సుంకాల విషయంలో నిజాయితీయే ముఖ్యం: చైనా-అమెరికా వాణిజ్య చర్చలు
అమెరికా-చైనా మధ్య వాణిజ్య యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో, టారిఫ్లపై చర్చలు ప్రారంభించేందుకు రెండు దేశాల మధ్య పరిణామాలు వేగంగా మారుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదించిన చర్చలపై చైనా తీవ్రంగా స్పందిస్తోంది. వాషింగ్టన్ ఇటీవల తీసుకున్న వాణిజ్య విధానాలు, టారిఫ్ లపై తగ్గింపు నిర్ణయాలపై చర్చలు జరిపేందుకు సిద్ధంగా ఉన్నా, ముందుగా అమెరికా నిజాయితీ చూపించాలని చైనా అభిప్రాయపడింది.చర్చల ప్రతిపాదనపై చైనా వాణిజ్య మంత్రిత్వ శాఖ స్పందిస్తూ, అమెరికా టారిఫ్ సమస్యలపై చర్చలు జరపాలనే ఉద్దేశంతో పలుమార్లు సందేశాలు పంపిందని పేర్కొంది. అయితే, ఇలాంటి చర్చలు జరగాలంటే, తమపై విధించిన ఏకపక్ష సుంకాలను తొలగించేందుకు ముందుగా చర్చలు జరపాలని స్పష్టం చేసింది. బీజింగ్‌తో వ్యవహరిస్తున్న తప్పుడు పద్ధతులను అమెరికా సరిదిద్దాలని సూచించింది.
చైనా-అమెరికా వాణిజ్య చర్చలు
డీల్ కుదుర్చుకోవడానికి బలమైన అవకాశాలున్నాయని ట్రంప్ వ్యాఖ్యానించారు. ఆయన మాట్లాడుతూ, “మా నిబంధనలకు లోబడి ఒప్పందం కుదిరితే అది మంచిదే” అని న్యూస్ నేషన్ టౌన్‌హాల్ కార్యక్రమంలో పేర్కొన్నారు. అయితే, గతంలో చైనా ఈ చర్చల ప్రతిపాదనను ఖండించిన విషయాన్ని కూడా గుర్తుచేసుకోవాలి. బీజింగ్ ప్రతినిధి గువో జియాకున్ అప్పట్లో వాణిజ్య ఒప్పందం జరగలేదని, సంప్రదింపులు లేవని పేర్కొన్నారు. కానీ భవిష్యత్తులో చర్చలకు సిద్ధమని కూడా తెలిపారు.ట్రంప్ అధ్యక్ష పదవిలోకి వచ్చినప్పటి నుంచే చైనా దిగుమతులపై టారిఫ్‌లను భారీగా పెంచుతూ వస్తున్నారు. అమెరికా చైనాపై 145 శాతం సుంకాలను విధించగా, ప్రతిగా చైనా కూడా 125 శాతం టారిఫ్‌లను అమలు చేసింది. దీని వల్ల ఇరు దేశాల మధ్య వాణిజ్య విభేదాలు తీవ్రరూపం దాల్చాయి. కాగా, తాజా పరిణామాల నేపథ్యంలో, ఇరు దేశాల మధ్య నిజాయితీతో కూడిన చర్చలు జరగడం ద్వారా వాణిజ్య ఒప్పందానికి అవకాశం ఉన్నదనే విశ్లేషణ సాగుతోంది.
Read More : Trump: పాకిస్తాన్‌లో నీటి కొరతపై ట్రంప్ ట్రోల్..నిజమేనా?