📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Latest Telugu News: Caroline Leavitt: H-1B వీసా వ్యవస్థను దుర్వినియోగం చేస్తున్నారు: కరోలీనా లివిట్

Author Icon By Vanipushpa
Updated: October 24, 2025 • 11:31 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

హెచ్​-1బీ వీసా ఫీజును లక్ష డాలర్లకు పెంచుతూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ కోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. దీనిని సమర్థించుకోవడానికి ట్రంప్ సర్కార్​ సిద్ధమవుతోంది. ఈ క్రమంలోనే హెచ్​-1బీ వీసా విధానంపై వైట్​హౌస్ ప్రెస్​ సెక్రటరీ కరోలీనా లివిట్(Caroline Leavitt) స్పందించారు. వీసా వ్యవస్థను దుర్వినియోగం చేస్తున్నారని, దీంతో అమెరికన్ల వేతనాలు తగ్గుతున్నాయని పేర్కొన్నారు. వైట్​హౌస్​ మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఈ మేరకు తెలిపారు. ‘ఈ పిటిషన్లపై కోర్టులో పోరాడేందుకు సిద్ధంగా ఉన్నాం.

Read Also: Visa: కొత్త విధానంలో వీసా మార్పులతో స్వాగతం పలుకుతున్న కెనడా

caroline leavitt

అమెరికన్ల వేతనాలు తగ్గాయి

చాలా కాలంగా హెచ్​-1బీ వీసా వ్యవస్థ మోసాలతో నిండిపోయింది. దీంతో అమెరికన్ల వేతనాలు తగ్గాయి. అందుకే ఈ కొత్త విధానాలు అమలయ్యాయి. ఇవి చట్టబద్ధమైనవి. వీటి కోసం కోర్టులో పోరాటం కొనసాగిస్తాం’ అని లివిట్ పేర్కొన్నారు. హెచ్​-1బీ వీసాపై ట్రంప్ సర్కార్​ తీసుకున్న నిర్ణయాన్ని అమెరికా చాంబర్​ ఆఫ్​ కామర్స్ కోర్టులో సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు చేసింది. ఈ నిర్ణయం వీసా వ్యవస్థను దెబ్బతీస్తోందని అమెరికా చాంబర్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్, చీఫ్ పాలసీ ఆఫీసర్ నీల్ బ్రాడ్లీ పేర్కొన్నారు. ‘ఈ కొత్త లక్ష డాలర్ల వీసా ఫీజు చిన్న, మధ్య తరహా కంపెనీలకు పెద్ద భారం అవుతుంది.

ఆర్థిక వృద్ధికి మరిన్ని ఉద్యోగులు అవసరం

ట్రంప్ పన్ను సంస్కరణలు, అమెరికన్ ఎనర్జీ వృద్ధి, నియంత్రణ తగ్గింపు వంటి ప్రోత్సాహక చర్యలు చేపట్టారు. ఈ చర్యలు దేశంలో పెట్టుబడులు పెరగడానికి దోహదపడ్డాయి. ఆర్థిక వృద్ధికి మరిన్ని ఉద్యోగులు అవసరం, తక్కువ కాదు’ అని తెలిపారు. కాలిఫోర్నియా, వాషింగ్టన్ డీసీలో కూడా యూనియన్లు, సంస్థలు, పలు సంఘాలు ఫీజును పెంచడం చట్టవిరుద్ధమని పిటిషన్​ను దాఖలు చేశాయి. దీనిని ఏకపక్షంగా, మోసపూరితంగా ఉందని పేర్కొన్నాయి. హెచ్​-1బీ వీసా కార్యక్రమం 1990లో ప్రారంభమైంది.

కొత్త హెచ్​-1బీ వీసా దరఖాస్తులకు మాత్రమే లక్ష డాలర్లు

అయితే, హెచ్‌-1బీ వీసా ఫీజు ఇప్పటివరకు దాదాపు రూ.1 లక్ష నుంచి రూ.6 లక్షల మధ్యే ఉండేది. తాజాగా ట్రంప్ ప్రభుత్వం ఆ ఫీజును రూ.88 లక్షలకు పెంచింది. దీంతో ఉద్యోగుల్లో తీవ్ర గందరగోళం నెలకొంది. ఆ తర్వాత దీనిపై స్పందించిన అమెరికా కీలక ప్రకటన చేసింది. ఇప్పటికే హెచ్​-1బీ వీసాలు కలిగి ఉన్న వారికి వర్తించదని పేర్కొంది. కొత్త హెచ్​-1బీ వీసా దరఖాస్తులకు మాత్రమే వార్షిక రుసుము లక్ష డాలర్లు ఉంటుందని వైట్​హౌస్​ స్పష్టం చేసింది. ఇప్పటికే ఉన్న వీసా హోల్డర్లకు లేదా పునరుద్ధరణలకు ఈ ఫీజు పెంపు ఉండబోదని తెలిపింది.

కరోలిన్ లెవిట్ ఎవరు?
కరోలిన్ క్లైర్ లీవిట్ జననం ఆగస్టు 24, 1997) ఒక అమెరికన్ రాజకీయ ప్రతినిధి, ఆమె 2025 నుండి రెండవ ట్రంప్ పరిపాలనలో 36వ వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీగా పనిచేస్తున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read Also:

american politics Carolina Leavitt H-1B Visa immigration policy tech industry Telugu News US Immigration US jobs Work visa abuse

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.