📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రైలుపై భారీ క్రేన్‌ పడి 22 మంది దుర్మరణం ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఇప్పటివరకు 2,571 మంది మృతి! సిలిండర్ పేలి .. వధూవరులతో సహా 8 మంది మృతి పసిడి ప్రియుల కొంపలు ముంచిన ట్రంప్ చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు రైలుపై భారీ క్రేన్‌ పడి 22 మంది దుర్మరణం ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఇప్పటివరకు 2,571 మంది మృతి! సిలిండర్ పేలి .. వధూవరులతో సహా 8 మంది మృతి పసిడి ప్రియుల కొంపలు ముంచిన ట్రంప్ చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు

India Master Plan: ఈ ప్రాజెక్టులతో చికెన్ నెక్ సేఫ్!

Author Icon By Vanipushpa
Updated: January 17, 2026 • 4:01 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

భారతదేశ ప్రధాన భూభాగంతో ఈశాన్య రాష్ట్రాలను కలిపే ఏకైక మార్గం పశ్చిమ బెంగాల్‌లోని సిలిగురి కారిడార్. కేవలం 20 నుండి 22 కిలోమీటర్ల వెడల్పు మాత్రమే ఉండే ఈ మార్గాన్ని ‘చికెన్ నెక్‘(Chicken neck) అని పిలుస్తారు. యుద్ధం, ఉద్రిక్త పరిస్థితుల్లో శత్రువులు ఈ చిన్న మార్గాన్ని దిగ్బంధిస్తే, ఈశాన్య రాష్ట్రాలు దేశం నుండి విడిపోయే ప్రమాదం ఉంది. ఈ సవాలు అధిగమించడానికి భారత్ ఇప్పుడు ప్రత్యామ్నాయ సముద్ర మార్గాలపై దృష్టి సారించింది. ఈ భౌగోళిక చిక్కుముడికి కారణం 1947 దేశ విభజన సమయంలో జరిగిన చారిత్రక తప్పిదాలే.

Read Also: Amazon smartphone offers : అమెజాన్ రిపబ్లిక్ డే సేల్ షురూ, టాప్ ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!

India Master Plan: ఈ ప్రాజెక్టులతో చికెన్ నెక్ సేఫ్!

చిట్టగాంగ్ ప్రాంతంలో 90% హిందువులు

1947లో సిరిల్ రాడ్‌క్లిఫ్ భారతదేశాన్ని సందర్శించకుండానే 45 రోజుల్లో విభజన రేఖలు గీశారు. అప్పట్లో మన నాయకులు వాయువ్య సరిహద్దులపై పెట్టిన దృష్టిని బెంగాల్ విభజనపై పెట్టలేదు. నిజానికి చిట్టగాంగ్ ప్రాంతంలో 90% హిందువులు ఉండేవారు. ఇది శతాబ్దాలుగా త్రిపుర రాజ్యంతో ముడిపడి ఉండేది. కానీ, చివరి నిమిషంలో బ్రిటీష్ వారు చిట్టగాంగ్‌ను తూర్పు పాకిస్థాన్ (ప్రస్తుత బంగ్లాదేశ్) కు కట్టబెట్టారు. దీనివల్ల ఈశాన్య భారత్ తన సహజసిద్ధమైన సముద్ర మార్గాన్ని కోల్పోయి భూపరివేష్టిత ప్రాంతంగా మిగిలిపోయింది. ప్రస్తుతం భారత్ ఈశాన్య రాష్ట్రాలను సముద్రంతో అనుసంధానించడానికి యుద్ధ ప్రాతిపదికన ప్రాజెక్టులను చేపడుతోంది.

కలదాన్ మల్టీ-మోడల్ ప్రాజెక్ట్ (మయన్మార్):

మిజోరం నుండి మయన్మార్ మీదుగా బంగాళాఖాతాన్ని చేరే మార్గం ఇది. దీని ద్వారా మిజోరం నుండి సముద్ర దూరం కేవలం 250 కిలోమీటర్లు మాత్రమే. ఇది బంగ్లాదేశ్‌తో సంబంధం లేకుండా ఈశాన్య రాష్ట్రాలకు భద్రత కల్పిస్తుంది. మైత్రీ సేతు (బంగ్లాదేశ్): త్రిపురలోని సబ్రూమ్ నుండి బంగ్లాదేశ్‌లోని రామగఢ్ వరకు ఫెనీ నదిపై ఈ వంతెన నిర్మించబడింది. ఇక్కడి నుండి చిట్టగాంగ్ పోర్ట్ కేవలం 80 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. అగర్తలా నుండి కలకత్తాకు రోడ్డు మార్గం 1700 కి.మీ కాగా, చిట్టగాంగ్ మార్గం ద్వారా ఇది చాలా వరకు తగ్గుతుంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

border infrastructure India Chicken Neck Security India defense strategy India strategic projects military preparedness India Northeast India development Telugu News online Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.