📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Latest Telugu News: Italy: ఆ దేశంలో బురఖా, నిఖాబ్ ధరిస్తే భారీ జరిమానాలు

Author Icon By Vanipushpa
Updated: October 10, 2025 • 12:17 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఇటలీ(Italy)లో ఇక మీదట బహిరంగ ప్రదేశాల్లో బురఖాలు, నిఖాబ్ లు ధరిస్తే భారీ జరిమానాలు విధిస్తారు. దీనికి సంబంధించిన బిల్లును ఇప్పటికే అక్కడ పార్లమెంటులో ప్రవేశపెట్టారు. ఇస్లామిక్ వేర్పాటువాదాన్ని ఎదుర్కోవడమే లక్ష్యంగా ఈ బిల్లును రూపొందించామని ఇటలీ గవర్నమెంట్ తెలిపింది. ఈ ముసాయిదా బిల్లు ప్రకారం నిషేధాన్ని ఉల్లంఘించిన వారికి 300 యూరోస్ నుంచి 3,000 యూరోస్ అంటే భారత కరెన్సీ ప్రకారం రూ.30,000 నుంచి రూ.3 లక్షల వరకు జరిమానాలు విధించే అవకాశం ఉంది.

Jaish-e-Mohammed: జైషే మహమ్మద్ కు చదువుకున్న మహిళలే టార్గెట్

Italy: ఆ దేశంలో బురఖా, నిఖాబ్ ధరిస్తే భారీ జరిమానాలు

బహిరంగ ప్రదేశాల్లో ఎక్కడా బురఖాలను ధరించకూడదు

ఇటలీలో ఇప్పటికే ముస్లిం మతానికి వ్యతిరేకంగా చాలా నిర్ణయాలు తీసుకున్నారు. రీసెంట్ గా పాలస్తీనాకు అక్కడి ప్రభుత్వం మద్దతును కూడా ఉపసంహరించుకుంది. దీనిపై ఇటలీలో తీవ్ర నిరసనలు చెలరేగాయి. ఆందోళనలు జరిగాయి కూడా. దానికి తోడు ఇప్పుడు ఇస్లామిక్ సంస్కృతి, దీని వేర్పాటు వాదానికి వ్యతిరేకంగా బిల్లును తీసుకువస్తోంది ఇటలీ ప్రభుత్వం. ఈ కొత్త బిల్లులో కేవలం బురఖా, నిఖాబ్‌లపై నిషేధం మాత్రమే కాకుండా, మతపరమైన అంశాలకు సంబంధించిన అనేక ఇతర కఠిన నిబంధనలు కూడా ఉన్నాయి. స్కూళ్ళు, యూనివర్శిటీలు, షాప్స్, ఆఫీసులతో సహ బహిరంగ ప్రదేశాల్లో ఎక్కడా బురఖాలను ధరించకూడదు. అలాగే మసీదులకు అందుతున్న నిధుల విషయంలో పూర్తి పారదర్శకత పాటించాలని కూడా ఈ ముసాయిదా చట్టంలో ఉంది.

బిల్లుపై పెద్ద ఎత్తున వ్యతిరేకత

కన్యత్వ పరీక్షలు, మతాంతర వివాహాల్లో బలవంతానికి పాల్పడే వారిపై కూడా చర్యలు తీసుకునేందుకు వీలుగా కొత్త చట్టాన్ని రూపొందించారు. ముఖ్యంగా ఇటలీ ప్రభుత్వం ద్వారా గుర్తింపు పొందని మత సంస్థల ఆర్థిక కార్యకలాపాలపై నిఘా ఉంచుతారు. ప్రస్తుతం ఇటలీలో ఏ ఒక్క ముస్లిం సంస్థ కూడా ప్రభుత్వ గుర్తింపు పొందలేదు. కొత్త చట్టం ప్రకారం వీటిపై త్వరలోనే చర్యలు తీసుకుంటారు. ఈ బిల్లుకు ప్రధాని జార్జియా మెలోనీ ప్రభుత్వం పూర్తిగా మద్దతు ఇస్తోంది. దాదాపు ఇది పాస్ అయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు. అయితే మరోవైపు ఇటలీలో ఈ బిల్లుపై పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. ము

ఇటలీ ఒక దేశం ఎలా ఉంది?
ఇటలీ - EU దేశ ప్రొఫైల్ | యూరోపియన్ యూనియన్
ఇటలీ ఒక పార్లమెంటరీ రిపబ్లిక్, ప్రధాన మంత్రి ప్రభుత్వ అధిపతిగా ఉంటారు.

ఇటలీ దేనికి ప్రసిద్ధి చెందింది?
ఇటలీ పురాతన రోమన్ శిథిలాలు, పునరుజ్జీవనోద్యమం మరియు లియోనార్డో డా విన్సీ వంటి మాస్టర్స్ కళలతో సహా గొప్ప చరిత్ర మరియు సంస్కృతికి ప్రసిద్ధి చెందింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read Also:

#telugu News Burqa Ban cultural controversy European burqa ban face covering laws international news niqab prohibition religious dress restrictions Women's Rights

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.