📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Latest News: Charlie Kirk – భారతీయులకు వీసాలు ఇవ్వొద్దు.. వైరల్ అవుతున్న చార్లీ కిర్క్ వ్యాఖ్యలు

Author Icon By Anusha
Updated: September 11, 2025 • 1:58 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

అమెరికాకు చెందిన కన్జర్వేటివ్ నాయకుడు చార్లీ కిర్క్ (Charlie Kirk) ఉటాలో జరిగిన దాడిలో దుర్మరణం చెందారు. కిర్క్ ఉటా వ్యాలీ యూనివర్శిటీ,కార్యక్రమంలో మాట్లాడుతుండగా, ఓ దుండగుడు ఆయనపై కాల్పులకు పాల్పడ్డాడు. దీంతో చార్లీ కిర్క్ కు తీవ్ర గాయాలు అయ్యాయి. వెంటనేఆయన్ని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించారు. ఈ మేరకు కిర్క్ చనిపోయినట్లు ట్రంప్ ధ్రువీకరించారు.

అయితే ఈ హత్యకు వారం రోజుల ముందే కిర్క్ భారతీయులకు వీసాల విషయంలో చేసిన కామెంట్లు తీవ్ర చర్చకు దారితీశాయి. ముఖ్యంగా వలసలు, ఔట్సోర్సింగ్ వల్ల అమెరికన్లకు ఉద్యోగాలు తగ్గిపోతున్నాయని ఆయన ఆరోపించారు. భారతీయులకు వీసా (Visa) లు ఇవ్వడం ఆపేయాలని కూడా డిమాండ్ చేశారు. కిర్క్ మరణం తర్వాత ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మన ప్రజలకే ప్రాధాన్యత ఇద్దాం

ఇక చాలు. మనదేశం నిండిపోయింది. మన ప్రజలకే ప్రాధాన్యత ఇద్దాం’ అని కిర్క్ కామెంట్లు చేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) కు ముఖ్య సహాయకుడిగా ఉన్న 32 ఏళ్ల కిర్క్ సెప్టెంబర్ 2న ‘అమెరికా ఫస్ట్’ అనే చర్చల్లో పాల్గొన్నారు.

Charlie Kirk

ఇందులో భాగంగానే అమెరికా,భారతీయులకు వీసాలు ఇవ్వడం ఆపేయాలని ఆయన గట్టిగా వాదించారు. ఎక్స్ వేదికగా పోస్టు పెడుతూ ‘అన్ని దేశాల వలస కార్మికుల కంటే కూడా భారతీయుల వల్లే అమెరికన్లకు పెద్దగా ఉద్యోగావకాశాలు ఉండడం లేదని ఆరోపించారు.

న్యూఢిల్లీలో ఏదైనా వాణిజ్య ఒప్పందం కుదిరితే

అమెరికా భారతీయులకు మరింత వీసాలు ఇవ్వాల్సి వస్తుందని ఫాక్స్ న్యూస్ యాంకర్ చేసిన ఎక్స్ పోస్టుపై కిర్క్ ఈ విధంగా స్పందించారు. ఈఘటనకు సంబంధించిన అనేక వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి. వాటిలో కిర్క్ కుర్చీలో నుంచి పడిపోతూ
తన మెడను పట్టుకున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి.

    Read hindi news:hindi.vaartha.com

    Read Also:

    https://vaartha.com/nepal-talks-for-interim-leader-in-nepal/international/545219/

    Breaking News Charlie Kirk immigration comments Indian visas latest news outsourcing debate political remarks social media viral Telugu News US jobs impact visa controversy

    గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.