📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన

Canada: గాలిలో విమానాలు ఢీ కొని యువ పైలట్లు మృతి

Author Icon By Sharanya
Updated: July 10, 2025 • 4:42 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

కెనడా (Canada)లో ఓ విషాదకర విమాన ప్రమాదంలో భారత యువ పైలట్ (India’s young pilot) ప్రాణాలు కోల్పోవడం ఎంతో బాధాకర విషయం. ఈ సంఘటన కేవలం ఒక ట్రైనింగ్ ప్రమాదం మాత్రమే కాదు, దేశం మొత్తాన్ని కలచివేసిన విషాద ఘట్టంగా నిలిచింది.

శ్రీహరి సుకేష్ – కలలపైలట్

మానిటోబా ప్రావిన్స్‌లో రెండు శిక్షణా విమానాలు గాల్లో ఢీకొనడంతో ఈ విషాదకర సంఘటన చోటుచేసుకుంది. మృతుడిని కేరళకు చెందిన శ్రీహరి సుకేష్ (21)గా గుర్తించారు. ఈ ప్రమాదంలో కెనడాకు చెందిన సవన్నా మే రాయ్స్ (20) అనే మరో యువ పైలట్ కూడా మరణించాడు.

ప్రమాదం వివరాలు

ఈ ప్రమాదం మానిటోబాలోని (Manitoba) హార్వ్స్ ఎయిర్ పైలట్ ట్రైనింగ్ స్కూల్‌లో శిక్షణ పొందుతున్నారు. స్టెయిన్‌బాచ్ పట్టణం వద్ద శిక్షణలో భాగంగా చిన్న విమానాల్లో టేకాఫ్, ల్యాండింగ్‌లను ప్రాక్టీస్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఇద్దరూ ఒకే రన్‌వేపై ఒకేసారి ల్యాండ్ అయ్యేందుకు ప్రయత్నించారు. దీంతో సుమారు 400 మీటర్ల ఎత్తులో వారి విమానాలు ఒకదానికొకటి ఢీకొన్నాయని ట్రైనింగ్ స్కూల్ అధ్యక్షుడు ఆడమ్ పెన్నర్ పేర్కొన్నారు.

రెండు విమానాల్లోనూ రేడియో వ్యవస్థ ఉన్నప్పటికీ, ఒకరికొకరు అత్యంత సమీపానికి వచ్చిన విషయాన్ని పైలట్లు గుర్తించకపోవడం వల్లే ఈ దుర్ఘటన జరిగి ఉండవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. సుకేష్ వద్ద ఇప్పటికే ప్రైవేటు పైలట్ లైసెన్స్ ఉండగా, కమర్షియల్ పైలట్‌గా మారేందుకు శిక్షణ తీసుకుంటున్నాడు.

భారత దౌత్య స్పందన

కెనడా (Canada) టొరంటోలోని భారత కాన్సులేట్ ఈ ఘటనపై స్పందిస్తూ, సుకేష్ మృతిని ధృవీకరించిన అధికారులు, అతని కుటుంబ సభ్యులతో సంప్రదింపులు జరుపుతున్నామని తెలిపారు. స్థానిక పోలీసులు, పైలట్ స్కూల్ నుంచి పూర్తి వివరాలు సేకరిస్తున్నట్లు వెల్లడించారు. హార్వ్స్ ఎయిర్ స్కూల్ ఎంతోకాలంగా పైలట్ శిక్షణ ఇస్తుండగా, ఏటా వివిధ దేశాల నుంచి వందల మంది విద్యార్థులు ఇక్కడ శిక్షణ పొందుతుంటారు .


పైలట్ కావడానికి అర్హతలు?

వాణిజ్య పైలట్‌గా ప్రయాణించడానికి, మీకు ప్రారంభంలో స్తంభింపచేసిన ఎయిర్‌లైన్ ట్రాన్స్‌పోర్ట్ పైలట్ లైసెన్స్ (ATPL) మరియు క్లాస్ 1 మెడికల్ సర్టిఫికేట్ అవసరం. 

Read hindi news: hindi.vaartha.com

read also: Microsoft: భారీగా లేఆఫ్ ను ప్రకటించిన మైక్రోసాఫ్ట్!

Breaking News Canada plane crash Indian pilot death Kerala pilot Canada latest news Manitoba air collision Pilot training crash Sreehari Sukesh Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.