📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

China : డొనాల్డ్‌ ట్రంప్‌ తీరుపై చైనా ప్రతినిధి గెంగ్ షువాంగ్ అసహనం

Author Icon By Sudha
Updated: August 1, 2025 • 3:19 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

అమెరికా తీరుపై, ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ (Donald Trump) తీరుపై చైనా (China) ఆగ్రహం వ్యక్తంచేసింది. రష్యా తో వాణిజ్యం చేయొద్దంటూ అమెరికా ప్రపంచ దేశాలను హెచ్చరించడంపై తీవ్రంగా మండిపడింది. తమ హెచ్చరికలను పెడచెవిన పెడితే భారీగా ఆంక్షలు విధిస్తామని ట్రంప్ పదేపదే హెచ్చరికలు జారీ చేస్తుండటంపై చైనా (China) అసహనం వ్యక్తం చేసింది. అమెరికా దుర్నీతిని చైనా (China) ఎండగట్టింది. మిగతా దేశాల సంగతి పక్కన పెడితే.. రష్యాతో అమెరికానే భారీగా వాణిజ్య కార్యకలాపాలు కొనసాగిస్తోందని ఆరోపించింది. ఈరోజు వరకు కూడా రష్యాతో అమెరికా వాణిజ్యం కొనసాగుతోందని తెలిపింది. ‘రష్యాతో ఇతరులు వాణిజ్యం చేస్తే తప్పు, మీరు చేస్తే ఒప్పా’ అని అమెరికాను ఐక్యరాజ్య సమితిలో చైనా శాశ్వత ప్రతినిధి గెంగ్ షువాంగ్ నిలదీశారు.

China : డొనాల్డ్‌ ట్రంప్‌ తీరుపై చైనా ప్రతినిధి గెంగ్ షువాంగ్ అసహనం

కాగా రష్యా నుంచి చమురు కొనుగోలు చేసే దేశాలపై భారీ మొత్తంలో టారిఫ్‌లు విధిస్తామని డొనాల్డ్ ట్రంప్ ఇటీవల ప్రపంచ దేశాలను హెచ్చరించారు. ఈ హెచ్చరికలపై గెంగ్ షువాంగ్ స్పందిస్తూ.. మిగతా దేశాల కంటే అమెరికానే ఎక్కువగా రష్యాతో వ్యాపారం చేస్తోందన్నారు. ఉక్రెయిన్‌కు కానీ, రష్యాకు కానీ తాము ఆయుధాలు సరఫరా చేయడంలేదని, అంతర్జాతీయ చట్టాలకు లోబడి వాణిజ్యం మాత్రమే చేస్తున్నామని తెలిపారు. భద్రతా మండలిలో చైనాపై అమెరికా ప్రతినిధి చేసిన ఆరోపణలను గెంగ్ షువాంగ్ తోసిపుచ్చారు. రష్యా, ఉక్రెయిన్‌తో తమ వాణిజ్య కార్యకలాపాలు అంతర్జాతీయ చట్టాలకు లోబడే ఉన్నాయని, ఎలాంటి ఉల్లంఘనలు జరగలేదని తెలిపారు. ఇతరులపై నిందలు వేయడం మానుకోవాలని అమెరికాకు హితవు పలికారు. అదేవిధంగా ఉక్రెయిన్ సంక్షోభానికి ముగింపు పలకడానికి ఇదే సరైన సమయమని, అందుకు కృషి చేయాలని ట్రంప్‌కు సూచించారు.

చైనా ఏ రకమైన దేశం?

చైనా అనేది చాలా శక్తివంతమైన కేంద్ర ప్రభుత్వం పాలించే నిరంకుశ రాజ్యం . భారీ సంఖ్యలో కార్మికులు మరియు అపారమైన సహజ వనరులు ఆర్థిక మార్పుకు దారితీశాయి. దీని వలన కమ్యూనిస్ట్ ప్రభుత్వం మరిన్ని ఆర్థిక మరియు వ్యక్తిగత స్వేచ్ఛలను అనుమతించాల్సి వచ్చింది, కానీ ఇది పర్యావరణానికి భారీ నష్టాన్ని కలిగించింది.

చైనాలో అతిపెద్ద పర్యావరణ సమస్య ఏది?

చైనా నగరాల్లో, బహిరంగ వాయు కాలుష్యం ప్రజారోగ్యానికి అతిపెద్ద పర్యావరణ సవాలు. చైనా నగరాల్లో వాయు కాలుష్యానికి మూలం క్రమంగా సాంప్రదాయ బొగ్గు దహనం నుండి బొగ్గు-దహన మరియు మోటారు-వాహన ఉద్గారాల మిశ్రమంగా మారింది.

చైనా ఎందుకు విజయవంతమైంది?

చైనా ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే అనేక అనుకూల పరిస్థితులు ఉన్నాయి. ఇది తరచుగా దేశీయ మౌలిక సదుపాయాలు మరియు రియల్ ఎస్టేట్‌లో భారీగా పెట్టుబడులు పెడుతుంది. దీనికి తక్కువ వేతన అవసరాలు మరియు ఉత్పాదక ఖర్చులను తగ్గించడంలో సహాయపడే అనుకూలమైన పన్ను విధానం ఉన్నాయి.

Read hindi news: hindi.vaartha.com

Read Also: Cynthia Erivo : నోటిని బీమా చేయించుకున్న సింథియా

Breaking News china Chinese diplomacy Donald Trump Geng Shuang International Politics latest news Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.