లాదేశ్ కూలిన మెక్సికో నేవీ విమానం.. ఐదుగురు దుర్మరణం ఇండోనేషియాలో రోడ్డుప్రమాదం.. 16 మంది దుర్మరణం ట్రంప్ ప్రకటనలో భారీగా తగ్గనున్న మందుల ధర

China: ట్రంప్ కు బిగ్ షాక్ ఇచ్చిన చైనా.. ఆటలు సాగవంటూ.. !

Author Icon By Vanipushpa
Updated: July 8, 2025 • 3:16 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

బ్రిక్స్(Brics) సభ్య దేశాలకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్(Trump) వార్నింగ్ ఇచ్చిన సంగతి తెలిసిందే. బ్రిక్స్ కూటమికి మద్దతు ఇచ్చే దేశాలపై అదనంగా 10 శాతం టారిఫ్ లు విధిస్తామని ట్రంప్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ దేశాలు అమెరికా(America) విధానాలను వ్యతిరేకిస్తున్నాయని విమర్శించారు. ఈ మేరకు తన అధికారిక సామాజిక మాధ్యమం ట్రూత్ సోషల్ పోస్టు చేశారు. బ్రిక్స్ దేశాలే కాకుండా అమెరికా విధానాలను వ్యతిరేకించే ఏ దేశమైనా టారిఫ్(Tariffs) లు విధిస్తామని ట్రంప్ స్పష్టం చేశారు.
అయితే తాజాగా ట్రంప్ వ్యాఖ్యలకు చైనా కౌంటర్(China Counter) ఇచ్చింది. ట్రంప్ టారిఫ్ వ్యాఖ్యలను ఖండించింది. దేశాలపై ఒత్తిడి తెచ్చేందుకే ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారని మండిపడింది. ఈ మేరకు చైనా విదేశాంగ కార్యాలయం నుంచి కీలక ప్రకటన వెలువడింది. బ్రిక్స్ కూటమి అమెరికాతో ఘర్షణను కోరుకోవడం లేదని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి మావో నింగ్ పేర్కొన్నారు. ప్రపంచ దేశాలపై ఒత్తిడి తెచ్చేందుకే ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారని తెలిపారు.

China: ట్రంప్ కు బిగ్ షాక్ ఇచ్చిన చైనా.. ఆటలు సాగవంటూ.. !

చైనా స్ట్రాంగ్ కౌంటర్
బ్రిక్స్ కూటమికి మద్దతు ఇచ్చే దేశాలపై అదనంగా 10 శాతం టారిఫ్ లు విధిస్తామని ట్రంప్‌ వ్యాఖ్యలకు చైనా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. బ్రిక్స్ కూటమి అమెరికాకు వ్యతిరేకం కాదని పేర్కొంది. దేశాలపై ఒత్తిడి తెచ్చేందుకు ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నారని తెలిపింది. ప్రతీకార టారిఫ్ ల కారణంగా ఎవరికీ ఉపయోగం లేదని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి మావో నింగ్ పేర్కొన్నారు. బ్రిక్స్ ఏ దేశానికి వ్యతిరేకంగా తీసుకురాలేదని.. అభివృద్ధి చెందుతున్న దేశాల మధ్య సహకారం కోసమే బ్రిక్స్ కూటమి నెలకొల్పినట్లు తెలిపారు. మరోవైపు బ్రెజిల్‌ లో జరిగిన 17వ బ్రిక్స్‌ కూటమి సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చారు. ఉగ్రవాదం ప్రపంచంలోని మానవాళి ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాల్‌ అని తెలిపారు.
సదస్సుకు హాజరు కానీ కీలక నేతలు జిన్‌పింగ్‌, పుతిన్‌
టెర్రరిజంపై పోరుకు ప్రపంచ దేశాలు ఒక్కతాటిపైకి రావాల్సిన అవసరం ఉందని ప్రధాని మోదీ అభిప్రాయపడ్డారు. శాంతి, సోదరభావం పట్ల భారతదేశం నిబద్ధతను చాటి చెప్పారు. అయితే ఈ సదస్సుకు కీలక నేతలైన రష్యా అధ్యక్షుడు పుతిన్‌, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ హాజరు కాకపోవడం గమనార్హం. ఇక BRICS అనేది బ్రెజిల్ , రష్యా , భారత్ , చైనా , దక్షిణాఫ్రికా , ఈజిప్ట్ , ఇథియోపియా , ఇండోనేషియా , ఇరాన్ మరియు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దేశాలతో ఏర్పడిన కూటమి. ఈ కూటమి 2001లో ఏర్పడింది .

అమెరికా, చైనా మధ్య సంబంధం ఏమిటి?
చైనా అమెరికాకు కీలకమైన వాణిజ్య భాగస్వామి అయినప్పటికీ, అది ప్రధాన పోటీదారు కూడా. అక్రమ వస్తువుల వ్యాపారం, బలవంతపు శ్రమను ఉపయోగించడం మరియు సున్నితమైన సాంకేతిక పరిజ్ఞానాల దొంగతనం వంటి చైనా హానికరమైన మరియు అన్యాయమైన ఆర్థిక పద్ధతులు అమెరికా ఆర్థిక మరియు భద్రతా ప్రయోజనాలకు ప్రమాదాలను కలిగిస్తాయి.
చైనా లేదా అమెరికా ఎవరు ధనవంతులు?
అమెరికా కాదు, చైనా ప్రపంచంలోనే అత్యంత ధనవంతుల దేశం (కానీ మనకు ఇది ఇప్పటికే తెలుసు). PPP GDP ద్వారా చైనా ఇప్పటికే ప్రపంచంలోనే అత్యంత ధనవంతుల దేశం (నామమాత్రపు GDP ద్వారా US ఇప్పటికీ ధనవంతులే), కాబట్టి దానిని పరిగణనలోకి తీసుకున్నప్పుడు TC-PPP GDP ద్వారా అత్యంత ధనవంతులు కావడం ఆశ్చర్యం కలిగించదు.18 సెప్టెంబర్ 2024

Read hindi news: hindi.vaartha.com

Read Also: FPI: జూన్‌లో రూ.14,590 కోట్ల ఎఫ్‌పీఐ పెట్టుబడులు

#telugu News China message to Trump China political response China vs Trump Trump China relations trump foreign policy US China tensions US trade war with China

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.