📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు మరోదేశంపై ట్రంప్ దాడికి సిద్ధం! వెనిజులా పై యూఎస్ బలగాల మెరుపు దాడి.. 55 మంది మృతి! హిందువులపై ఆగని అకృత్యాలు.. ఇద్దరు హత్య వెనెజువెలా వ్యవహారంపై అమెరికాకు చైనా హెచ్చరిక | షీ జిన్‌పింగ్ చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు మరోదేశంపై ట్రంప్ దాడికి సిద్ధం! వెనిజులా పై యూఎస్ బలగాల మెరుపు దాడి.. 55 మంది మృతి! హిందువులపై ఆగని అకృత్యాలు.. ఇద్దరు హత్య వెనెజువెలా వ్యవహారంపై అమెరికాకు చైనా హెచ్చరిక | షీ జిన్‌పింగ్

Russia : కాల్పుల విరమణ.. దాడులు మాత్రం ఆగడం లేదు : జెలెన్‌స్కీ

Author Icon By sumalatha chinthakayala
Updated: April 21, 2025 • 7:52 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Russia: ఈస్టర్ సందర్భంగా తాత్కాలిక కాల్పుల విరమరణ పాటిస్తామని ప్రకటించిన రష్యా ఆ మాటకు కట్టుబడి లేదని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌ స్కీ ఆరోపించారు. ఈస్టర్‌ కాల్పుల విరమణను గౌరవిస్తున్నట్లు తప్పుడు వైఖరిని ఆ దేశం ప్రదర్శిస్తోందన్నారు. ఎప్పటి లాగే తమ పై దాడులు కొనసాగించిందని..పదుల కొద్ది డ్రోన్‌,బాంబు దాడుల ఘటనలు నమోదయ్యాయని తెలిపారు.

సుమారు 50కి పైగా బాంబు దాడులు

మరో వైపు ..కీవ్‌ బలగాలూ దాడులు కొనసాగిస్తున్నట్లు రష్యా ఆక్రమిత ఉక్రెయిన్‌ లోని అధికారులు ఆరోపించారు.”తాత్కాలిక కాల్పుల విరమణను గౌరవిస్తున్నటు రష్యా సైన్యం చెబుతోంది.కానీ ,యుద్ధ క్షేత్రంలో పైచేయి సాధించే, మా దేశానికి నష్టం కలిగించే ఏ అవకాశాన్నీ జారవిడుచుకోవడం లేదు. సుమారు 50కి పైగా బాంబు దాడులు,పదుల కొద్ది డ్రోన్‌ దాడులకు పాల్పడింది.

యుద్ధాన్ని ముగించే ఉద్దేశం ఆ దేశానికి లేదు

ఉదయం10 గంటల నుంచి తీవ్రత మరింత పెరిగింది. అయితే వైమానిక దాడులకు సంబంధించి సైరన్‌ లు మోగకపోవడం కాస్త ఉపశమనం కలిగించే అంశం. క్షేత్రస్థాయి పరిస్థితులు పరిశీలిస్తుంటే..పుతిన్‌ కు తన సైన్యం పై పూర్తి నియంత్రణ లేదని..లేదా,యుద్ధాన్ని ముగించే ఉద్దేశం ఆ దేశానికి లేదనేది స్పష్టమవుతోంది అని జెలెన్‌ స్కీ ట్వీట్లు చేశారు.

కాల్పుల విరమణ షరతులకు పూర్తిగా కట్టుబడి ఉండాలి

కాల్పుల విరమణ షరతులకు పూర్తిగా కట్టుబడి ఉండాలని మాస్కోను డిమాండ్‌ చేశారు. ఆదివారం అర్థరాత్రి నుంచి 30 రోజుల పాటు కాల్పుల విరమణను పొడిగించాలనే ప్రతిపాదనను పునరుద్ఘాటించారు. ఇదిలా ఉండగా..రష్యా,ఉక్రెయిన్‌ ల మధ్య శాంతి ఒప్పందంలో భాగంగా క్రిమియా పై మాస్కో నియంత్రణను గుర్తించేందుకు అమెరికా సిద్ధంగా ఉన్నట్లు కథనాలు వచ్చిన విషయం తెలిసిందే.

కష్టమైనా చర్చలకు సిద్ధం

ఈ శాంతి ప్రతిపాదన వల్ల రెండు దేశాల మధ్య తక్షణ కాల్పుల విరమణ అమల్లోకి వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. ఇందులో భాగంగా రూపొందించిన ఫ్రేమ్‌ వర్క్‌ ను ఉక్రెయిన్‌, ఐరోపా యంత్రాంగాలు పారిస్‌ లో పరిశీలించాయి. క్రిమియా పై రష్యా నియంత్రణ కొనసాగడానికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ అనుకూలంగా ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. మరోవైపు ..కష్టమైనా చర్చలకు సిద్ధంగా ఉన్నామని రష్యా ప్రకటించింది.

Read Also: పాక్లో హిందూ మంత్రి కాన్వాయ్ పై దాడి

attacks are not stopping Breaking News in Telugu Ceasefire Google news Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news Zelensky

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.