చైనాకు చెందిన నేషనల్ యూనివర్శిటీ ఆఫ్ డిఫెన్స్ టెక్నాలజీ పరిశోధకులు మాగ్లెవ్ రంగంలో అరుదైన ఘనత సాధించారు. (China) ఒక టన్ను బరువున్న టెస్ట్ వాహనాన్ని కేవలం రెండు సెకన్లలోనే గంటకు 700 కిలోమీటర్ల వేగానికి చేర్చి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచారు. సూపర్‌కండక్టింగ్ అయస్కాంతాల సహాయంతో పట్టాలపై గాలిలో తేలుతూ ప్రయాణించే ఈ వాహనం అత్యంత తక్కువ సమయంలోనే అసాధారణ వేగాన్ని అందుకోవడం విశేషం. ఈ ప్రయోగం రవాణా సాంకేతికతలో చైనా ముందంజలో ఉందని మరోసారి నిరూపించింది.
Read also: H-1B: హెచ్1బీ కొత్త విధానంలో పెరిగిన అవకాశం?
అత్యాధునిక ప్రయోగం
ఈ పరీక్షను 400 మీటర్ల పొడవున్న మాగ్నెటిక్ లెవిటేషన్ ట్రాక్‌పై నిర్వహించారు. అతి వేగంగా దూసుకెళ్లిన మాగ్లెవ్ వాహనం, గమ్యానికి చేరిన వెంటనే అదే స్థాయిలో సురక్షితంగా ఆగగలగడం ఈ టెక్నాలజీ సామర్థ్యాన్ని చాటుతోంది. (China) అల్ట్రా హై స్పీడ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ప్రొపల్షన్, హై ఫీల్డ్ సూపర్‌కండక్టింగ్ అయస్కాంతాలు వంటి క్లిష్టమైన సాంకేతిక సవాళ్లను అధిగమించి ఈ విజయాన్ని సాధించినట్లు పరిశోధకులు తెలిపారు. భవిష్యత్తులో హైపర్‌లూప్ ప్రయాణాలు, అంతరిక్ష ప్రయోగాలు, ఎయిర్‌క్రాఫ్ట్ లాంచ్‌లలో ఈ సాంకేతికత కీలకంగా మారనుందని నిపుణుల అంచనా. గత దశాబ్దంగా నిరంతర పరిశోధనల ఫలితంగా ఈ రికార్డు సాధ్యమైంది. ఈ ఏడాది ఆరంభంలోనే గంటకు 648 కిలోమీటర్ల వేగాన్ని అందుకున్న బృందం, ఇప్పుడు తమ సొంత రికార్డునే అధిగమించింది. ప్రస్తుతం గంటకు 1000 కిలోమీటర్ల వేగం లక్ష్యంగా మరో భారీ ప్రాజెక్టుపై చైనా పని చేస్తోంది. అది సఫలమైతే, నేలపై ప్రయాణించే వాహనాలు విమానాలకంటే వేగంగా దూసుకెళ్లే రోజులు దగ్గరలోనే ఉన్నాయని నిపుణులు భావిస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read also: