📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు మరోదేశంపై ట్రంప్ దాడికి సిద్ధం! వెనిజులా పై యూఎస్ బలగాల మెరుపు దాడి.. 55 మంది మృతి! హిందువులపై ఆగని అకృత్యాలు.. ఇద్దరు హత్య వెనెజువెలా వ్యవహారంపై అమెరికాకు చైనా హెచ్చరిక | షీ జిన్‌పింగ్ ట్రంప్ హెచ్చరికలతో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి చైనా టార్గెట్ గా వెనుజులాపై అమెరికా దాడి న్యూ ఇయర్ దాడి కుట్ర అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు మరోదేశంపై ట్రంప్ దాడికి సిద్ధం! వెనిజులా పై యూఎస్ బలగాల మెరుపు దాడి.. 55 మంది మృతి! హిందువులపై ఆగని అకృత్యాలు.. ఇద్దరు హత్య వెనెజువెలా వ్యవహారంపై అమెరికాకు చైనా హెచ్చరిక | షీ జిన్‌పింగ్ ట్రంప్ హెచ్చరికలతో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి చైనా టార్గెట్ గా వెనుజులాపై అమెరికా దాడి న్యూ ఇయర్ దాడి కుట్ర

Latest Telugu News: Visa: కొత్త విధానంలో వీసా మార్పులతో స్వాగతం పలుకుతున్న కెనడా

Author Icon By Vanipushpa
Updated: October 23, 2025 • 3:25 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

హెచ్1బీ వీసా(H1-BVisa) ఫీజును లక్ష డాలర్లకు పెంచుతూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Trump) తీసుకున్న నిర్ణయంపై స్వదేశంలోనే వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. దాని వల్ల అమెరికాకే నష్టం జరుగుతుందని అమెరికన్లు అభిప్రాయపడుతున్నారు. ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని పలువురు అమెరికా కాంగ్రెస్ సభ్యులు కాంగ్రెస్‌కు లేఖ రాశారు. హెచ్1బీ ఫీజు పెంచితే.. అమెరికా కంపెనీలతో పోటీ పడుతున్న విదేశీ కంపెనీలు టెక్ నిపుణులను ఆకర్షిస్తాయని అన్నారు. వీరు అభిప్రాయపడినట్లే.. హెచ్1బీ వీసా కోసం ఎదురు చూస్తున్న వారిని ఆకర్షించేందుకు పలు దేశాలు ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. అందులో ముఖ్యంగా అమెరికా పొరుగు దేశం కెనడా.. కొత్త ప్రతిపాదన చేసింది. తమ వలస విధానంలో మార్పులు చేస్తున్నట్లు ప్రకటించింది.

 Read Also: Bengaluru Rape: ఒంటరిగా ఉన్న మహిళా ఇంట్లోకి జొరబడి అత్యాచారం 

Visa

ట్రంప్, హెచ్1బీ ఫీజును భారీగా పెంచడం వల్ల ప్రభావితమైన వారిని ఆకర్షించేందుకు ఇమ్మిగ్రేషన్ విధానంలో మార్పులు చేయనున్నట్లు కెనడా ప్రధాని మార్క్‌ కార్నీ(Mark Corney) ప్రకటించారు. వచ్చే బడ్జెట్‌లో దానికి సంబంధించిన కొత్త విధానాన్ని ప్రకటిస్తామని తెలిపారు. కెనడా సామాజిక, ఆర్థిక అవసరాలకు తగ్గట్లు వలసలను అనుమతిస్తామని పేర్కొన్నారు. కాగా, హెచ్‌-1బీ వీసాతో అమెరికాలో ఉద్యోగం చేయాలనుకునే ఆశావహులను.. కెనడా వైపు ఆకర్షించడమే ఈ కొత్త వలస విధానం లక్ష్యంగా తెలుస్తోంది. కాగా, కెనడా మాజీ ప్రధాని జస్టిన్ ట్రూడో వలసలపై కఠిన ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే.

వాల్‌మార్ట్ హెచ్1బీ వీసాదారుల నియామకాల నిలిపివేత

వీసా ఫీజు పెంపు గందరగోళం నేపథ్యంలో చాలా అమెరికన్ కంపెనీలు హెచ్1బీ టెక్ నిపుణులను తీసుకునేందుకు జంకుతున్నాయి. ఇటీవల రిటైల్ దిగ్గజం వాల్‌మార్ట్ హెచ్1బీ వీసాదారుల నియామకాలను నిలిపివేసింది. ఇదిలా ఉండగా, హెచ్‌-1బీ వీసా ఫీజుపై నెలకొన్న సందేహాలపై ఇటీవల అమెరికా ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. దాని ప్రకారం హెచ్1బీ వీసాపై విధించిన లక్ష డాలర్ల ఫీజు.. అమెరికాలోనే ఉండి వీసా స్టేటస్‌ను (ఎఫ్1 నుంచి హెచ్1బీ) మార్చుకునే వారికి వర్తించదు. అంతేకాకుండా ఇప్పటికే హెచ్‌1బీ ఉండి కొనసాగింపు కోరే వారికి కూడా ఈ లక్ష డాలర్ల ఫీజు వర్తించదని పేర్కొంది.

మార్క్ కార్నీకి పిల్లలు ఉన్నారా?
వ్యక్తిగత జీవితం. 1994లో, కార్నీ డయానా ఫాక్స్‌ను వివాహం చేసుకున్నాడు. వారికి నలుగురు పిల్లలు ఉన్నారు.

మార్క్ కార్నీ భార్య ఎవరు?
డయానా ఫాక్స్ కార్నీ

Read hindi news: hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read Also:

canada Immigration News Immigration Reforms International Students Student visa Telugu News Visa Policy Work Permit

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.