China: మయన్మార్ నిందితులకు చైనా మరణ శిక్ష అమలు

Read Time:  1 min
మయన్మార్ నిందితులకు చైనా మరణ శిక్ష అమలు
మయన్మార్ నిందితులకు చైనా మరణ శిక్ష అమలు
FONT SIZE
GET APP

చైనా ప్రభుత్వం చట్టవిరుద్ధ కార్యకలాపాలపై కఠిన వైఖరిని కొనసాగిస్తోంది. ఈ క్రమంలోనే మయన్మార్ కేంద్రంగా పనిచేస్తున్న ఓ క్రిమినల్ గ్యాంగ్‌కు చెందిన మరో నలుగురు నిందితులకు చైనాలో మరణశిక్ష అమలైనట్లు తాజాగా వెలుగులోకి వచ్చింది. హత్యలు, టెలికాం మోసాలు, డ్రగ్ ట్రాఫికింగ్ వంటి పలు తీవ్రమైన నేరాలకు పాల్పడినందుకు వీరికి ఈ శిక్ష పడినట్లు చైనా మీడియా వెల్లడించింది. ఈ గ్యాంగ్ కార్యకలాపాల కారణంగా ఆరుగురు చైనా(China) పౌరులు ప్రాణాలు కోల్పోయినట్లు న్యాయస్థానం నిర్ధారించింది. ఈ కేసును విచారించిన షెంజెన్ ఇంటర్మీడియెట్ పీపుల్స్ కోర్టు గత ఏడాది వీరికి మరణశిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చింది. తాజాగా ఆ తీర్పును అమలు చేసినట్లు తెలుస్తోంది.

Read Also: EC : బిజెపి ఏజెంట్ గా EC పనిచేస్తోంది – మమతా

China: మయన్మార్ నిందితులకు చైనా మరణ శిక్ష అమలు
China: మయన్మార్ నిందితులకు చైనా మరణ శిక్ష అమలు

మాఫియా గ్యాంగ్‌పై ఉన్న ఆరోపణలు

ముఖ్యంగా మయన్మార్ సరిహద్దు ప్రాంతాల్లో పనిచేస్తున్న గ్యాంగ్‌లు, చైనా పౌరులను లక్ష్యంగా చేసుకుని వేల కోట్ల రూపాయల కుంభకోణాలకు పాల్పడినట్లు ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలోనే చైనా ప్రభుత్వం ఇలాంటి గ్యాంగ్‌లపై కఠిన చర్యలకు దిగింది. ఈ చర్యలలో భాగంగా మయన్మార్‌కు చెందిన 11 మంది ముఠా సభ్యులకు కూడా మరణశిక్ష అమలైందని స్థానిక మీడియా కథనాలు వెల్లడించాయి. వీరిపై ఆన్‌లైన్ మోసాలు, అక్రమ జూదం, డ్రగ్ వ్యాపారం వంటి పలు కేసులు నమోదయ్యాయి. ఈ మాఫియా గ్యాంగ్‌పై ఉన్న ఆరోపణలు మరింత తీవ్రంగా మారాయి. తమ ఆధీనంలో నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నం చేసిన 14 మంది చైనా పౌరులను ఈ గ్యాంగ్ హత్య చేసినట్లు దర్యాప్తులో తేలింది. ఈ హత్యలు, అపహరణలు చైనాలో పెద్ద ఎత్తున కలకలం రేపాయి. దీంతో ప్రభుత్వం ఈ కేసులను అత్యంత ప్రాధాన్యతతో విచారించింది.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

Vanipushpa

రచయిత గురించి

Vanipushpa

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.