📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Latest News: California: దీపావళికి హాలిడే ప్రకటించిన కాలిఫోర్నియా

Author Icon By Anusha
Updated: October 8, 2025 • 12:28 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

భారతదేశంలో దీపావళి అనేది అత్యంత ప్రాముఖ్యత కలిగిన పండుగలలో ఒకటి. దీపాల వెలుగులు, ఆహ్లాదకరమైన వాతావరణం, కుటుంబసభ్యులతో కలసి గడపడం, మిఠాయిలు, రంగోలి అలంకరణలు – ఇవన్నీ దీపావళి ప్రత్యేకత. దేశవ్యాప్తంగా ఈ పండుగను ప్రజలు ఘనంగా జరుపుకుంటారు.

Mayor: మేయర్‌పై కత్తిపోట్లు..పరిస్థితి విషమం

అయితే, భారతీయుల సంస్కృతి ప్రపంచవ్యాప్తంగా విస్తరించబడి, వివిధ దేశాల్లో నివసిస్తున్న భారతీయులు కూడా ఈ పండుగను ఉత్సాహంగా జరుపుకుంటున్నారు. వారు తమ ఆహార, సంప్రదాయాల ప్రకారం దీపావళిని గమనించి, కుటుంబసభ్యులు, మిత్రులతో కలిసి సంతోషంగా ఈ ఉత్సవాన్ని ఆస్వాదిస్తారు.

లాగే ఇతర దేశాల్లో నివసిస్తున్న భారతీయులు కూడా ఉన్నచోటే పండుగ చేసుకుని మురిసిపోతుంటారు. అయితే అక్కడ పండుగ రోజు సెలవు దొరక్క అనేక మంది ఇబ్బంది కూడా పడుతుంటారు. అలాంటి వారి కోసమే అమెరికా (America) ఓ శుభవార్త చెప్పింది.

అధికారిక సెలవు దినంగా ప్రకటించింది కాలిఫోర్నియా

ముఖ్యంగా ఆ దేశంలో ఎక్కువ మంది భారతీయులు ఉండడంతో.. వారికి ఇష్టమైన దీపావళి పండుగ రోజును అధికారిక సెలవు దినంగా ప్రకటించింది కాలిఫోర్నియా (California).దీపావళి పండుగను రాష్ట్రంలోని అధికారిక సెలవు దినంగా గుర్తిస్తూ.. గవర్నర్ గావిన్ న్యూసమ్ అక్టోబర్ 6వ తేదీన కొత్త బిల్లుపై సంతకం చేశారు.

California

ఈ చారిత్రక నిర్ణయాన్ని ఇండియన్-అమెరికన్ వర్గాలు, శాసన సభ్యులు ఘనంగా స్వాగతిస్తున్నారు. ఈ కొత్త చట్టం ప్రకారం.. దీపావళి పండుగ (Diwali festival) రోజున పబ్లిక్ స్కూళ్లు, కమ్యూనిటీ కాలేజీలు సెలవు ప్రకటించుకునేందుకు వీలు కలుగుతుంది.

దీపావళి పండుగను అమెరికాలో సెలవు రోజుగా

అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఈ పండుగను పురస్కరించుకుని.. జీతంతో కూడిన సెలవు తీసుకునే వెసులుబాటు లభిస్తుంది.దీపావళి పండుగ (Diwali festival) ను అమెరికాలో సెలవు రోజుగా ప్రకటించాలని ప్రతిపాదిస్తూ.. గతంలో ఆ దేశ కాంగ్రెస్‌లో ఓ బిల్లును తీసుకు వచ్చిన విషయం అందరికీ తెలిసిందే.

అయితే ఇప్పుడు దాన్ని కాలిఫోర్నియా స్టేట్ అసెంబ్లీ (California State Assembly) ఆమోదించింది. ఈ బిల్లుకు అసెంబ్లీ సభ్యులు దర్శన పటేల్, ఆష్ కల్రా సహ-స్పాన్సర్‌లుగా వ్యవహరించారు. అయితే వీరిద్దరూ కలిసి ప్రవేశపెట్టిన బిల్లుపై తాను సంతకం చేశానని న్యూసమ్ పేర్కొన్నారు. కాలిఫోర్నియా ఈ గుర్తింపును సాధించిన వెస్ట్ కోస్ట్‌లోని మొట్టమొదటి రాష్ట్రంగా నిలిచింది.

అలాగే భారతీయ పర్వదినానికి ఈరకమైన గుర్తింపు ఇచ్చిన మూడో రాష్ట్రంగా కాలిఫోర్నియా రికార్డు సాధించింది. గతంలోనే పెన్సిల్వేనియా, న్యూయార్క్ వంటి రాష్ట్రాలు ఇలాంటి చర్యలు తీసుకున్నాయి.

Read hindi news: hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read Also:

Breaking News California Diwali holiday Indian community USA latest news Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.