📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఇండిగో సంక్షోభం పై లోక్‌సభలో వివరణ మైనర్‌ బాలికపై లైంగిక దాడి ఇండిగో సంస్థపై కేంద్రం చర్యలకు సిద్ధం హైదరాబాద్‌లోని రోడ్డుకు ట్రంప్ పేరు? పుతిన్‌కు రాష్ట్రపతి భవన్​లో స్వాగతం పలికిన రాష్ట్రపతి, ప్రధాని మోదీ ఇండిగో విమానాల రద్దుతో ప్రయాణికుల ఇక్కట్లు భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ ఇండిగో సంక్షోభం పై లోక్‌సభలో వివరణ మైనర్‌ బాలికపై లైంగిక దాడి ఇండిగో సంస్థపై కేంద్రం చర్యలకు సిద్ధం హైదరాబాద్‌లోని రోడ్డుకు ట్రంప్ పేరు? పుతిన్‌కు రాష్ట్రపతి భవన్​లో స్వాగతం పలికిన రాష్ట్రపతి, ప్రధాని మోదీ ఇండిగో విమానాల రద్దుతో ప్రయాణికుల ఇక్కట్లు భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్

Chinab: చీనాబ్ నీటికి బ్రేక్.. భారత్‌ నిర్ణయంతో పాక్‌కు నీటి కష్టాలు!

Author Icon By Vanipushpa
Updated: May 6, 2025 • 1:07 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా భారత్‌ కఠిన నిర్ణయాలు తీసుకుంది. ఇందులో ముఖ్యంగా భారత్‌-పాకిస్థాన్ మధ్య సింధూ జలాల ఒప్పందాన్ని నిలిపి వేస్తూ భారత్‌ తీసుకున్న నిర్ణయం దాయాది దేశానికి నీటి కష్టాలను తెచ్చిపెట్టింది. ఈ నిర్ణయం మేరకు చీనాబ్ న‌దిపై నీటి ప్రవాహాన్ని భారత్ అడ్డుకుంది. భారత్ నిర్ణయంతో పాకిస్తాన్‌కు వెళ్లే నీటిలో సుమారు 21 శాతం మేర నీటి కొరత ఏర్పడవచ్చని ఇండస్‌ రివర్‌ సిస్టమ్‌ అథారిటీ అంచనా వేసింది.
ఖరీఫ్ సీజన్‌కు నీటి ఎద్దటి
పలహ్గామ్ ఉగ్రదాడి తర్వాత పాకిస్థాన్‌కు బుద్ది చెప్పాలనే నిర్ణయంతో భారత్‌ 1960 నాటి సింధూ నది జలాల ఒప్పందాన్ని నిలిపి వేసింది. దీంతో భారత్‌ నుంచి పాక్‌కు వెళ్లే నీటిని అడ్డుకుంది. సలాల, బగ్‌లిహార్‌ డ్యామ్‌ల గేట్లు మూసేయడంతో పాక్‌కు వెళ్లే నీరు చాలావరకు తగ్గింది. దీంతో పాకిస్థాన్‌లో నీటి కష్టాలు ఏర్పడుతున్నాయి. మరోవైపు కిషన్‌ గంగాపై కూడా ఇలాంటి చర్యనే తీసుకోవాలని భారత్‌ భావిస్తోంది.

Chinab: చీనాబ్ నీటికి బ్రేక్.. భారత్‌ నిర్ణయంతో పాక్‌కు నీటి కష్టాలు!

అయితే రాబోయే ఖరీఫ్ సీజన్‌కు నీటి లభ్యతను అంచనా వేసేందుకు ఐఎస్‌ఆర్‌ఏ సమావేశం నిర్వహించింది. భారత్ తీసుకున్న నిర్ణయంతో ఖరీఫ్ ప్రారంభ దశలో పాకిస్తాన్‌కు వచ్చే నీటిలో సుమారు 21 శాతం నీరు తగ్గినట్లు సమావేశంలో అధికారులు అంచనా వేశారు. అయితే మరాల వద్ద చీనాబ్‌ నదిలో నీటి లభ్యత పడిపోవడం మరింత ఆందోళనను కలిగిస్తోంది.
చీనాబ్‌ నది నీటిపైనే ఆధారం
ముఖ్యంగా పాకిస్తాన్‌ వ్యవసాయంలో చాలా శాతం చీనాబ్‌ నది నీటిపైనే ఆధారపడి ఉన్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే ఈ నదిపైనే ఎక్కువ కెనాల్స్ ఉన్నాయి. అయితే ఈ కెనాల్స్‌ నుంచి వెళ్లే నీటినే పాకిస్తాన్‌లోని ప్రజలు వ్యవసాయానికి వినియోగిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే ఇప్పుడు భారత్‌ చీనాబ్‌ నదిపై నీటిని ఆపేయడంతో పాకిస్థాన్‌కు నీటి కష్టాలు మొదలయ్యాయి.

Read Also: Pak, Bangladesh: పాక్, బంగ్లా సరిహద్దుల్లో భారత్ మరింత కట్టుదిట్టం

#telugu News Breaking News in Telugu Chenab water break .. Google news Google News in Telugu Latest News in Telugu Pakistan's water problems due to India's decision! Paper Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.