📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ట్రంప్ వార్నింగ్ అగ్ని ప్రమాదం.. 100 మంది మృతి? సునీతా రిటైర్మెంట్ రికార్డు స్థాయికి చేరిన పసిడి ధరలు కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ట్రంప్ వార్నింగ్ అగ్ని ప్రమాదం.. 100 మంది మృతి? సునీతా రిటైర్మెంట్ రికార్డు స్థాయికి చేరిన పసిడి ధరలు

British media: తమ ప్రధాని ఆఫీసు ఫోన్లు చైనా హ్యాక్

Author Icon By Vanipushpa
Updated: January 28, 2026 • 12:30 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

పలువురు యూకే ప్రధానుల సన్నిహితుల మొబైల్ ఫోన్లను సైబర్ దాడులతో చైనా హ్యాక్ చేసిందని ఆరోపిస్తూ బ్రిటిష్ పత్రిక ‘ది టెలిగ్రాఫ్’ సంచలన కథనాన్ని ప్రచురించింది. డౌనింగ్ స్ట్రీట్‌‌లోని పలువురు సీనియర్ అధికారుల మొబైల్ ఫోన్లను చాలా ఏళ్లుగా హ్యాక్ చేస్తోందని ఆరోపించింది. టెలిగ్రాఫ్ పత్రిక ఆరోపణలపై చైనా నుంచి ఏలాంటి తక్షణ స్పందన వెలువడలేదు. యూకే (Britain) ప్రధాన మంత్రి కీర్ స్టార్మర్ జనవరి 28న మూడు రోజుల చైనా పర్యటనకు వెళ్లనున్న వేళ టెలిగ్రాఫ్ ఈ ఆరోపణలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.
2021 నుంచి 2024 మధ్యకాలంలో జరిగిన ఈ సైబర్ దాడులు, అప్పటి ప్రధానులైన బోరిస్ జాన్సన్, లిజ్ ట్రస్, రిషి సునాక్‌ల సన్నిహితులను లక్ష్యంగా చేసుకున్నాయని నివేదిక పేర్కొంది. అమెరికాతో సంబంధాలు దెబ్బతిన్న సమయంలో చైనాకు దగ్గరయ్యేందుకు స్టార్మర్ చేస్తున్న ప్రయత్నాలకు ఇబ్బందికరంగా మారాయి. కీర్ స్టార్మర్ జనవరి 28 నుంచి 31 వరకు చైనాలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో ఆయన చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌తో భేటీ కానున్నారు.

Read Also: Ajit Pawar’s Plane Crash : మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం

British media: తమ ప్రధాని ఆఫీసు ఫోన్లు చైనా హ్యాక్ చేసింది

ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలను మరింత పెంచే అవకాశం

చైనా సాంకేతికత, పెట్టుబడులను ఆకర్షించడంతో పాటు, బ్రిటన్ ఆర్థిక సేవలు, కార్లు, స్కాచ్ విస్కీ వంటి ఉత్పత్తులకు చైనా మార్కెట్‌లో మరింత విస్తరించాలని బ్రిటన్ ఆశిస్తోంది. అయితే, ఈ పర్యటనకు ముందే వచ్చిన ఈ హ్యాకింగ్ ఆరోపణలు, ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలను మరింత పెంచే అవకాశం ఉంది. ది టెలిగ్రాఫ్ నివేదిక ప్రకారం.. ‘సాల్ట్ టైఫూన్’ అనే కోడ్ పేరుతో జరిగిన ఈ సైబర్ దాడి.. డౌనింగ్ స్ట్రీట్‌లోని కీలక అధికారుల ఫోన్లను లక్ష్యంగా చేసుకుంది. ప్రధానుల వ్యక్తిగత ఫోన్లు ప్రభావితమయ్యాయో లేదో స్పష్టంగా తెలియకపోయినా, ఈ హ్యాకింగ్ ‘డౌనింగ్ స్ట్రీట్‌ను ప్రభావితం చేసింది’ అని నివేదిక పేర్కొంది. గత నవంబర్‌లో బ్రిటన్ గూఢచార సంస్థ MI5 పార్లమెంట్‌కు చైనా గూఢచర్య బెదిరింపుల గురించి హెచ్చరిక జారీ చేసినట్టు సమాచారం.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

China cyber attack allegations cyber security breach government phone surveillance international cyber espionage prime minister office phones hack Telugu News online Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.