📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

US: హమాస్ను అంతం చేసే సామర్థ్యం ట్రంప్కు ఉందా?

Author Icon By Vanipushpa
Updated: January 23, 2026 • 1:16 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

గాజాలో ఇజ్రాయెల్ కు, హమాస్ కు మధ్య యుద్ధం ముగిసింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మధ్యవర్తిత్వంతో ఇరు వర్గాలు శాంతికి ఒప్పుకున్నాయి. ఇజ్రాయెల్ దళాలు గాజాను వదిలిపెట్టి వెళ్ళిపోయాయి. దీని తరువాత నుంచి ట్రంప్ గాజాలో శాంతిని పునరుద్ధరించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. దీని కోసం గాజా బోర్డ్ ఆఫ్ పీస్ ను కూడా ప్రతిపాదించారు. ఇందులో చాలా దేశాలను ఇన్వాల్వ్ కూడా చేశారు. ఈ బోర్డ్ ఆఫ్ పీస్ ద్వారా గాజా స్ట్రిప్‌లో పునర్నిర్మాణం, కొత్త ప్రభుత్వాన్ని స్థాపించడం కోసం ప్లాన్ చేస్తున్నారు. అలాగే మరోసారి హమాస్‌ను బెదిరించారు. స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరిగిన గాజా శాంతి వేదికలో మాట్లాడుతూ, హమాస్ తన ఆయుధాలను అప్పగించకపోతే నాశనం చేయబడుతుందని అన్నారు.

Read Also: US: WHO నుంచి వైదొలిగిన అమెరికా

US: హమాస్ను అంతం చేసే సామర్థ్యం ట్రంప్కు ఉందా?

గాజాలో హమాస్ మళ్ళీ పుంజుకుంటోంది

ఇజ్రాయెల్ దళాలు గాజాను ఆక్రమించుకున్నప్పటి నుంచి హమాస్ అక్కడి నుంచి తరలి వెళ్ళిపోయింది. దాక్కున్న వారిని ఐడీఎఫ్ వెతికి వెతికి మరీ చంపేసింది. అయితే యుద్ధం ముగిశాక ఇజ్రాయెల్ సైన్యం గాజాను ఖాళీ చేసింది. ప్రస్తుతం అక్కడ ఎవరూ లేరు. ఈ నేపథ్యంలో గాజాలో హమాస్ మళ్ళీ పుంజుకుంటోందని తెలుస్తోంది. గాజాపై పట్టు సాధించేందుకు ప్రయత్నాలు చేస్తోందని తెలుస్తోంది. ఐడీఎఫ్ ఉపసంహరించుకున్న ప్రాంతాలను తిరిగి స్వాధీనం చేసుకోవడం ప్రారంభించాయి. ముఖ్యంగా గాజా నగరం, జబాలియా, నుసైరత్, అల్-బురైజ్, బీట్ లాహియా, ఖాన్ యూనిస్‌లోని కొన్ని ప్రాంతాలలో హమాస్ మళ్ళీ పాగా వేస్తోందని సమాచారం. అలాగే హమాస్ కు ఆయుధాలను దాచడంలో విస్తృతమైన అనుభవం ఉంది. ఆయుధాలు ఇప్పటికే సొరంగాలు, భూగర్భ నిల్వ సౌకర్యాలలో ఉన్నాయని తెలుస్తోంది. యుద్ధంలో అనేక రహస్య స్థావరాలు ధ్వంసమైనప్పటికీ.. మొత్తం మౌలిక సదుపాయాలు నాశనం కాలేదు. కాల్పుల విరమణ ప్రకటించిన వెంటనే, హమాస్ తన దళాలను తిరిగి సమీకరించి ఆయుధాలను బయటకు తీసుకువచ్చింది. దాంతో పాటూ దీనికి పోలీసుల లాంటి వ్యవస్థ కూడా ఉందని చెబుతున్నారు. కాల్పుల విరమణ తర్వాత.. అది వెంటనే తన పోలీసులను వీధుల్లోకి మోహరించింది. ప్రజా నియంత్రణ, భయం, శిక్షలను ఉపయోగించి గాజా ప్రజల్లో ఉన్న భిన్నాభిప్రాయాల స్వరాలను అణచివేయడం ప్రారంభించింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Counter Terrorism Donald Trump geopolitical analysis Global Security Hamas Israel Palestine Conflict Latest News in Telugu Middle East Politics Telugu News Today Trump leadership US foreign policy

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.