📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

CDS: ఆ మూడుదేశాల కలయిక భారత్ భద్రతకు ముప్పు: అనిల్ చౌహాన్

Author Icon By Vanipushpa
Updated: July 9, 2025 • 3:45 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

చైనా, పాకిస్థాన్, బంగ్లాదేశ్‌(China, Pakistan, Bangladesh)ల కలయిక భారత్(India) సుస్థిరత, భద్రతకు తీవ్ర సవాళ్లను సృష్టించగలదని చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) జనరల్ అనిల్ చౌహాన్(Anil Chauhan) వ్యాఖ్యానించారు. హిందూ మహాసముద్ర(Hindu Ocean) ప్రాంతంలోని పలు దేశాల్లో ఏర్పడిన ఆర్థిక సంక్షోభాన్ని అదునుగా చేసుకొని, వాటిపై విదేశీ శక్తులు పట్టును పెంచుకునే ముప్పు ఉందన్నారు. దీనివల్ల కూడా భారత్‌‌కు సవాళ్లు ఎదురయ్యే అవకాశం ఉందని చెప్పారు. ‘అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్’ ఆధ్వర్యంలో న్యూ దిల్లీలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో ప్రసంగిస్తూ సీడీఎస్ ఈ వ్యాఖ్యలు చేశారు. గత ఐదేళ్లలో పాక్ కొనుగోలు చేసిన ఆయుధాల్లో దాదాపు 70 నుంచి 80 శాతం చైనావేనని ఆయన గుర్తు చేశారు. చైనా ఆయుధ తయారీ కంపెనీలతో పాకిస్థాన్ పెద్దఎత్తున ఒప్పందాలను కుదుర్చుకుందని అనిల్ చౌహాన్ తెలిపారు. ఆయా కంపెనీల ఆయుధ తయారీ యూనిట్లు, నిపుణులు పాక్‌ గడ్డపై కూడా కార్యకలాపాలు సాగిస్తుండొచ్చని అంచనా వేశారు.

CDS: ఆ మూడుదేశాల కలయిక భారత్ భద్రతకు ముప్పు: అనిల్ చౌహాన్

‘ఆపరేషన్ సిందూర్’ వేళ ..
అణ్వస్త్ర దేశాలైన భారత్- పాక్‌లు మే 7 – 10 మధ్య తొలిసారిగా నేరుగా సైనిక శక్తులతో తలపడ్డాయన్నారు. నాలుగు రోజుల ‘ఆపరేషన్ సిందూర్’ వేళ చైనా సరిహద్దుల్లో ఎలాంటి అసాధారణ సైనిక చర్యలూ చోటుచేసుకోలేదని ఆయన స్పష్టం చేశారు. చైనా- పాక్ మధ్య వ్యూహాత్మక స్నేహం ఉందని,’ఆపరేషన్ సిందూర్’ చాలా తక్కువ రోజులే కొనసాగడంతో చైనా వైపు నుంచి స్పందన రాలేదని సీడీఎస్ జనరల్ అనిల్ చౌహాన్ తెలిపారు. అయినప్పటికీ ఆ రెండు దేశాల స్నేహాన్ని తప్పకుండా భారత్ పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందన్నారు. పాక్ అణ్వాయుధ బ్లాక్‌ మెయిలింగ్‌కు భయపడకుండా ‘ఆపరేషన్ సిందూర్‌’ను భారత్ నిర్వహించిందన్నారు. రెండు అణ్వస్త్ర దేశాల మధ్య సైనిక ఘర్షణకు ఆపరేషన్ సిందూరే ఏకైక ఉదాహరణగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు. భారత్ చేపట్టిన ఈ సైనిక చర్య చాలా ప్రత్యేకమైందని, దాని నుంచి ఆసియా దేశాలతో పాటు యావత్ ప్రపంచం పాఠాలను నేర్చుకోవచ్చన్నారు.
పాక్ ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసిన భారత్
‘రాబోయే కాలంలోనూ సంప్రదాయక సైనిక ఘర్షణలే జరిగే అవకాశం ఉంది. అణ్వాయుధాల వినియోగం దాకా పరిస్థితులు తీవ్రతరం కావు. ఇందుకు మూడు ప్రాథమిక కారణాలు ఉన్నాయి. మొదటి కారణం ఏమిటంటే అణ్వాయుధాలను తొలుత ప్రయోగించకూడదనే భారత్ పాలసీ. అందుకే ఏ పరిస్థితుల్లోనైనా పాక్ కూడా భారత్‌తో సాధారణ తరహా (సంప్రదాయక) సైనిక ఘర్షణకే దిగుతుంది. పాక్ స్పందించే రేంజ్​ కంటే పెద్ద రేంజ్​లోనే భారత్ బలమైన సమాధానం ఇవ్వగలదు. ఈవిషయం పాక్‌కు బాగా తెలుసు. అందుకే అది సంప్రదాయక ఘర్షణకే పరిమితం అవుతుంది’ అని సీడీఎస్ జనరల్ అనిల్ చౌహాన్ పేర్కొన్నారు.
సవాళ్లను ఎదుర్కొనేలా భారత్ సమాయత్తం కావాలి
సంప్రదాయక సైనిక ఘర్షణను పతాక స్థాయికి తీసుకెళ్లే సత్తా భారత్‌కు ఉందని సీడీఎస్ జనరల్ అనిల్ చౌహాన్ తెలిపారు. సైబర్, ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ మార్గాల్లోనూ దాడులు జరిపే సత్తా మన దేశానికి ఉందన్నారు. శత్రువులు ఈ తరహా దాడులు చేసినా ధీటుగా ఎదుర్కోగలమని ఆయన పేర్కొన్నారు .

CDS అధికారి ర్యాంక్ ఎంత?
CDS కి స్టార్ ర్యాంకింగ్
భారతదేశంలో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (CDS) నాలుగు నక్షత్రాల అధికారి, భారత సాయుధ దళాలలో అత్యున్నత యూనిఫాం ర్యాంకును కలిగి ఉంటారు.
CDS లేదా NDA ఏది ఉత్తమం?
NDA మరియు CDS: తేడాలను అర్థం చేసుకోవడం మరియు ఏ మార్గాన్ని ...
NDA (నేషనల్ డిఫెన్స్ అకాడమీ) మరియు CDS (కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్) మధ్య ఉత్తమ ఎంపిక వ్యక్తిగత పరిస్థితులు మరియు కెరీర్ లక్ష్యాలపై ఆధారపడి ఉంటుంది.

Read hindi news: hindi.vaartha.com

Read Also:Nitin Gadkari: ఢిల్లీకి వచ్చాక వెంటనే వెళ్ళిపోవాలని అనిపిస్తుంది

#telugu News CDS Anil Chauhan India defence news India Security Threat Trilateral Alliance

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.