📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

విదేశీ చదువుల్లో ఏపీ స్టూడెంట్స్ టాప్ సోషల్ వెట్టింగ్ తో భారత్ కు భారీ కుదుపు! భారత్ లో వీసా సర్వీసులను నిలిపేసిన బంగ్లాదేశ్ కూలిన మెక్సికో నేవీ విమానం.. ఐదుగురు దుర్మరణం ఇండోనేషియాలో రోడ్డుప్రమాదం.. 16 మంది దుర్మరణం ట్రంప్ ప్రకటనలో భారీగా తగ్గనున్న మందుల ధర ఢాకాలో హింస.. పత్రికల కార్యాలయాలపై దాడులు కుప్పకూలిన విమానం.. ప్రముఖ రేసర్ కన్నుమూత బంగ్లాదేశ్ లో దారుణం ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు విదేశీ చదువుల్లో ఏపీ స్టూడెంట్స్ టాప్ సోషల్ వెట్టింగ్ తో భారత్ కు భారీ కుదుపు! భారత్ లో వీసా సర్వీసులను నిలిపేసిన బంగ్లాదేశ్ కూలిన మెక్సికో నేవీ విమానం.. ఐదుగురు దుర్మరణం ఇండోనేషియాలో రోడ్డుప్రమాదం.. 16 మంది దుర్మరణం ట్రంప్ ప్రకటనలో భారీగా తగ్గనున్న మందుల ధర ఢాకాలో హింస.. పత్రికల కార్యాలయాలపై దాడులు కుప్పకూలిన విమానం.. ప్రముఖ రేసర్ కన్నుమూత బంగ్లాదేశ్ లో దారుణం ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు

America: వంద ఖండాంతర క్షిపణులను మోహరించిన చైనా?

Author Icon By Vanipushpa
Updated: December 23, 2025 • 1:03 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

డ్రాగన్‌ దేశం తన ఆయుధ సంపత్తిని ప్రదర్శించడానికి ఏ మాత్రం వెనుకాడటం లేదు. అంతేకాదు. ఆయుధ నియంత్రణ విషయంలో పెద్దగా ఆసక్తి చూపడం లేదు. ఈ విషయమై ఆమెరికా ఆందోళన వ్యక్తం చేసింది. కనీసం ఆయుధాల నియంత్రణ చర్చలకు కూడా చైనా (China) ఎలాంటి ఆసక్తి చూపడం లేదని అమెరికా ఆరోపిస్తోంది. ఇదిలా ఉండగా కొత్తగా మూడు వేర్వేరు ప్రాంతాల్లో 100 ఖండాంతర బాలిస్టిక్‌ క్షిపణులను మోహరించి ఉండొచ్చని అమెరికా ఆందోళన వ్యక్తం చేసింది. మరే అణుశక్తి దేశం చేయనివిధంగా డ్రాగన్‌ ఆయుధాలు సమకూర్చుకుంటోందని, అణు, సైనికపరమైన మౌలిక సదుపాయాలను వేగంగా ఏర్పాటుచేస్తోందని ఆరోపించింది.

America: ఆలస్యమవుతున్న వీసా అపాయింట్ మెంట్ తో టెన్షన్..టెన్షన్

America

పెంటగాన్‌ అంచనా వేసిన ప్రకారం..

మంగోలియాతో ఉన్న సరిహద్దు సమీపంలో మూడు సిలో ఫీల్డ్స్‌ (విశాలంగా ఉండే పొడవైన నిర్మాణం)లో 100 వరకు ఖండాంతర బాలిస్టిక్‌ క్షిపణులను మోహరించిందన్న అనుమానాన్ని అమెరికా వెల్లడించింది. ఈ సిలో సైట్ల గురించి గతంలోనే వెల్లడించినప్పటికీ.. అప్పుడు అక్కడ మోహరించిన క్షిపణుల సంఖ్యను ప్రస్తావించలేదు. 2024లో చైనా వద్ద అణువార్‌హెడ్‌ల సంఖ్య కేవలం 600ల వరకు మించి లేవని, 2030 నాటికి ఆ సంఖ్య 1000 దాటిందని ఆందోళన వ్యక్తం చేసింది. ‘‘ఆయుధ నియంత్రణ చర్చల విషయంలో చైనా ఎలాంటి ఆసక్తి చూపించడం లేదు’’ అని అమెరికా నివేదిక పేర్కొంది.

రష్యాతో అణునిరాయుధీకరణ చర్చలు జరిపే అవకాశం

అయితే అమెరికా తనపై చేస్తున్న ఆరోపణల నేపథ్యంలో ఈ నివేదికపై చైనా స్పందించింది. అమెరికా ఆరోపణలతో కూడిన అంచనాలను తోసిపుచ్చింది. తన దేశాన్ని కించపర్చడానికి, అంతర్జాతీయ సమాజాన్ని తప్పుదోవ పట్టించేందుకు అమెరికా ఉద్దేశపూర్వకంగా చేస్తోన్న తప్పుడు ప్రచారమని వాషింగ్టన్‌లోని చైనా దౌత్య కార్యాలయం నిప్పులు చెరిగింది. తన దేశ భద్రతను దృష్టిలో ఉంచుకొని కనీస స్థాయిలో మోహరింపులు కొనసాగించడం సహాజమని స్పష్టం చేసింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

China military expansion China missile deployment global security concerns intercontinental ballistic missiles nuclear weapons news Paper Telugu News Telugu News online Telugu News Paper

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.