📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Floods: చైనాలో ఆకస్మిక వరదలు.. 17 మంది మృతి..33 మంది గల్లంతు

Author Icon By Vanipushpa
Updated: August 9, 2025 • 2:28 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

దేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా భారీ వరదలు ప్రజలను ఇబ్బంది పెడుతున్నాయి. చైనా(China) లో వాయువ్య గన్సు ప్రావిన్స్‌లోని కొన్ని ప్రాంతాలలో ఆకస్మిక వరదలు(Floods) ముంచెత్తడంతో దాదాపుగా 17 మంది మృతి చెందినట్లు తెలుస్తోంది. దాదాపుగా 33 మంది గల్లంతయ్యారని అధికారులు చెబుతున్నారు. అలాగే గ్వాంగ్జౌ(Guangzhou)లోని దయువాన్ గ్రామంలో వర్షం కారణంగా కొండచరియలు విరిగిపడి ఏడుగురు మరణించారు. దీనివల్ల ఇళ్లు అన్ని కూడా వీటి కింద శిథిలం అయ్యాయి. మరో 48 గంటల పాటు చైనాలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. కుండపోత వర్షాలు యుజోంగ్ కౌంటీని అతలాకుతలం చేయడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పలు ప్రాంతాల్లో విద్యుత్, ఫోన్ సేవలు పూర్తిగా నిలిచిపోయాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.

భారీ వర్షాల కారణంగా విమానాలకు తీవ్ర అంతరాయం
చైనాలోని దక్షిణ గ్వాంగ్‌డాంగ్ ప్రావిన్స్‌లో 19వ శతాబ్దం తర్వాత కురిసిన అత్యంత దారుణమైన వర్షాలలో ఇది ఒకటి. భారీ వర్షాలు కురవడంతో ఇళ్లు, చెట్లు, భవనాలు నేలమట్టం అయ్యాయి. శిథిలాల కింద ఇళ్లు, కొందరు ఇరుక్కోవడంతో అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. భారీ వరదల కారణంగా రోడ్లు అన్ని కూడా తీవ్రంగా దెబ్బతిన్నాయి. చెట్లు కూలిపోయాయి. దీంతో రవాణా పూర్తిగా స్తంభించింది. ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ భారీ వర్షాల కారణంగా విమానాలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. గ్వాంగ్జౌలోని బైయున్ విమానాశ్రయం 360 కి పైగా విమానాలను రద్దు చేసింది.
మరో వారం రోజుల పాటు చైనాలో వర్షాలు
వాటర్ ఎక్కడ పడితే అక్కడ నిలిచిపోవడంతో ఇన్ఫెక్షన్లు చాలా మందిని ఇబ్బంది పెడుతుందని తెలుస్తోంది. మరో వారం రోజుల పాటు చైనాలో వర్షాలు పడతాయని అధికారులు చెబుతున్నారు. ఇప్పుడు కురుస్తున్న వర్షాలకు ఎన్నో వ్యవసాయ భూములు వరదలతో నిండిపోయాయి. దీంతో ప్రజలు తీవ్రంగా నష్టపోయారు. ఈ విపత్తు వల్ల సాయంగా అక్కడి ప్రభుత్వం ప్రావిన్సులకు 1 బిలియన్ యువాన్ (USD139 మిలియన్లు) కంటే ఎక్కువ ఇచ్చింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, బయటకు వెళ్లకూడదని ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది.

వదలకు కారణాలు

గల అనేక కారణాలలో కొన్ని, ఈ వైపరీత్యాలపట్ల సరైన అవగాహన లేకపోవడం, వీటి తీవ్రతలు తెలుసుకోలేకపోవడం, వీటిని ముందుగానే గుర్తించగలిగే సౌకర్యాలు లేకపోవడం, తదనంతరం తీసుకోవలసిన చర్యల గూర్చి తగిన వ్యూహరచనలు లేకపోవడం. మరీ ముఖ్యంగా ప్రజలలో చైతన్యం లేకపోవడం. వీటి కారణంగా వాటిల్లే నష్టాలు, తదనంతర దుష్ఫలితాలు చాలా ఘోరంగా కనిపిస్తాయి.

china deaths flash-floods international-news Latest News Breaking News missing-people natural-disaster Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.