📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

దుండగుల కాల్పుల్లో మరణించిన భారత విద్యార్థి కంబోడియాలో విష్ణు విగ్రహ ధ్వంసం.. తీవ్రంగా ఖండించిన భారత్ అమెరికా ఉద్యోగాలు స్థానికులకే అన్న ట్రంప్ నైజీరియాలో మసీదుపై బాంబు దాడి.. 10 మందికి పైగా మృతి విదేశీ చదువుల్లో ఏపీ స్టూడెంట్స్ టాప్ సోషల్ వెట్టింగ్ తో భారత్ కు భారీ కుదుపు! భారత్ లో వీసా సర్వీసులను నిలిపేసిన బంగ్లాదేశ్ కూలిన మెక్సికో నేవీ విమానం.. ఐదుగురు దుర్మరణం ఇండోనేషియాలో రోడ్డుప్రమాదం.. 16 మంది దుర్మరణం ట్రంప్ ప్రకటనలో భారీగా తగ్గనున్న మందుల ధర దుండగుల కాల్పుల్లో మరణించిన భారత విద్యార్థి కంబోడియాలో విష్ణు విగ్రహ ధ్వంసం.. తీవ్రంగా ఖండించిన భారత్ అమెరికా ఉద్యోగాలు స్థానికులకే అన్న ట్రంప్ నైజీరియాలో మసీదుపై బాంబు దాడి.. 10 మందికి పైగా మృతి విదేశీ చదువుల్లో ఏపీ స్టూడెంట్స్ టాప్ సోషల్ వెట్టింగ్ తో భారత్ కు భారీ కుదుపు! భారత్ లో వీసా సర్వీసులను నిలిపేసిన బంగ్లాదేశ్ కూలిన మెక్సికో నేవీ విమానం.. ఐదుగురు దుర్మరణం ఇండోనేషియాలో రోడ్డుప్రమాదం.. 16 మంది దుర్మరణం ట్రంప్ ప్రకటనలో భారీగా తగ్గనున్న మందుల ధర

Canada: దుండగుల కాల్పుల్లో మరణించిన భారత విద్యార్థి

Author Icon By Pooja
Updated: December 26, 2025 • 11:43 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

భారతదేశంలోని పౌరులు ఉన్నతమైన చదువుల కోసం, ఉపాధి కోసం విదేశాలకు వెళ్తున్నారు. ఇటీవల ఈ సంఖ్య అధికంగా పెరిగింది. ప్రత్యేకించి చదువుకునేందుకు ఇక్కడి విద్యార్థులు ప్రపంచంలోని అనేకదేశాలకు వెళ్తున్నారు. ఆశించిన చదువును ముగించుకుని, అక్కడే ఉద్యోగాన్ని పొంది, ఆర్థికంగా వృద్ధి చెందుతున్నారు. అయితే ఇటీవలకాలంలో ఆయాప్రమాదాలు, ఇతర కారణాలతో పలువురు మృత్యువాత పడుతున్నారు.

Read Also: Bangladesh politics : తారిక్ రెహ్మాన్ స్పీచ్‌లో మార్టిన్ లూథర్ కింగ్ ఛాయలు?

ఈ ఏడాది ఒక్క టొరంటోలోనే 41 మంది హత్యకు గురికావడం తీవ్ర అలజడిని కలిగిస్తున్నది. వారంరోజుల క్రితమే టొరంటోలో 30 వేళ్ల భారతీయ మహిళ హిమాన్షి ఖురానా హత్య ఘటన మరువకముందే మరో భారతీయ విద్యార్థి శివంక్ అవస్థి(20), హత్యకు గురయ్యాడు. దీంతో భారతీయుల్లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు

టొరంటో విశ్వవిద్యాలయంలోని స్కార్ బరో క్యాంపస్ సమీపంలో మంగళవారం 20ఏళ్ల భారతీయ విద్యార్థి శివంక్ అవస్థిపై దుండగుడు కాల్పులు జరిపాడు. తీవ్రగాయాలతో ఉండగా పోలీసులు గమనించారు. ఆస్పత్రికి తరలించే లోపే ప్రాణాలు(Canada) కోల్పోయాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడి కోసం గాలిస్తున్నారు. మంగళవారం మధ్యాహ్నం 3.34 గంటలకు హైలాండ్ క్రీక్ ట్రైల్, ఓల్డ్ కింగ్స్టన్ రోడ్ ప్రాంతంలో గుర్తుతెలియని కాల్ పై పోలీసులు స్పందించారు. తీవ్రగాయాలతో ఉన్న వ్యక్తి గురించి సమాచారం తెలియగానే అధికారులు స్పందించారు తుపాకీ గాయంలో ఉన్న బాధితుడిని అధికారులు గుర్తించారు.

బాధితుడు అక్కడిక్కడే మరణించాడు’ అని పోలీసులు బుధవారం ఒక అధికారిక ప్రకటనలో తెలిపారు. పోలీసులు వచ్చేలోపు నిందితుడు ఆ ప్రాంతం నుంచి పారిపోయాడని ప్రకటనలో పేర్కొంది. శివంక్ అవస్థ హత్యపై భారత కాన్సులేట్(Canada) తీవ్ర విచారం వ్యక్తం చేసింది. ఈ ఘటన విషాదకరమైన ఘటనగా పేర్కొంది. శివంక్ అవస్థి కుటుంబానికి అవసరమైన సహాయం అందిస్తున్నట్లు టొరంటోలోని భారత కాన్సులేట్ జనరల్ తెలిపింది. తమ బిడ్డ గొప్పగా చదువుకుని, తమను ఆదుకుంటాడనే ఆశతో నిరీక్షిస్తున్న తల్లిదండ్రులకు తమ కుమారుడు ఇక లేడనే విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఎదిగిన కుమారుడు విగతజీవిగా మారడంతో వారు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Canada Shooting Google News in Telugu Indian student killed Latest News in Telugu

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.