📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు మరోదేశంపై ట్రంప్ దాడికి సిద్ధం! వెనిజులా పై యూఎస్ బలగాల మెరుపు దాడి.. 55 మంది మృతి! హిందువులపై ఆగని అకృత్యాలు.. ఇద్దరు హత్య వెనెజువెలా వ్యవహారంపై అమెరికాకు చైనా హెచ్చరిక | షీ జిన్‌పింగ్ ట్రంప్ హెచ్చరికలతో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి చైనా టార్గెట్ గా వెనుజులాపై అమెరికా దాడి న్యూ ఇయర్ దాడి కుట్ర అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు మరోదేశంపై ట్రంప్ దాడికి సిద్ధం! వెనిజులా పై యూఎస్ బలగాల మెరుపు దాడి.. 55 మంది మృతి! హిందువులపై ఆగని అకృత్యాలు.. ఇద్దరు హత్య వెనెజువెలా వ్యవహారంపై అమెరికాకు చైనా హెచ్చరిక | షీ జిన్‌పింగ్ ట్రంప్ హెచ్చరికలతో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి చైనా టార్గెట్ గా వెనుజులాపై అమెరికా దాడి న్యూ ఇయర్ దాడి కుట్ర

Canada:కారుపై మూత్రవిసర్జన వద్దన్నాడు.. ఆ మాత్రానికే ప్రాణం తీసిన నిందితుడు

Author Icon By Pooja
Updated: October 31, 2025 • 5:11 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఒక వ్యక్తిపై పగ తీర్చుకోవాలంటే అందుకు పెద్ద కారణాలు అక్కర్లేదు. చిన్న కారణాలకే ఎదుటివారిపై ఉన్న పగను తీర్చుకుంటున్నారు. కెనడాలో(Canada) ఇదే జరిగింది. భారత సంతతికి చెందిన వ్యాపారవేత్తను ఓ దుండగుడు దాడికి పాల్పడ్డాడు. దీంతో ఐదురోజులు మృత్యువుతో పోరాడిన ఆయన గత శుక్రవారం తుదిశ్వాస వదిలాడు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

read also: Mallikarjun Kharge: ఆర్ఎస్ఎస్‌ను బ్యాన్ చేయాలి : మ‌ల్లిఖార్జున్ ఖ‌ర్గే

Canada:కారుపై మూత్రవిసర్జన వద్దన్నాడు.. ఆ మాత్రానికే ప్రాణం తీసిన నిందితుడు

కారుపై మూత్ర విసర్జన వద్దన్నందుకు దాడి.

55 ఏళ్ల అర్విసింగ్ సాగూ తన స్నేహితురాలితో కలిసి రాత్రి బయటకు వెళ్లాడు. నగరంలోని (Canada) ఓ రెస్టారెంట్ లో భోజనం చేసి తిరిగి ఇంటికి వెళ్లేందుకు నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే తమ కారు వద్దకు వస్తుండగా, అప్పటికే ఒక అపరిచితుడు సాగూ కారుపై మూత్ర విసర్జన చేస్తూ కనిపించాడు. తన కారుపై పోస్తున్న వ్యక్తిని సాగూ నివారించేందుకు ప్రయత్నించాడు. ఆపమంటూ అరిచాడు సాగూ. దానికి ఆ అపరిచితుడు అహంకారంగా ‘నా ఇష్టం..ఏమి చేయాలనుకుంటే అది చేస్తాను’ అంటూ సమాధానం ఇచ్చాడు. ఆక్కడితో ఆగకుండా వెంటనే సాగూ వద్దకు వేగంగా వచ్చి, క్షణాల్లోనే అతని తలపై పిడిగుద్దులు గుద్దాడు.

దీంతో ఒక్కసారిగా కుప్పకూలిపోయిన సాగూ, ఆపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. పక్కనే ఉన్న అతడి స్నేహితురాలు వెంటనే అతడిని స్థానికంగా ఉన్న ఆస్పత్రికి తరలించింది. అంతేకాక సాగూ సోదరుడికి, అతడి భార్యకు ఫోన్ చేసి విషయం చెప్పింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృత్యువుతో పోరాడి ఓడిన సాగూ ఐదురోజులుగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సాగు గత శుక్రవారం మరణించినట్లు వైద్యులు పేర్కొన్నారు. ఈ దారుణానికి పాల్పడిన నిందితుడిని కైల్ పాపిన్ గా ఎడ్మంటన్ పోలీసులు గుర్తించారు. పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

Canadian News Car Argument Latest News in Telugu Murder case Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.