China mediation claim : అమెరికా తర్వాత ఇప్పుడు చైనా కూడా భారత్–పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలను తగ్గించడంలో తాము పాత్ర పోషించామని చెప్పుకొస్తోంది. ఈ ఏడాది మే నెలలో భారత్–పాక్ మధ్య సైనిక ఉద్రిక్తతలు చోటుచేసుకున్న నేపథ్యంలో, ఆ వివాదంలో చైనా దౌత్యపరంగా జోక్యం చేసుకుందని బీజింగ్ తాజాగా ప్రకటించింది. బీజింగ్‌లో జరిగిన అంతర్జాతీయ పరిస్థితులు, చైనా విదేశాంగ విధానంపై చర్చ సందర్భంగా చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ ఈ వ్యాఖ్యలు చేశారు.
చైనా ఏమంది?
ప్రపంచవ్యాప్తంగా యుద్ధాలు, అస్థిరత వేగంగా (China mediation claim) పెరుగుతున్నాయని వాంగ్ యీ పేర్కొన్నారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఎన్నడూ లేనంతగా స్థానిక యుద్ధాలు, సరిహద్దు ఘర్షణలు పెరిగాయని అన్నారు. ఈ పరిస్థితుల్లో చైనా “నిష్పక్షపాత, న్యాయమైన వైఖరి”తో సమస్యలను పరిష్కరించేందుకు ప్రయత్నించిందని ఆయన తెలిపారు.
మయన్మార్ ఉత్తర ప్రాంతం, ఇరాన్ అణు సమస్య, భారత్–పాకిస్థాన్ ఉద్రిక్తతలు, ఇజ్రాయెల్–పాలస్తీనా వివాదం, కాంబోడియా–థాయ్‌లాండ్ మధ్య ఉద్రిక్తతల్లో చైనా మధ్యవర్తిత్వం చేసిందని వాంగ్ యీ పేర్కొన్నారు.
Read also: Cigarette price hike : సిగరెట్ ధరలు భారీగా పెంపు సెంట్రల్ ఎక్సైజ్ బిల్లు 2025కి ఆమోదం
విదేశీ జోక్యాన్ని తిరస్కరించిన భారత్
పహల్గామ్‌లో ఏప్రిల్ 22న జరిగిన ఉగ్రదాడి అనంతరం భారత్–పాకిస్థాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. దీనికి ప్రతిగా భారత్ ‘ఆపరేషన్ సిందూర్’ పేరిట పాక్, పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్ర స్థావరాలపై దాడులు చేసింది. అయితే ఈ ఉద్రిక్తతలు పూర్తిగా రెండు దేశాల మధ్య సైనిక స్థాయి చర్చల ద్వారానే పరిష్కారమయ్యాయని భారత్ స్పష్టం చేసింది.
భారత్–పాకిస్థాన్ వ్యవహారాల్లో మూడో పక్షం మధ్యవర్తిత్వానికి ఎలాంటి అవకాశమూ లేదని న్యూఢిల్లీ పలుమార్లు తేల్చి చెప్పింది.
ట్రంప్ వ్యాఖ్యల తర్వాత చైనా ప్రకటన
ఇంతకుముందు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా భారత్–పాక్ మధ్య తాను మధ్యవర్తిత్వం చేశానని పలుమార్లు వ్యాఖ్యానించారు. అయితే ఆ వ్యాఖ్యలను కూడా భారత్ ఖండించింది. ఇప్పుడు చైనా చేసిన ప్రకటనతో, భారత్ స్పష్టమైన వైఖరికి విరుద్ధంగా రెండోసారి ఒక ప్రపంచ శక్తి ఈ తరహా వ్యాఖ్యలు చేయడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: