📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Latest News: Lawrence Bishnoi: లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ను ఉగ్రవాద సంస్థగా ప్రకటించిన కెనడా

Author Icon By Anusha
Updated: September 29, 2025 • 9:18 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

భారత్‌కు చెందిన కరుడుగట్టిన గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ (Lawrence Bishnoi) నేతృత్వంలోని ముఠాపై కెనడా ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.బిష్ణోయ్ గ్యాంగ్‌ను ఉగ్రవాద సంస్థగా కెనడా ప్రకటించింది. క్రిమినల్ కోడ్ ప్రకారం లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌ను ఉగ్రవాద సంస్థగా గుర్తించినట్టు కెనడా (Canada) హోం శాఖ మంత్రి గ్యారీ ఆనందసంగరీ సోమవారం ప్రకటించారు.

Donald Trump: విదేశీ సినిమాలపై 100 శాతం సుంకం విధించిన ట్రంప్

దీంతో కెనడాలోని బిష్ణోయ్ ముఠా ఆస్తులు (నగదు నుంచి వాహనాలు, ఆస్తి వరకు) స్వాధీనం చేసుకోవడం లేదా స్తంభింపచేయడానికి, ఉగ్రవాద కార్యకలాపాలను నిధులు సమకూర్చడం వంటి వివిధ నేరాలపై ముఠా సభ్యులను విచారించడానికి చట్టబద్దమైన అధికారం దఖలుపడుతుంది. అంతేకాదు, ఈ గ్యాంగ్ సభ్యులకు కెనడాలోకి ప్రవేశించకుండా అడ్డుకోవచ్చు.

రెస్టారెంట్‌పై కాల్పులకు ఈ ముఠాయే బాధ్యత వహించింది

ఇటీవల కెనడాలోని స్టాండప్ కమేడియన్ కపిల్ శర్మ (Kapil Sharma) రెస్టారెంట్‌పై కాల్పులకు ఈ ముఠాయే బాధ్యత వహించింది.‘కెనడాలో ఉగ్రవాదం, హింసకు స్థానం లేదు.. ముఖ్యంగా కొన్ని వర్గాలను లక్ష్యంగా చేసుకుని భయపెట్టడం, బెదిరింపు వాతావరణాన్ని సృష్టించే వాటికి స్థానం లేదు.’’ అని కెనడా ప్రభుత్వం ఓ ప్రకటనలో పేర్కొంది.

కెనడా చట్టం ప్రకారం.. ఇప్పుడు లారెన్స్ బిష్ణోయి గ్యాంగ్‌కు చెందిన లేదా వారి ఆధీనంలో ఉన్న ఆస్తులను గుర్తిస్తారు. ఎవరైనా లావాదేవీలు నిర్వహించినా అది నేరంగా పరిగణిస్తారు. అలాగే, ఆ గ్యాంగ్‌ను వినియోగించుకోవడం లేదా వారికి లబ్ది చేకూర్చేందుకు ఉపయోగపడుతుందని తెలిసి నేరుగా గాని పరోక్షంగా గాని ఆస్తి ఇవ్వడం కూడా నేరమే.

భారత్-కెనడా మధ్య జరిగిన దౌత్య యుద్ధం తర్వాత ఇరు దేశాల సంబంధాలను

ఈ ప్రకటనను ట్రూడో (Trudeau) ప్రధానిగా ఉన్నప్పుడు భారత్-కెనడా మధ్య జరిగిన దౌత్య యుద్ధం తర్వాత ఇరు దేశాల సంబంధాలను సరిదిద్దుకునే ప్రయత్నంలో కీలక అడుగుగా భావించాలి. ఇదే సమయంలో కెనడా ఎంపీ ఫ్రాంక్ కపుటో బిష్ణోయిపై ‘ఉగ్రవాద సంస్థ’గా గుర్తించాలని మంత్రి అనందసంగరీని కోరిన నెల రోజుల్లోనే ఈ ప్రకటన రావడం చెప్పుకోదగ్గ అంశం.

Lawrence Bishnoi

హోం శాఖ మంత్రికి రాసిన లేఖలో లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ దురాగతాలను, విస్తృత క్రిమినల్ సామ్రాజ్యాన్ని కపుటో ఏకరువు పెట్టారు. అతడు ఓ భయంకర నేర చక్రవర్తి అని, ఈ గ్యాంగ్ హత్యలు, కెనడా పౌరులపై దోపిడీలకు పాల్పడిందని, ఇంకా రాజకీయ, మతపర, సిద్ధాంతపర కారణాల కోసం ఇలాంటి అక్రమ కార్యకలాపాలను నిర్వహిస్తోంది’ అని ఆయన పేర్కొన్నారు.

బిష్ణోయి గ్యాంగ్ కార్యకలాపాలు ఉగ్రవాద సంస్థగా

‘బిష్ణోయి గ్యాంగ్ కార్యకలాపాలు ఉగ్రవాద సంస్థగా గుర్తించేందుకు పునాది. వారు కెనడా, విదేశాల్లో జరిగిన విస్తృత హింసకు బాధ్యత వహించినట్టు స్వయంగా ప్రకటించారు’ అని కపుటో తన లేఖను ఎక్స్‌ (ట్విట్టర్) పంచుకున్నారు.

అంతేకాదు, కెనడాలోని సిక్కుల్లో 20 శాతం మంది ఉండే బ్రాంప్టన్ నగర మేయర్ ప్యాట్రిక్ బ్రౌన్, బ్రిటిష్ కొలంబియా ప్రీమియర్ డేవిడ్ ఇబే, అల్బెర్ట్ నే డానియల్ స్మిత్, సర్రే మేయర్ బ్రెండే లాకే వంటి రాజకీయ నాయకులను బిష్ణోయ్ గ్యాంగ్‌పై చర్యలు తీసుకోవాలని అభ్యర్తించారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

arms smuggling Bishnoi gang Canada Breaking News Canada designates terrorist drug trafficking India international crime news latest news Lawrence Bishnoi Gang Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.