📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

అంతరిక్ష ప్రయాణాలకు సునీతా రిటైర్మెంట్ ట్రంప్ వ్యాఖ్యలతో రికార్డు స్థాయికి చేరిన పసిడి ధరలు రైలుపై భారీ క్రేన్‌ పడి 22 మంది దుర్మరణం ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఇప్పటివరకు 2,571 మంది మృతి! సిలిండర్ పేలి .. వధూవరులతో సహా 8 మంది మృతి పసిడి ప్రియుల కొంపలు ముంచిన ట్రంప్ చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం అంతరిక్ష ప్రయాణాలకు సునీతా రిటైర్మెంట్ ట్రంప్ వ్యాఖ్యలతో రికార్డు స్థాయికి చేరిన పసిడి ధరలు రైలుపై భారీ క్రేన్‌ పడి 22 మంది దుర్మరణం ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఇప్పటివరకు 2,571 మంది మృతి! సిలిండర్ పేలి .. వధూవరులతో సహా 8 మంది మృతి పసిడి ప్రియుల కొంపలు ముంచిన ట్రంప్ చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం

Canada: భార్యకు భరణం ఇవ్వాలని 6 కోట్ల జీతాన్ని వదిలేసిన భర్త

Author Icon By Rajitha
Updated: January 21, 2026 • 11:14 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

కెనడాకు చెందిన ఓ సీనియర్ ఎగ్జిక్యూటివ్, భార్యకు భరణం ఇవ్వకుండా తప్పించుకోవాలనే ఉద్దేశంతో కోట్ల జీతం వచ్చే ఉద్యోగాన్ని వదిలేసిన ఘటన ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారింది. ఈ కేసులో సింగపూర్ కుటుంబ న్యాయస్థానం సంచలన తీర్పు వెలువరించింది. ఉద్యోగం వదిలినా, అధిక ఆదాయం సంపాదించే సామర్థ్యం ఉన్నంత వరకు భరణం చెల్లించాల్సిందేనని కోర్టు తేల్చి చెప్పింది.

Read also: JD Vance : నాలుగోసారి తండ్రి కాబోతున్న JD వాన్స్

Singapore court verdict

కోట్ల జీతం వచ్చే ఉద్యోగ నేపథ్యం

ఆ వ్యక్తి, అతని భార్య ఇద్దరూ కెనడియన్ పౌరులు. 2013లో నలుగురు పిల్లలతో కలిసి సింగపూర్‌కు వెళ్లారు. అక్కడ ఓ ప్రముఖ అంతర్జాతీయ సంస్థలో సీనియర్ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తూ, 2023 నాటికి వార్షికంగా 8.6 లక్షల సింగపూర్ (singapore) డాలర్లు (భారత కరెన్సీలో సుమారు రూ. 6 కోట్లకు పైగా) సంపాదిస్తున్నాడు. భార్య గృహిణిగా ఉండగా, పిల్లలు అంతర్జాతీయ పాఠశాలల్లో చదువుతున్నారు.

విడాకులు, భరణం వివాదం

2023 ఆగస్టులో కుటుంబాన్ని విడిచిపెట్టి మరో మహిళతో కలిసి నివసించడం ప్రారంభించిన భర్త, మొదట భార్యకు నెలకు 20,000 సింగపూర్ డాలర్లు నిర్వహణ ఖర్చుగా చెల్లించేందుకు అంగీకరించాడు. అయితే కొద్ది నెలల్లోనే ఆ మొత్తాన్ని 11,000 డాలర్లకు తగ్గించాడు. ఇది సరిపోదని భావించిన భార్య, అక్టోబర్ 2023లో సింగపూర్ మహిళా చార్టర్ చట్టం కింద కోర్టును ఆశ్రయించింది.

ఉద్యోగం వదిలినా బాధ్యత తప్పదని తీర్పు

కోర్టులో పిటిషన్ దాఖలైన కొద్ది రోజులకే, అక్టోబర్ 9, 2023న ఆ వ్యక్తి తన లాభదాయకమైన ఉద్యోగానికి స్వచ్ఛందంగా రాజీనామా చేశాడు. జూలై 2024 వరకు అదే జీతంతో కొనసాగించే అవకాశం ఉన్నప్పటికీ, ఉద్దేశపూర్వకంగానే ఉద్యోగం వదిలేశాడని కోర్టు గుర్తించింది. న్యాయమూర్తి ఫాంగ్ వ్యాఖ్యానిస్తూ, వ్యక్తి ప్రస్తుత ఆదాయం కంటే అతను సంపాదించగల సామర్థ్యమే భరణం నిర్ణయంలో కీలకమని స్పష్టం చేశారు.

రూ. 40 కోట్లకు పైగా భరణం చెల్లించాలని ఆదేశం

సెప్టెంబర్ 2023 నుంచి సెప్టెంబర్ 2025 వరకు నిర్వహణ ఖర్చును 7.88 లక్షల సింగపూర్ డాలర్లుగా కోర్టు నిర్ధారించింది. ఇప్పటికే చెల్లించిన మొత్తాన్ని మినహాయించి, మిగిలిన 6.33 లక్షల సింగపూర్ డాలర్లు (భారత కరెన్సీలో సుమారు రూ. 40 కోట్లకు పైగా) ఒకేసారి చెల్లించాలని ఆదేశించింది. ఈ తీర్పు ద్వారా అధిక జీతం ఉన్న ఉద్యోగాన్ని వదిలేయడం ద్వారా కుటుంబ బాధ్యతల నుంచి తప్పించుకోవడం సాధ్యం కాదనే న్యాయ నిపుణులు అంటున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

alimony Divorce case latest news Maintenance Singapore court Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.