📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఇండిగో సంక్షోభం పై లోక్‌సభలో వివరణ మైనర్‌ బాలికపై లైంగిక దాడి ఇండిగో సంస్థపై కేంద్రం చర్యలకు సిద్ధం హైదరాబాద్‌లోని రోడ్డుకు ట్రంప్ పేరు? పుతిన్‌కు రాష్ట్రపతి భవన్​లో స్వాగతం పలికిన రాష్ట్రపతి, ప్రధాని మోదీ ఇండిగో విమానాల రద్దుతో ప్రయాణికుల ఇక్కట్లు భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ ఇండిగో సంక్షోభం పై లోక్‌సభలో వివరణ మైనర్‌ బాలికపై లైంగిక దాడి ఇండిగో సంస్థపై కేంద్రం చర్యలకు సిద్ధం హైదరాబాద్‌లోని రోడ్డుకు ట్రంప్ పేరు? పుతిన్‌కు రాష్ట్రపతి భవన్​లో స్వాగతం పలికిన రాష్ట్రపతి, ప్రధాని మోదీ ఇండిగో విమానాల రద్దుతో ప్రయాణికుల ఇక్కట్లు భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్

Latest Telugu News: Indigo: ఇండిగో సంస్థపై కేంద్రం చర్యలకు సిద్ధం

Author Icon By Vanipushpa
Updated: December 8, 2025 • 1:33 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

భారతదేశంలో అతిపెద్ద విమానయాన సంస్థగా ఉన్న ఇండిగో(Indigo) గత కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా వేలాది మంది ప్రయాణికులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తూ.. వందలాది విమానాలను రద్దు చేయడం, మరికొన్ని విమానాలను ఆలస్యాలతో నడపడం వంటి సమస్యలతో తీవ్ర విమర్శలపాలవుతోంది. ఈ పరిణామాల నేపథ్యంలో సివిల్ ఏవియేషన్ నియంత్రణ సంస్థ DGCA (డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్) ఇండిగోపై కఠిన చర్యలకు సిద్ధమైంది. ప్రయాణికుల్లో తీవ్ర గందరగోళం నెలకొన్న నేపథ్యంలో, DGCA శనివారం ఇండిగోకు షో-కాజ్ నోటీసు జారీ చేసి, దీనిపై సమగ్ర వివరణ ఇవ్వాలని కోరింది. ఈ నేపథ్యంలో ఇండిగో CEO పీటర్ ఎల్బర్స్, జవాబుదారీ మేనేజర్, COO ఇసిడ్రే పోర్క్వెరాస్ తమ సమాధానాన్ని సమర్పించడానికి అదనంగా సమయం ఇవ్వాలని కోరగా.. DGCA 24 గంటల పొడిగింపు మంజూరు చేసింది.

Read Also: South africa: దక్షిణాఫ్రికాలో హాస్టల్‌పై దారుణ కాల్పులు – 11 మంది మృతి

Indigo Airlines

ఇండిగో అత్యధికంగా 400కి పైగా విమానాలను రద్దు

రద్దుల అసలైన కారణంగా కొత్త విమాన విధి, విశ్రాంతి కాల నిబంధనల అమలు సమయంలో సరైన సిబ్బంది ప్రణాళిక లేకపోవడమే ప్రధాన కారణమని విమానయాన రంగ నిపుణులు భావిస్తున్నారు. ఈ నిబంధనల అమల్లో తాత్కాలిక సడలింపులను పొందిన ఒక రోజు తర్వాతే ఇండిగో అత్యధికంగా 400కి పైగా విమానాలను రద్దు చేసింది. ముఖ్యంగా ఢిల్లీ, ముంబై, బెంగళూరు, హైదరాబాద్ వంటి ప్రధాన విమానాశ్రయాల్లో ప్రయాణికులు విమాన కౌంటర్ల వద్ద పెద్ద క్యూల్లో నిలబడాల్సి వచ్చింది. సామాను పోయిన వారు, రీబుకింగ్ కోసం ప్రయత్నించిన వారు గంటల తరబడి వేచిచూడాల్సి వచ్చి ప్రయాణికులు తీవ్ర మానసిక ఒత్తిడికి గురైనట్లు స్పష్టమైంది.

ఇండిగోపై తగిన చర్యలు తప్పవు

ఆయన మాట్లాడుతూ DGCA ఇప్పటికే నలుగరు సభ్యుల విచారణ కమిటీని ఏర్పాటు చేసిందని.. ఇండిగోపై తగిన చర్యలు తప్పవని తెలిపారు. అంతేకాక ఎయిర్‌లైన్‌లు టికెట్ల అమ్మకాలపై ప్రభుత్వం తాత్కాలిక పరిమితులు విధించింది. ఇక ప్రయాణికుల కోసం ప్రత్యేక సపోర్ట్ సెల్‌లు ఏర్పాటు చేసి, రీఫండ్ ప్రక్రియలను వేగవంతం చేసినట్లు ప్రభుత్వం తెలిపింది. ఇప్పటివరకు ఇండిగో రూ. 610 కోట్ల రీఫండ్‌ను ప్రాసెస్ చేసినట్లు సమాచారం. రద్దైన విమానాల రీషెడ్యూలింగ్‌కు అదనపు ఫీజులు వసూలు చేయడం లేదని కూడా ప్రకటించింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read also:

Airline Regulation Aviation News Breaking News in Telugu Central Government Action DGCA Updates Google News in Telugu Government Measures Indian Aviation Industry Indigo Airlines Latest In telugu news Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.