సరసాలు.. రోమాన్స్ కు కూడా ఒక పద్ధతి ఉంటుంది. ఎక్కడ పడితే అక్కడ.. ఎవరూ లేరనుకుని శృతిమించితే తప్పదు వేటు అని నిరూపించింది ఈ ఘటన. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.. అమెరికాకు చెందిన ఆస్ట్రోనామర్ కంపెనీ (Astronomer Company) సీఈవో ఆండీ బైరనైపై వేటు పడింది. కోల్డ్ ప్లే కన్సర్ట్ పోగ్రామ్లో ఆ కంపెనీకి చెందిన హెచ్ఐర్ మేనేజర్తో అతను రోమాన్స్ చేస్తూ కనిపించాడు. ఆ వీడియో కాస్త వైరల్ కావడంతో కంపెనీ ఈ అంశాన్ని సీరియస్గా తీసుకున్నది. బోసన్లో జరుగుతున్న మ్యూజిక్ షో సమయంలో ఆఫ్రోనామర్ కంపెనీకి చెందిన సీనియర్ ఉద్యోగులు ఫుల్ రోమాన్స్ మూడ్లో ఉన్నారు.
తన్మయత్వంతో ఊగిపోయిన ఇద్దరూ..
కంపెనీలో చీఫీ పీపుల్స్ ఆఫీసర్లో పనిచేస్తున్న క్రిస్టిన్ కాబటన్ను (Christine Cabatan) గట్టిగా హత్తుకుని సీఈవో ఆండీ బైరన్ నృత్యం చేశారు. ఎంతగా అంటే ఈలోకాన్ని మర్చిపోయి, తన్మయత్వంతో.. ఆప్యాయతతో ఊగిపోయారు. కన్సర్ట్ షోకు చెందిన లైట్లు వారిపై ఫోకస్ చేయగానే ఆ జంట హఠాత్తుగా విడిపోయారు. ఒకరి నుంచి ఒకరు దూరం వెళ్తే ప్రయత్నం చేశారు. ఈ ఘటన కాస్త సోషల్ మీడియా లో వైరల్ కావడంతో సదరు కంపెనీ చర్యలకు దిగింది. సీఈవో ఆండీ బైరన్న్ సస్పెండ్ (suspend) చేస్తూ లీవ్ మీద పంపించింది.
Read hindi news: hindi.vaartha.com
Read also: Donald Trump: భారత్, పాక్ యుద్దాన్ని ఆపినట్లు మరోసారి ట్రంప్ గొప్పలు