📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Canada Alberta : కెనడా విడిపోతుందా?.. ఆల్బర్టాలో వేర్పాటువాద ఉద్యమం

Author Icon By Sai Kiran
Updated: May 11, 2026 • 8:24 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

కెనడాలో వేర్పాటువాద ఉద్యమం

Canada Alberta : ప్రశాంత దేశంగా గుర్తింపు పొందిన కెనడాలో ఇప్పుడు వేర్పాటువాద ఉద్యమం రాజకీయ కలకలం రేపుతోంది. ఆల్బర్టా రాష్ట్రాన్ని ప్రత్యేక దేశంగా ప్రకటించాలని పెద్ద ఎత్తున డిమాండ్లు వినిపిస్తున్నాయి. కెనడాలోని అత్యంత ధనిక రాష్ట్రాల్లో ఒకటైన ఆల్బర్టాలో ప్రస్తుతం వేర్పాటువాద ఉద్యమం వేగం పెరుగుతోంది. ‘స్టే ఫ్రీ ఆల్బర్టా’ అనే సంస్థ ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఈ ఉద్యమానికి వేలాదిమంది ప్రజలు మద్దతు తెలుపుతున్నారు. కెనడా నుంచి విడిపోయి స్వతంత్ర దేశంగా ఏర్పడాలని కోరుతూ దాదాపు మూడు లక్షల మందికి పైగా ప్రజలు సంతకాలు చేసిన వినతిపత్రం ఎన్నికల సంఘానికి సమర్పించారు. స్వాతంత్ర్యంపై ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. దశాబ్దాలుగా కొనసాగుతున్న ఆర్థిక, రాజకీయ అసంతృప్తి ఇప్పుడు కెనడా ప్రభుత్వానికి పెద్ద సవాలుగా మారింది.

ఆల్బర్టా ప్రజల్లో అసంతృప్తి ఎందుకు?

ఆల్బర్టా ప్రజలు విడిపోవాలని కోరుకోవడానికి ప్రధాన కారణం ఆర్థిక అసమానతలేనని విశ్లేషకులు చెబుతున్నారు. చమురు, సహజ వాయువు ఉత్పత్తిలో కీలక పాత్ర పోషించే ఈ రాష్ట్రం కెనడాలో అత్యంత సంపన్న ప్రాంతంగా గుర్తింపు పొందింది. అయితే ఫెడరల్ ప్రభుత్వానికి భారీగా పన్నులు చెల్లిస్తున్నప్పటికీ తమకు సరైన వాటా తిరిగి రావడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు.

2023-24లో సమానత్వ కార్యక్రమం కింద కెనడా ప్రభుత్వం పంపిణీ చేసిన 23 బిలియన్ డాలర్లలో ఆల్బర్టాకు ఎలాంటి నిధులు కేటాయించలేదని వేర్పాటువాదులు చెబుతున్నారు. గత నాలుగు దశాబ్దాల్లో ఎంప్లాయ్‌మెంట్ ఇన్సూరెన్స్ రూపంలో ఈ రాష్ట్రం నుంచి వందల బిలియన్ డాలర్లు కేంద్ర ఖజానాకు వెళ్లాయని, కానీ అవి ఇతర పేద ప్రావిన్సుల అభివృద్ధికి మాత్రమే ఉపయోగపడుతున్నాయని విమర్శిస్తున్నారు. ఆర్థిక అంశాలతో పాటు రాజకీయ విభేదాలు కూడా ఈ ఉద్యమానికి బలం ఇస్తున్నాయి. ఆల్బర్టా సంప్రదాయవాద భావజాలం కలిగిన రాష్ట్రం కాగా, గత కొన్నేళ్లుగా కెనడాలో లిబరల్ పార్టీ అధికారంలో ఉంది. ఫెడరల్ ప్రభుత్వం అమలు చేస్తున్న పర్యావరణ విధానాలు, కార్బన్ పన్నులు తమ చమురు పరిశ్రమను దెబ్బతీస్తున్నాయని స్థానిక నేతలు ఆరోపిస్తున్నారు.

Read Also : తమిళనాడు సీఎంగా విజయ్ ప్రమాణ స్వీకారం.. అతిథుల జాబితాలో ప్రముఖులు!

Canada Alberta

ప్రత్యేక దేశం కావడం అంత ఈజీ కాదు

ఆల్బర్టా ప్రత్యేక దేశంగా మారడం అంత సులభం కాదని నిపుణులు చెబుతున్నారు. దీనికి పలు చట్టపరమైన అడ్డంకులు ఉన్నాయి. ప్రస్తుతం సమర్పించిన మూడు లక్షల సంతకాల ధృవీకరణ ప్రక్రియను కోర్టు నిలిపివేసింది. కెనడియన్ రాజ్యాంగం ప్రకారం తమ హక్కులకు భంగం కలుగుతుందని స్వదేశీ తెగలు కోర్టును ఆశ్రయించాయి. ఒకవేళ కోర్టు అనుమతి ఇచ్చి రిఫరెండం నిర్వహించినా, కెనడా క్లారిటీ యాక్ట్ ప్రకారం సాధారణ మెజార్టీ సరిపోదు. స్పష్టమైన ప్రశ్నతో పాటు బలమైన మెజార్టీ అవసరం ఉంటుంది. దీనిపై తుది నిర్ణయం కెనడా ఫెడరల్ పార్లమెంట్ తీసుకోవాలి.

ఒకవేళ ఆల్బర్టా నిజంగానే విడిపోయినా కొత్త దేశంగా ఏర్పడేందుకు భారీ ప్రక్రియ ఉంటుంది. కొత్త రాజ్యాంగం, సొంత కరెన్సీ, సెంట్రల్ బ్యాంక్, సైన్యం ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. అలాగే కెనడా, అమెరికా సహా ఇతర దేశాలతో కొత్త వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకోవాలి. ఐక్యరాజ్యసమితి వంటి అంతర్జాతీయ సంస్థల్లో సభ్యత్వం పొందాలి. నిపుణుల అంచనాల ప్రకారం ఆల్బర్టా పూర్తిస్థాయి దేశంగా నిలబడేందుకు కనీసం పదేళ్లకు పైగా సమయం పట్టే అవకాశం ఉంది.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

Alberta Economy Alberta Independence Alberta Oil Industry Alberta Referendum Alberta Separatist Movement Canada Alberta Separation Canada Latest News Canada Political Crisis Canada Separatist Protests. Clarity Act Canada Google News in Telugu Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.