📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Latest news: Canada: అయ్యో! భారీగా వీసాల దరఖాస్తులను తిరస్కరిస్తున్న కెనడా..

Author Icon By Saritha
Updated: November 4, 2025 • 11:45 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్(Donald Trump) రెండవసారి ప్రమాణం చేసిన తర్వాత అక్రమ వలసవాదులపై కఠిన నిర్ణయాలను(Canada) తీసుకుంటున్నారు. అంతేకాక విదేశీలను భారీగా తగ్గించుకునేందుకు వీసాలో పలు కఠిన నిబంధనలను అమలు చేస్తున్నారు. దీంతో ఈ ఏడాది అమెరికాకు భారతీయుల సంఖ్య భారీగా తగ్గింది. దీంతో ఆమధ్య కాలంలో కెనడా ప్రతిభగల వారికి తమ దేశం స్వాగతం పలుకుతున్నని ప్రకటించింది. దీంతో భారతీయులు అమెరికాను వదిలిపెట్టి కెనడాలో ఉన్నత చదువుల కోసం, ఉద్యోగం కోసం వీసాలను దరఖాస్తు చేస్తున్నారు.

Read also: ఛీ..ఛీ..నువ్వేం వైద్యుడివి? డ్రగ్స్ వ్యాపారం చేస్తున్నావ్?

Canada: అయ్యో! భారీగా వీసాల దరఖాస్తులను తిరస్కరిస్తున్న కెనడా..

గట్టి షాకిచ్చిన కెనడా

అయితే భారతీయ విద్యార్థులకు కెనడా(Canada) ప్రభుత్వం గట్టి షాక్ ఇచ్చింది. ఇండియన్ దరఖాస్తులను పెద్ద ఎత్తున తిరస్కరిస్తోంది. ఈ ఏడాది ఆగస్టు నెలలో భారతీయ విద్యార్థులు చేసుకున్న స్టడీ పర్మిట్ దరఖాస్తులలో ఏకండా 74శాతం తిరస్కరణకు గురైనట్లు ప్రభుత్వ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. కెనడా ప్రభుత్వం వరుసగా రెండో ఏడాది అంతర్జాతీయ విద్యార్థుల వీసాల జారీపై పరిమితులు విధించింది. దేశంలోకి వచ్చే తాత్కాలిక వలసదారుల సంఖ్యను తగ్గించడం, స్టూడెంట్ వీసాలకు సంబంధించి జరుగుతున్న మోసాలను అరికట్టడమే లక్ష్యంగా ఈ కఠిన నిబంధనలను అమలు చేస్తోంది. ఈ కొత్త నిబంధనల ప్రభావం భారత్ నుంచి వచ్చే దరఖాస్తుదారులపై తీవ్రంగా పడిండి. ఆగస్టు 2023లో 20,900గా ఉన్న భారతీయ విద్యార్థుల దరఖాస్తుల సంఖ్య 2025 ఆగస్టు నాటికి కేవలం 4,515కు పడిపోయింది.

నకిలీ అడ్మిషన్ లెటర్లతో కెనడా అప్రమత్తం

వీసాల తిరస్కరణ వెనుక ప్రధాన కారణంగా వీసా మోసాలను కెనడా ఇమ్మిగ్రేషన్ విభాగం పేర్కొంది. 2023లో దాదాపు 1,550 దరఖాస్తులు నకిలీ అడ్మిషన్ లెటర్లతో వచ్చినట్లు గుర్తించామని, వాటిలో చాలా వరకు భారత్ నుంచే ఉన్నాయని తెలిసింది. గత ఏడాది పటిష్టమైన వెరిఫికేషన్ వ్యవస్థ ద్వారా 14,000కు పైగా నకిలీ లెటర్లను గుర్తించినట్లు వెల్లడించింది. దీంతో పాటు, విద్యార్థులు తమ ఖర్చుల కోసం చూపించాల్సిన ఆర్థిక నిల్వల నిబంధనలను కూడా కఠినతరం చేసినట్లు ఇమ్మిగ్రేషన్ శాఖ ప్రతినిధి వివరించారు. ఈ విషయంపై ఒట్టావాలోని భారత రాయబార కార్యాలయం స్పందించింది. వీసాల జగారీ కెనడా అంతర్గత విషయమైనప్పటికీ, ప్రపంచంలోనే అత్యుత్తమ ప్రతిభావంతులైన విద్యార్థులు భారత్ లో ఉన్నారని, వారి వల్ల కెనడా విద్యాసంస్థలు ఎంతో ప్రయోజనం పొందాయని పేర్కొంది. కెనడా-భారత్ మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తలు కూడా ఈ పిణామాలకు ఒక కారణంగా విశ్లేషకులు భావిస్తున్నారు. కఠిన నిబంధనల వల్ల కెనడాలో చదువుకోవాలనే భారతీయ విద్యార్థుల కల సాకారం కావడం కష్టతరంగా మారుతోంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper:  epaper.vaartha.com/

Read Also:

canada education Fake Admission Letters Immigration Indian students International Students Latest News in Telugu Ottawa rejection Study Permit Telugu News visa

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.