📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

China: పెళ్లి ముందు గర్భం దాలిస్తే జరిమానా.. ఎక్కడో తెలుసా?

Author Icon By Rajitha
Updated: December 28, 2025 • 12:33 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

చైనాలోని యునాన్ ప్రావిన్స్‌లోని లిన్‌కాంగ్ జిల్లాకు చెందిన ఓ గ్రామం తీసుకున్న నిర్ణయాలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. పెళ్లి కాకముందే సహజీవనం చేయడం, గర్భం దాల్చడం వంటి అంశాలను అరికట్టాలనే ఉద్దేశంతో గ్రామ పెద్దలు కఠిన నిబంధనలు అమలు చేశారు. వివాహం లేకుండా కలిసి జీవిస్తే ఏటా 500 యువాన్లు (సుమారు రూ.6 వేలు) జరిమానా విధిస్తామని ప్రకటించారు.

Read also: Saudi Arabia: భారతీయులను అత్యధికంగా బహిష్కరించిన దేశం!

fine for getting pregnant before marriage

పెళ్లయ్యాక 10 నెలల లోపే బిడ్డకు జన్మనిస్తే

అంతేకాదు, పెళ్లికి ముందే గర్భం దాలిస్తే లేదా పెళ్లయ్యాక 10 నెలల లోపే బిడ్డకు జన్మనిస్తే 3,000 యువాన్లు (సుమారు రూ.38 వేలు) ఫైన్ చెల్లించాల్సిందేనని స్పష్టం చేశారు. ఇతర ప్రాంతానికి చెందిన వ్యక్తిని వివాహం చేసుకుంటే 1,500 యువాన్లు (సుమారు రూ.19 వేలు), దంపతుల మధ్య గొడవలు జరిగి గ్రామ పెద్దల వద్దకు వస్తే ఇద్దరూ చెరో 500 యువాన్లు, మద్యం సేవించి గొడవ చేస్తే 3 వేల నుంచి 5 వేల యువాన్లు జరిమానాగా చెల్లించాలనే నిబంధన కూడా ఉంది.

ఈ నియమాలన్నింటినీ గ్రామ కార్యాలయం ముందు బోర్డు రూపంలో ఏర్పాటు చేశారు. సంప్రదాయ కుటుంబ విలువలు, నైతికతను కాపాడాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయాలు తీసుకున్నామని గ్రామ పెద్దలు తెలిపారు. అయితే ఆ బోర్డు ఫొటో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అధికారులు జోక్యం చేసుకుని దాన్ని తొలగించారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

China news latest news Telugu News Yunnan Province

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.