📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

West Asia War: పెట్రోల్, డీజిల్ ధరల‌పై కేంద్రం కీల‌క ప్ర‌క‌ట‌న‌

Author Icon By Vanipushpa
Updated: March 9, 2026 • 3:56 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

పశ్చిమాసియా(West Asia)లో పెరుగుతున్న ఉద్రిక్తతల కారణంగా అంతర్జాతీయ ముడి చమురు ధరలు భారీగా పెరుగుతున్నాయి. ఇటీవల బ్రెంట్ క్రూడ్ 28 శాతం పెరిగి 116 డాలర్లకు చేరింది. వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియెట్ (WTI) 27 శాతం పెరిగి 116 డాలర్లకు చేరడంతో మరింతగా పెరుగుతాయనే సూచనలు కనిపిస్తున్నాయి.. 2022 తర్వాత ఇదే మొదటిసారి 100 డాలర్ల మార్కును దాటిన సంఘటనగా మనం చూడవచ్చు. సాధారణంగా అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధర పెరిగినప్పుడు.. మన దేశంలో పెట్రోల్, డీజిల్ రిటైల్ ధరలను సరిచేసే సన్నాహాలు జరుగుతాయి. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం సాధారణ వినియోగదారులపై భారం పడకుండా చూసుకోవాలని నిర్ణయించింది. కేంద్ర ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేసినట్లుగా.. దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలను తక్షణమే పెంచే ఆలోచన ఏదీ లేదు. ఈ నిర్ణయం సామాన్య ప్రజలకు ఊరట కలిగించింది. ప్రస్తుతానికి ఈ భారాన్ని ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ కంపెనీలు (OMCs) భరించనున్నాయి.

Read Also: Kavuri Sambasiva Rao: మచిలీపట్నం మాజీ ఎంపీ కావూరి సాంబశివరావు ఇకలేరు

West Asia War: The Center’s key announcement on petrol and diesel prices

ముంచుకొస్తున్న 1970 చమురు సంక్షోభం..

దీంతో రిటైల్ ధరలు యథాతథంగా కొనసాగుతాయి. ప్రజలు రోజువారీ ఖర్చులను అదనంగా చెల్లించాల్సిన అవసరం లేదు. మధ్యప్రాచ్యంలో నెలకొన్న తీవ్ర ఉద్రిక్తతలు, హోర్ముజ్ జలసంధి వద్ద సరఫరాలకు అంతరాయాలు ఏర్పడటంతో అంతర్జాతీయ చమురు ధరల్లో ఒక్కసారిగా పెరుగుదల జరిగింది. భారత్ ఇప్పటికే వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ.. హోర్ముజ్ మార్గంపై ఆధారపడటాన్ని తగ్గించుకుంది. గతంలో భారత్ ముడి చమురు దిగుమతులలో 60 శాతం హోర్ముజ్ మార్గంపై ఆధారపడి ఉండగా.. ఇప్పుడు దాన్ని 70 శాతం స్థాయికి పెంచింది. తద్వారా సరఫరాలు మరింత స్థిరంగా ఉండటం, దేశీయ మార్కెట్‌కి ప్రభావం తగ్గించడం సాధ్యమవుతోంది. ధరల పెరుగుదలతో పలు దేశాలు విలవిల.. మధ్యప్రాచ్యంలో యుద్ధం మరికొన్ని రోజులు కొనసాగితే, గల్ఫ్ దేశాలు సరఫరాలను నిలిపివేసే ప్రమాదం ఉందని విశ్వవిద్యాలయాలు, ఇంధన నిపుణులు, మూడో పక్ష ప్రభుత్వ అధికారులు హెచ్చరిస్తున్నారు. అప్పుడు ముడి చమురు ధర బ్యారెల్‌కు 150 డాలర్లకు, సహజ వాయువు ధర 40 డాలర్లకు చేరవచ్చు అని ఖతార్ ఇంధన శాఖ మంత్రి హెచ్చరించారు. మరోవైపు, ఇరాన్ అణు ముప్పు నేపథ్యంలో చమురు ధరల పెరుగుదల తాత్కాలికమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

central government announcement Crude Oil Prices diesel price india Fuel Price Update March 2026 Hardeep Singh Puri Indian Energy Stocks Ministry of Petroleum and Natural Gas Petrol Diesel No Price Hike Petrol Price Today Telugu News Paper Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.