📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

శంషాబాద్ వద్ద స్కూల్ బస్సు బోల్తా బాస్కెట్ బాల్ కోర్ట్ లో ప్లేయర్ మృతి మహిళపై అనుచితంగా ప్రవర్తించిన డాక్టర్ తనూజ, భరణి లతో ఆట ఆడేసుకున్న నాగ్ ఫంకీ టీజర్ విడుదల డ్యూడ్ ట్రైల‌ర్ లో హైలైట్స్ మాస్ జాతర నుంచి హుడియో హుడియో సాంగ్ మిత్ర‌మండ‌లి ట్రైల‌ర్ హైలైట్స్ బంగారం నిల్వలు పెంచుతున్న కేంద్ర బ్యాంకులు బిగ్‌బాస్ ఫైర్‌స్ట్రామ్ ప్రోమో చూసారా? శంషాబాద్ వద్ద స్కూల్ బస్సు బోల్తా బాస్కెట్ బాల్ కోర్ట్ లో ప్లేయర్ మృతి మహిళపై అనుచితంగా ప్రవర్తించిన డాక్టర్ తనూజ, భరణి లతో ఆట ఆడేసుకున్న నాగ్ ఫంకీ టీజర్ విడుదల డ్యూడ్ ట్రైల‌ర్ లో హైలైట్స్ మాస్ జాతర నుంచి హుడియో హుడియో సాంగ్ మిత్ర‌మండ‌లి ట్రైల‌ర్ హైలైట్స్ బంగారం నిల్వలు పెంచుతున్న కేంద్ర బ్యాంకులు బిగ్‌బాస్ ఫైర్‌స్ట్రామ్ ప్రోమో చూసారా?

Cambodia: భద్రత కోసమే విష్ణువు విగ్రహాన్ని కూల్చాం..థాయ్ లాండ్

Author Icon By Saritha
Updated: December 26, 2025 • 2:35 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ప్రపంచవ్యాప్తంగా సరిహద్దు దేశాల మధ్య నిత్యం ఏదో ఒక గొడవలు, యుద్దాలు జరుగుతూనే ఉన్నాయి. (Cambodia) రష్యా-ఉక్రెయిన్ ల మధ్య నాలుగేళ్లుగా యుద్ధం జరుగుతూనే ఉంది. తాజాగా గత కొన్ని రోజులుగా థాయ్ లాండ్-కంబోడియా దేశాలమధ్య సరిహద్దు వివాదంపై గొడవలు జరుగుతూనే ఉన్నాయి. నువ్వానేనా అన్నట్లుగా రెండు దేశాల సైనికులు యుద్ధాన్ని కొనసాగిస్తున్నాయి. దీంతో గతకొంతకాలంగా ఇరుదేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఈ క్రమంలో కంబోడియా సరిహద్దులో ఉన్న విష్ణువు విగ్రహాన్ని థాయ్ లాండ్ కూల్చేసింది. ఈ ఘటనపై భారతదేశం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. హిందువుల మనోభావాలను దెబ్బతీశారంటూ పేర్కొంది. ఇటువంటి అగౌరవకరమైన చర్యలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనుచరుల మనోభావాలను దెబ్బతీస్తాయని.. ఇటువంటివి పునరావృతం కాకూడదని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ పేర్కొన్నారు.

Read Also: North Korea: మరిన్ని క్షిపణులు తయారీకి కిమ్ నిర్ణయం

వివరణ ఇచ్చిన థాయ్ లాండ్

అయితే భారత్ అభ్యంతరంపై థాయ్ లాండ్(Thailand) స్పందించింది. (Cambodia) భద్రత కోసమే విష్ణు విగ్రహాన్ని ధ్వంసం చేశామని.. అంతే తప్ప హిందూ మనోభావాలను దెబ్బతీయడానికి కాదని థాయ్ లాండ్ స్పష్టం చేసింది. వివాదాస్పద సరిహద్దు ప్రాంతంలో కావాలనే కంబోడియా సైనికులు విగ్రహాన్ని నిర్మించారని ఆ ప్రాంతం తమదేనని.. భద్రతా ప్రమాణాలను దృష్టిలో పెట్టుకుని కూల్చేసినట్లుగా వెల్లడించింది. వాస్తవంగా ఆ ప్రాంతం మతపరమైన ప్రాంతం కూడా కాదని వివరణ ఇచ్చింది.


Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Border Dispute Cambodia Hindu Sentiments india International Relations Latest News in Telugu Religious Sensitivity Telugu News Thailand Vandalism Vishnu Idol

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.