BYD overtakes Tesla: ప్రపంచ ఎలక్ట్రిక్ వాహనాల (EV) మార్కెట్‌లో కీలక మార్పు చోటుచేసుకుంది. చైనా కంపెనీ BYD 2025 సంవత్సరానికి సంబంధించిన విక్రయ గణాంకాల్లో అమెరికా దిగ్గజం Tesla ను వెనక్కి నెట్టి ప్రపంచంలోనే అతిపెద్ద EV తయారీదారుగా అవతరించింది.
2025లో BYD మొత్తం 22.6 లక్షల బ్యాటరీ ఆధారిత ఎలక్ట్రిక్ కార్లను విక్రయించగా, టెస్లా కేవలం 16.4 లక్షల వాహనాలకే పరిమితమైంది. గత ఏడాదితో పోలిస్తే టెస్లా విక్రయాలు సుమారు 9 శాతం తగ్గినట్లు కంపెనీ ప్రకటించింది. ముఖ్యంగా అక్టోబర్–డిసెంబర్ త్రైమాసికంలో డెలివరీలు 15.6 శాతం తగ్గడం గమనార్హం.
Crime News: యువతి దారుణ హత్య.. ఎక్కడంటే?
అమెరికాలో $7,500 ట్యాక్స్ క్రెడిట్ ముగియడం, అలాగే టెస్లా సీఈవో Elon Musk రాజకీయ వ్యాఖ్యలపై ఏర్పడిన వ్యతిరేకత, (BYD overtakes Tesla) చైనా–యూరప్ కంపెనీల పోటీ పెరగడం టెస్లాకు ఎదురుదెబ్బగా మారాయి. మరోవైపు చైనా ప్రపంచంలోనే అతిపెద్ద న్యూ ఎనర్జీ వాహనాల మార్కెట్ కావడం BYDకు భారీ లాభంగా మారింది.
అయితే టెస్లా పెట్టుబడిదారులు మాత్రం భవిష్యత్‌పై ఆశలు వదులుకోవడం లేదు. రోబోటాక్సీలు, ఎనర్జీ స్టోరేజ్, హోమ్ & ఫ్యాక్టరీ రోబోట్స్ వంటి రంగాలపై మస్క్ దృష్టి పెట్టడం కంపెనీకి దీర్ఘకాలంలో మేలు చేస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: