📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Khalistan : కెనడా నుంచి హిందువులను పంపించేయండి: ఖలిస్థానీల దుష్ప్రచారం

Author Icon By Digital
Updated: May 6, 2025 • 3:25 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఒట్టావా: కెనడాలో ఖలిస్తానీ వేర్పాటువాదుల దుష్చర్యలు ఆగడం లేదు. తాజాగా టొరంటోలోని మాల్టన్ గురుద్వారాలో వారు 8 లక్షల మంది హిందువులను దేశం నుంచి వెనక్కి పంపించాలంటూ ఓ ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా ఖలిస్థానీలు భారత ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, విదేశాంగ మంత్రి జైశంకర్ చిత్రాలను అభ్యంతరకరంగా ఓ బోనులో పెట్టి ప్రదర్శించారు. ఇటీవల ఓ గురుద్వారా మరియు ఓ హిందూ మందిరంలో జరిగిన విధ్వంస ఘటనల తర్వాత ఈ ప్రదర్శన జరగడం గమనార్హం.ఈ ఘటనపై కెనడాలోని హిందూ సమాజానికి చెందిన ప్రముఖ నాయకుడు షవన్ బిండా స్పందించారు. ఆయన ఈ కార్యక్రమం ఖలిస్తానీ గ్రూపు హిందువులపై కలిగించిన ద్వేషాన్ని ప్రతిబింబిస్తోందని, ఇది భారత ప్రభుత్వంపై ఆందోళన కాదు అని స్పష్టం చేశారు. ఈ సందర్భంలో ఆయన గతంలో జరిగిన కనిష్కా బాంబింగ్ ఘటనను గుర్తు చేశారు.

Khalistan : కెనడా నుంచి హిందువులను పంపించేయండి

Khalistan : కెనడా నుంచి హిందువులను పంపించేయండి

ఇక కెనడాకు చెందిన విలేకరి డానియల్ బోర్డమన్ కూడా ఈ ఘటనపై స్పందించారు. ఖలిస్తానీలు హిందువులపై చేస్తున్న వ్యతిరేకతను పబ్లిక్‌గా బయటపెడుతూ, వారు నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని వీడియో రూపంలో సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆయన ఖలిస్తానీలపై చర్యలు తీసుకోవడంలో ప్రస్తుతం అధికారంలో ఉన్న ప్రధాని మార్క్ కార్నీకి, మాజీ ప్రధాని జస్టిన్ ట్రూడోకి తేడా ఉందా? అని ప్రశ్నించారు.ఖలిస్తానీలు కేంద్ర మంత్రులను బెదరించడం ఇదే తొలిసారి కాదు. ఇటీవల రైల్వే శాఖ సహాయ మంత్రి రవనీత్ సింగ్ బిట్టూను హత్య చేయడానికి ఖలిస్తానీలు కుట్రలు పన్నినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. సామాజిక మాధ్యమాల్లో లీకైన కొన్ని స్క్రీన్‌షాట్లు తన దృష్టికి వచ్చాయని ఆయన తెలిపారు. అంతేగాక, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాపై కూడా ఖలిస్తానీ సంస్థ వారిస్ పంజాబ్ డీ సంస్థ నేతలు రక్ష పెంచుకున్నట్లు సమాచారం ఉంది.

Read More : NIA: ఉగ్రదాడిలో ముష్తాక్ అహ్మద్ జర్గర్ పాత్రపై దర్యాప్తు

Anti-India Sentiments Breaking News in Telugu canada Google News in Telugu Hindu Community in Canada indian government Khalistani Protest Khalistani Separatists Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.