📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన

Latest News: Canada: తమ దేశంలో ఖలిస్థానీ సంస్థలకు నిధులు అందుతున్నాయని అంగీకరించిన కెనడా

Author Icon By Anusha
Updated: October 5, 2025 • 12:43 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

కెనడా ప్రభుత్వం ఇటీవలే ఖలిస్థానీ (Khalistani) వేర్పాటువాద సంస్థలకు నిధులు తమ దేశం నుంచే వాస్తవాన్ని తొలిసారి అధికారికంగా అంగీకరించింది.కెనడా ప్రభుత్వం ఈ విషయాన్ని తన మానీలాండరింగ్, ఉగ్రవాద ఫండింగ్ పరిశీలనలలో భాగంగా ప్రకటించింది. ఈ నివేదిక కేవలం నిధుల మూలాలను మాత్రమే కాక, వాటి నిర్వహణ, చెల్లింపు మార్గాలను కూడా విశ్లేషించింది.

POK: పాక్ ప్రభుత్వంతో కీలక ఒప్పందం

కెనడా ఆర్థిక శాఖ ఇటీవల విడుదల చేసిన

సేవా సంస్థల ముసుగులో జరుగుతున్న ఈ నిధుల మళ్లింపుపై కెనడా ఇంటెలిజెన్స్ వర్గాలు ప్రత్యేకంగా దృష్టి సారించాయి.కెనడా (Canada) ఆర్థిక శాఖ ఇటీవల విడుదల చేసిన “అసెస్‌మెంట్‌ ఆఫ్‌ మనీలాండరింగ్, టెర్రరిస్ట్‌ ఫైనాన్సింగ్‌ రిస్క్స్‌ ఇన్‌ కెనడా 2025” నివేదికలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.

బబ్బర్ ఖల్సా ఇంటర్నేషనల్, ఇంటర్నేషనల్ సిక్ యూత్ ఫెడరేషన్ వంటి ఖలిస్థానీ వేర్పాటువాద గ్రూపులతో పాటు హమాస్, హెజ్‌బొల్లా వంటి సంస్థలు కూడా కెనడాలోని వ్యక్తులు, సంస్థల నుంచి ఆర్థిక సహాయం పొందుతున్నాయని ఆ నివేదిక వెల్లడించింది.

నాన్-ప్రాఫిట్, ఛారిటబుల్ సంస్థలకు వస్తున్న విరాళాలను

ఖలిస్థానీ ఉగ్రవాదం నుంచి పొంచి ఉన్న ముప్పును ఈ నివేదిక హమాస్, హెజ్‌బొల్లా వంటి సంస్థలతో పోల్చడం గమనార్హం.కెనడాలోని పలు నాన్-ప్రాఫిట్, ఛారిటబుల్ సంస్థ (Charitable organization) లకు వస్తున్న విరాళాలను ఉగ్ర కార్యకలాపాలకు మళ్లిస్తున్నారనే ఆరోపణలు చాలాకాలంగా ఉన్నాయి.

Canada

దీనిపై అక్కడి ఓ స్థానిక రేడియో స్టేషన్ అధిపతి మణీందర్, ప్రధాని మార్క్‌ కార్నీతో పాటు పలువురు నాయకులకు గతంలోనే లేఖ రాసి ఫిర్యాదు చేశారు. సేవా సంస్థల ముసుగులో ఉగ్రవాద స్లీపర్ సెల్స్ పనిచేస్తున్నాయనే అనుమానాలను ఆయన వ్యక్తం చేశారు.

నాన్-ప్రాఫిట్ సంస్థలో పనిచేస్తూ తన పూర్తి పేరును

ఈ ఆరోపణలకు బలం చేకూరుస్తూ, బబ్బర్ ఖల్సా ఉగ్రవాది తల్వీందర్ సింగ్ పర్మర్ కుమారుడు నురిందర్ సింగ్ పర్మర్ (Nurinder Singh Parmar) కేసును అధికారులు పరిశీలిస్తున్నారు. నురిందర్ ఒక నాన్-ప్రాఫిట్ సంస్థలో పనిచేస్తూ తన పూర్తి పేరును దాచిపెట్టినట్లు తేలింది.ఈ పరిణామాల నేపథ్యంలో కెనడా ప్రభుత్వం ఉగ్రవాద ఫండింగ్‌పై కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించింది.

ఇందులో భాగంగా భారత్‌తో భద్రతా సంబంధాలను మరింత బలోపేతం చేసుకుంటోంది. ఇటీవలే లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌ను ఉగ్రవాద సంస్థగా ప్రకటించడం ఈ దిశగా తీసుకున్న కీలక చర్యగా భావిస్తున్నారు. మొత్తంగా, ఖలిస్థానీ నెట్‌వర్క్‌కు ఆర్థిక మూలాలను దెబ్బతీయడంపై కెనడా ప్రభుత్వం సీరియస్‌గా దృష్టి పెట్టినట్లు స్పష్టమవుతోంది. 

Read hindi news: hindi.vaartha.com

Read Also:

Breaking News canada recognizes funding for khalistani groups canada terrorism funding report khalistani separatist funding latest news money laundering canada Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.