Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లో ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది. బిలాస్‌పూర్ జిల్లాలోని జైరామ్‌నగర్ స్టేషన్ సమీపంలో కోర్బా ప్యాసింజర్ రైలు, ఆగి ఉన్న గూడ్స్ రైలును వెనుక నుండి బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కనీసం ఆరుగురు ప్రాణాలు కోల్పోగా, పలువురు ప్రయాణికులు గాయపడ్డారు. ఢీకొన్న ప్రభావంతో ప్యాసింజర్ రైలు మొదటి బోగీ గూడ్స్ రైలుపైకి ఎగబాకిన దృశ్యాలు అక్కడి ప్రజలను కలచివేశాయి. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు అక్కడికి చేరుకొని సహాయక చర్యల్లో పాల్గొన్నారు.
Read also: Adult Videos: నేపాల్ లో ఏం జరిగిందో తెలుసుగా? పోర్న్ బాన్ పై సుప్రీమ్ కోర్ట్
Chhattisgarh: గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు… ఆరుగురి మృతి!
Chhattisgarh: సమాచారం అందుకున్న రైల్వే అధికారులు, రెస్క్యూ బృందాలు తక్షణమే ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలను ప్రారంభించాయి. గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. ఈ ప్రమాదానికి గల కారణాలపై అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. ప్రాథమికంగా మానవ తప్పిదం లేదా సాంకేతిక లోపం కారణమై ఉండవచ్చని అనుమానిస్తున్నారు. ఈ ఘటనతో ప్రాంతంలో తీవ్ర విషాదం నెలకొంది, రైల్వే రవాణా తాత్కాలికంగా అంతరాయం కలిగింది.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: