📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

CHINA RENAMING : పేర్లు మార్చడం వృథా ప్రయత్నమే .. చైనాపై భారత్ ఫైర్

Author Icon By Sudha
Updated: May 14, 2025 • 11:11 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

అరుణాచల్‌ప్రదేశ్‌లోని కొన్నిప్రాంతాలకు చైనా తమ పేర్లు పెట్టడంపై భారత్‌ తీవ్రంగా మండిపడింది. ఇది వృథా, అహంకారపూరిత చర్యగా అభివర్ణించింది. అరుణాచల్‌ప్రదేశ్‌(Arunachal Pradesh)లో కొన్నిప్రాంతాలకు చైనా(China) పేర్లు పెట్టిన విషయం తమ దృష్టికి వచ్చిందన్న భారత్‌, అది వృథా ప్రయత్నమని పేర్కొంది. అలాంటి ప్రయత్నాలను నిర్ద్వంద్వంగా తిరస్కరించే తమ వైఖరిలో ఎలాంటి మార్పు లేదని స్పష్టం చేసింది.

CHINA RENAMING : పేర్లు మార్చడం వృథా ప్రయత్నమే : చైనాపై భారత్ ఫైర్​


భారత్‌ నుంచి విడదీయలేని అంతర్భాగం: జైస్వాల్
పేర్లు పెట్టడం ద్వారా తిరస్కరించలేదని వాస్తవాలను మార్చలేరని చైనాకు గట్టిగా చురకలు అంటించింది భారత్. అరుణాచల్‌ప్రదేశ్‌ ఎప్పటికీ భారత్‌ నుంచి విడదీయలేని అంతర్భాగమని భారత విదేశాంగశాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ (Randhir జైస్వాల్) స్పష్టం చేశారు. పేర్లు మార్చినా వాస్తవాలు మారవని తెలిపారు.
అరుణాచల్‌ప్రదేశ్​లోని అనేక ప్రాంతాల పేర్లు మార్చి తరచూ మ్యాప్‌లను విడుదల చేయడం చైనాకు పరిపాటిగా మారింది. అది​ తమ భూభాగమే అని చాలా ఏళ్లుగా చైనా అంటూనే ఉంది. అరుణాచల్ ప్రదేశ్‌లో సాంస్కృతిక పరిరక్షణకు తాము కట్టుబడి ఉన్నామని, ఆ చర్యల్లో భాగంగానే అక్కడి ప్రాంతాలకు చైనీస్ పేర్లు పెడుతున్నామని డ్రాగన్ కొంతకాలంగా వాదిస్తోంది.
6 ప్రాంతాలకు కొత్త పేర్లు
ఇప్పటికే అనేక సార్లు జాబితాలను విడుదల చేసింది. అరుణాచల్ ప్రదేశ్‌లోని 6 ప్రాంతాలకు కొత్త పేర్లు పెడుతూ మొదటి జాబితాను 2017లో చైనా పౌర వ్యవహారాల శాఖ రిలీజ్ చేసింది. ఆ తర్వాత 2021లో 15, 2023లో 11 ప్రాంతాలకు కొత్త పేర్లు పెడుతూ మరో రెండు లిస్టులను డ్రాగన్ విడుదల చేసింది. 2024లో కూడా అరుణాచల్‌ప్రదేశ్‌లోని 30 ప్రదేశాలకు చైనా కొత్త పేర్లతో జాబితాను తీసుకొచ్చింది.\
‘అరుణాచల్‌లోని ఆ 30 ప్రాంతాలను కొత్త పేర్లతోనే పిలవాలి. చైనా సార్వభౌమాధికార హక్కులకు క్లెయిమ్ చేసుకునే ప్రదేశాల పేర్లను విదేశీ భాషలలో పిలవకూడదు. వాటి పేర్లను విదేశీ భాషల నుంచి చైనీస్‌లోకి అనువదించకూడదు’ అంటూ అప్పట్లో స్టేట్​మెంట్ ఇవ్వగా, భారత్ తోసిపుచ్చింది. ఇప్పుడు మరోసారి అలాంటి ప్రయత్నమే చేయగా, నిరాధార వాదనలు వల్లె వేస్తే వాస్తవాలు మారవని స్ఫష్టం చేసింది భారత్.

Read Also : Donald Trump : సౌదీ అరేబియా పర్యటనలో ట్రంప్

a waste of effort: Breaking News in Telugu Changing names is Google news Google News in Telugu India fires at China Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.