📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Viral : నవంబర్ 13న ప్రళయం.. ?

Author Icon By Sudheer
Updated: October 7, 2026 • 7:56 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Viral : సోషల్ మీడియా వేదికగా 2026 నవంబర్ 13న ప్రపంచం అంతమైపోతుందంటూ పెద్ద ఎత్తున భయాందోళనలు సృష్టిస్తున్న పోస్టులు వైరల్ అవుతున్నాయి. “Doomsday: Friday, 13 November, A.D. 2026” అనే శీర్షికతో వస్తున్న ఈ ప్రచారానికి పునాది 1960లో ప్రచురితమైన ఒక పాత పరిశోధనా వ్యాసం. ఆ కాలంలో సైంటిస్ట్ హీంజ్ వాన్ ఫోయెర్స్టర్ మరియు ఆయన బృందం ‘సైన్స్’ మ్యాగజైన్‌లో ఈ వ్యాసాన్ని ప్రచురించారు. ఆ సమయంలో నమోదవుతున్న జనాభా పెరుగుదల వేగాన్ని ఆధారం చేసుకుని, నవంబర్ 13 నాటికి ప్రపంచ జనాభా గరిష్ఠ పరిమితికి చేరి మానవాళికి తీవ్ర గండం ఎదురవుతుందని అందులో పేర్కొన్నారు. అయితే ఈ పాత నివేదికను ప్రస్తుతం కొంతమంది అర్ధసత్యాలతో సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ప్రజల్లో నిరర్థక భయాలను ప్రేరేపిస్తున్నారు.

Read Also : ‘ఫ్లైదుబాయ్’ ఘటనకు సంబంధించి మరో సంచలన విషయం బట్టబయలు

శాస్త్రవేత్తల వివరణ: ఇది కేవలం ఒక గజిత నమూనా మాత్రమే!

ఈ ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని ప్రస్తుత శాస్త్రవేత్తలు మరియు ఖగోళ నిపుణులు తేల్చి చెప్పారు. 1960లలో వాడిన గణిత నమూనాలు (Mathematical Models) అప్పటి జనాభా పెరుగుదల రేటును మాత్రమే పరిగణనలోకి తీసుకున్నాయని, రాబోయే దశాబ్దాల్లో సంభవించే సామాజిక, ఆర్థిక, సాంకేతిక మరియు వైద్యరంగ మార్పులను ఊహించలేకపోయాయని స్పష్టం చేశారు. ఇటీవలి దశాబ్దాల్లో ప్రపంచవ్యాప్తంగా జనాభా పెరుగుదల రేటు గణనీయంగా తగ్గుముఖం పట్టిందని, భూమి భరించలేనంత స్థాయికి జనాభా చేరడం లేదని గణాంకాలు చెప్తున్నాయి. కాబట్టి నవంబర్ 13, 2026 అనేది మిగతా రోజుల్లాగే ఒక సాధారణ రోజుగా గడుస్తుందని, ఎలాంటి ప్రళయం సంభవించదని ప్రజలు ఈ సంచలన వార్తలను నమ్మవద్దని విజ్ఞప్తి చేస్తున్నారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

1960 Science Magazine Paper Doomsday Prediction Google News in Telugu Heinz von Foerster Research Latest News in Telugu November 13 2026 Rumors Telugu News Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.