📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

సిలిండర్ పేలి .. వధూవరులతో సహా 8 మంది మృతి పసిడి ప్రియుల కొంపలు ముంచిన ట్రంప్ చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు మరోదేశంపై ట్రంప్ దాడికి సిద్ధం! వెనిజులా పై యూఎస్ బలగాల మెరుపు దాడి.. 55 మంది మృతి! సిలిండర్ పేలి .. వధూవరులతో సహా 8 మంది మృతి పసిడి ప్రియుల కొంపలు ముంచిన ట్రంప్ చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు మరోదేశంపై ట్రంప్ దాడికి సిద్ధం! వెనిజులా పై యూఎస్ బలగాల మెరుపు దాడి.. 55 మంది మృతి!

California Sales Tax : కాలిఫోర్నియాలో పెరిగిన సేల్స్ ట్యాక్స్ భారం

Author Icon By Divya Vani M
Updated: April 23, 2025 • 5:37 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రం మళ్లీ పన్నుల అంశంతో హాట్ టాపిక్ అయింది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా 7.25 శాతం అమ్మకపు పన్ను అమలులో ఉంది. ఇది దేశంలోనే అత్యధికం. పైగా, స్థానిక ప్రభుత్వాలకు అదనపు పన్నులు విధించే అధికారం కూడా ఉంది. ఈ రేటు సాధారణంగా 2 శాతాన్ని మించకూడదన్న నిబంధన ఉన్నా, కొన్ని మున్సిపాలిటీలు చట్టబద్ధంగా ఆ పరిమితిని దాటి పన్నులను పెంచుకుంటున్నాయి.గత నవంబర్‌లో జరిగిన స్థానిక ఎన్నికల్లో మొత్తం 115 పన్నుల పెంపు ప్రతిపాదనలు ఓటర్ల ముందుకు వచ్చాయి. అందులో 90 ప్రతిపాదనలు ఆమోదం పొందాయి. ఇందులో 80 సాధారణ అవసరాల కోసం, 6 ప్రత్యేక ప్రయోజనాల కోసం. అయితే, మిగిలిన 25 ప్రతిపాదనలు తిరస్కరణకు గురయ్యాయి.

California Sales Tax కాలిఫోర్నియాలో పెరిగిన సేల్స్ ట్యాక్స్ భారం

ప్రత్యేక పన్నులకు మూడింట రెండు వంతుల మెజారిటీ అవసరం, సాధారణ పన్నులకు 50 శాతం ఓట్లు చాలు.ఇన్ని పన్నుల పెంపు ఎలా ఆమోదం పొందాయో విశ్లేషిస్తూ, హోవార్డ్ జార్విస్ టాక్స్ యర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు జోన్ కూపర్ కీలక వ్యాఖ్యలు చేశారు. “రాష్ట్ర పన్నులకు వ్యతిరేకంగా ఉండే ఓటర్లు, స్థానిక ప్రభుత్వాల విషయంలో మాత్రం సానుకూలంగా స్పందిస్తున్నారు,” అని ఆయన తెలిపారు.అంతే కాదు, బ్యాలెట్ ప్రక్రియను కూడా కొన్ని అధికారులు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారని ఆరోపించారు. “పన్ను ప్రతిపాదనలు గోప్యంగా ఉంచడం, అవి చివరి నిమిషం వరకు ప్రజల దృష్టికి రాకుండా చూడడం జరుగుతోంది,” అని ఆయన అన్నారు. వాటిని ప్రజలకు అవసరమైన పోలీస్, అగ్నిమాపక శాఖలతో ముడిపెట్టి చూపించడం వల్ల, ప్రజలు అవసరం అనుకొని ఓటేస్తారని విశ్లేషించారు.

అయితే ఆ నిధులు నిజంగా అత్యవసర సేవలకే వాడుతారా? అని కూపర్ సందేహం వ్యక్తం చేశారు. చిన్న అక్షరాల్లో ఉన్న నిబంధనల ప్రకారం, ఆ నిధులు పాలనా ఖర్చులు, పెన్షన్లు, అధికారుల ప్రయాణాలకు కూడా వినియోగించవచ్చునని తెలిపారు.అదే విధంగా, పన్నుల పెంపును తక్కువగా చూపించే ట్రిక్స్ కూడా ఉన్నాయని చెప్పారు. ఉదాహరణకు, ఇప్పటికే ఉన్న 8% పన్నుకు 0.5% అదనంగా పెడితే, అది 6% పెరుగుదల కిందికి వస్తుందని గణితముతో చూపించారు.ఇప్పటికే ఆదాయ పన్ను, ఆస్తి పన్నుల భారం ఎక్కువగా ఉన్నప్పటికీ, ఇప్పుడు అమ్మకపు పన్నుల భారమూ తలెత్తుతుందనే విషయం స్పష్టమవుతోంది. ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చిన ఈ కొత్త పన్నుల విధానం వినియోగదారులపై మరింత ఒత్తిడిని తేవబోతోందని పన్ను చెల్లింపుదారుల సంఘం హెచ్చరిస్తోంది.ప్రజలు ఇప్పుడు ఈ పెరుగుతున్న భారం గురించి జాగ్రత్తగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే, చిన్నగా కనిపించే పెంపులు కూడా రోజువారీ ఖర్చులపై పెద్ద ప్రభావం చూపగలవు.

Read Also : Amber Heard : ఎలాన్ మస్క్ తో ఇల్లీగల్ సంబంధం : అంబర్ హెర్డ్

California April 1 Tax Changes California High Tax Burden California Local Government Taxes California Sales Tax Hike Jon Coupal Taxpayer Comments Local Sales Tax California US Taxpayer Concerns

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.