📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

నష్టపోయిన ప్రయాణి కులకు ఇండిగో నగదు అందివేత జపాన్‌లో భారీ భూకంపం..భయంతో పరుగులు తీసిన జనం ఆసుపత్రిపై సైన్యం దాడి..31 మంది మృతి మూడు నెలల్లో ఎన్నికలకు రెడీ: జెలెన్‌స్కీ జకర్తాలో ఘోర అగ్నిప్రమాదం – 20 మంది మృతి ఇండిగో సంక్షోభం పై లోక్‌సభలో వివరణ మైనర్‌ బాలికపై లైంగిక దాడి ఇండిగో సంస్థపై కేంద్రం చర్యలకు సిద్ధం హైదరాబాద్‌లోని రోడ్డుకు ట్రంప్ పేరు? పుతిన్‌కు రాష్ట్రపతి భవన్​లో స్వాగతం పలికిన రాష్ట్రపతి, ప్రధాని మోదీ నష్టపోయిన ప్రయాణి కులకు ఇండిగో నగదు అందివేత జపాన్‌లో భారీ భూకంపం..భయంతో పరుగులు తీసిన జనం ఆసుపత్రిపై సైన్యం దాడి..31 మంది మృతి మూడు నెలల్లో ఎన్నికలకు రెడీ: జెలెన్‌స్కీ జకర్తాలో ఘోర అగ్నిప్రమాదం – 20 మంది మృతి ఇండిగో సంక్షోభం పై లోక్‌సభలో వివరణ మైనర్‌ బాలికపై లైంగిక దాడి ఇండిగో సంస్థపై కేంద్రం చర్యలకు సిద్ధం హైదరాబాద్‌లోని రోడ్డుకు ట్రంప్ పేరు? పుతిన్‌కు రాష్ట్రపతి భవన్​లో స్వాగతం పలికిన రాష్ట్రపతి, ప్రధాని మోదీ

Latest Telugu News: Elon Musk: ఎయిర్ టెల్, జియోతో స్టార్‌లింక్ పోటీ కష్టమేనా?

Author Icon By Vanipushpa
Updated: December 11, 2025 • 3:27 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

భారతదేశ బ్రాడ్‌బ్యాండ్ సేవా రంగం ఒక పెద్ద మార్పు దిశగా సాగుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఉపగ్రహ ఆధారిత ఇంటర్నెట్ విప్లవానికి నాంది పలుకుతున్న ఎలోన్ మస్క్‌ నేతృత్వంలోని స్టార్లింక్ ఇప్పుడు భారత మార్కెట్లోకి ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతోంది. అయితే, ఈ సేవల ధరలే ప్రజల్లో పెద్ద చర్చకు వేదికగా మారాయి. భారత్‌లో ఇప్పటికే జియో, ఎయిర్‌టెల్ వంటి కంపెనీలు చాలా తక్కువ రేట్లకు హై-స్పీడ్ ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ అందిస్తున్న తరుణంలో.. Starlink ప్రతిపాదిస్తున్న ఛార్జీలు మరింత భారంగా అనిపిస్తున్నాయి. స్టార్‌లింక్ భారతదేశంలో నెలకు రూ. 2,500 నుండి రూ. 3,500 మధ్య రిటైల్ కస్టమర్లకు సేవలను అందించవచ్చని సూచనలు ఉన్నాయి. ఇది ఉపగ్రహ ఆధారిత సాంకేతికత కావడంతో.. విమానయానం, సముద్ర రవాణా, రిమోట్ ఇండస్ట్రీలు, సైనిక ప్రాంతాలు, అటవీ ప్రాంతాలు వంటి దూర ప్రాంతాల్లో ప్రత్యేకంగా ఉపయోగకరంగా ఉండవచ్చు.

Read Also: Anganwadi: డిజిటల్ దిశగా అంగన్వాడీ: ఉచిత 5జీ ఫోన్ల పంపిణీ ప్రారంభం

Elon Musk

భారతదేశంలో ఇంటర్నెట్ సేవలు భారీగా మెరుగు

అయితే, సాధారణ గృహ వినియోగదారుల కోసం ఈ ధరలు ఎంతవరకు ఆమోదయోగ్యమో అనేది పెద్ద ప్రశ్నగా మారింది. ఇటీవల స్టార్లింక్ భారత వెబ్‌సైట్‌లో పొరపాటున నెలవారీ ధర రూ. 8,600గా చూపించబడింది. కొన్ని గంటల్లోనే ఆ ధరను తొలగించారు. ఇది సాంకేతిక లోపం మాత్రమేనని కంపెనీ స్పష్టం చేసింది. గతంలో హార్డ్‌వేర్ కిట్ ధరను రూ. 34 వేలుగా ప్రకటించగా.. దాని వల్ల మొదటి నెల ఖర్చు రూ. 42,600కు చేరువ కావడం వినియోగదారులను ఆశ్చర్యంలో పడేసింది. ఇలాంటి అధిక ప్రారంభ ధరలు భారతీయ మార్కెట్‌కు పెద్ద సవాలు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. భారతదేశంలో ఇంటర్నెట్ సేవలు గత దశాబ్దంలో భారీగా మెరుగుపడ్డాయి. రిలయన్స్ జియో రూ. 399కు 30 Mbps వేగంతో 3.3 TB డేటాను అందించగా, రూ. 888 ప్లాన్‌లో నెట్‌ఫ్లిక్స్ సహా 15 OTT సేవలను ఇస్తోంది. ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ఫైబర్ రూ. 499కు అపరిమిత డేటా, 40 Mbps వేగంతో పాటు 22 OTT ప్లాట్‌ఫారమ్‌లను అందిస్తోంది. రూ. 999 ప్లాన్‌లో 200 Mbps వరకు వేగం, అమెజాన్ ప్రైమ్, నెట్‌ఫ్లిక్స్ వంటి ప్రీమియం సేవలు కూడా పొందవచ్చు.

స్టార్‌లింక్ భారతదేశంలో అదనపు సేవ మాత్రమే

భారతీయ వినియోగదారుల ధర-సున్నితత దీనికి పెద్ద అడ్డంకిగా మారవచ్చు. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. స్టార్లింక్ వంటి సేవలు గ్రామీణ ప్రాంతాలు, పర్వత ప్రాంతాలు, సైనిక ప్రాంతాల్లో కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. అక్కడ ఫైబర్ నెట్‌వర్క్ ఏర్పాటు చేయడం ఖరీదుతో పాటుగా సాంకేతికంగా క్లిష్టం కావడంతో, ఉపగ్రహ ఇంటర్నెట్ గొప్ప ప్రత్యామ్నాయంగా నిలుస్తుంది. అయినప్పటికీ.. పట్టణ ప్రాంతాల్లో జియో, ఎయిర్‌టెల్ వినియోగదారులను స్టార్‌లింక్ ఆకర్షించడంలో విజయవంతం కావడం కష్టమని నిపుణుల అంచనా.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read also:

Airtel Breaking News in Telugu Broadband Services Elon musk Google News in Telugu Internet Connectivity JIO Latest In telugu news Satellite Internet Starlink India Telecom Competition Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.