📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఆందోళన కలిగిస్తున్న స్క్రబ్ టైఫస్‌.. ఒకరి మృతి మెక్సికోలో భూకంపం ఈరోజు నుంచి తెలంగాణ టెట్ బినామీ ఆస్తులపై ఏసీబీ కొత్త స్కెచ్ ఉక్రెయిన్ అధ్యక్షుడు కీలక నిర్ణయం కొత్త వాహనాలపై రోడ్డు భద్రతా సెస్సు: పొన్నం ప్రభాకర్ రూ. 500 నోట్లు బంద్.. రూమర్స్‌పై కేంద్ర ప్రభుత్వం వివరణ సౌదీ, యూఏఈల మధ్య ఉద్రిక్తతలు త్వరలో మున్సిపల్‌ ఎన్నికలు పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి మద్యం మత్తులో వ్యక్తి గోపురంపై ఎక్కి హల్‌చల్ న్యూ ఇయర్ దాడి కుట్ర విషంతో పిల్లలను చంపేయండి..వార్డెన్ హుకుం చేపల వేట బోటులో అగ్ని ప్రమాదం ఆందోళన కలిగిస్తున్న స్క్రబ్ టైఫస్‌.. ఒకరి మృతి మెక్సికోలో భూకంపం ఈరోజు నుంచి తెలంగాణ టెట్ బినామీ ఆస్తులపై ఏసీబీ కొత్త స్కెచ్ ఉక్రెయిన్ అధ్యక్షుడు కీలక నిర్ణయం కొత్త వాహనాలపై రోడ్డు భద్రతా సెస్సు: పొన్నం ప్రభాకర్ రూ. 500 నోట్లు బంద్.. రూమర్స్‌పై కేంద్ర ప్రభుత్వం వివరణ సౌదీ, యూఏఈల మధ్య ఉద్రిక్తతలు త్వరలో మున్సిపల్‌ ఎన్నికలు పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి మద్యం మత్తులో వ్యక్తి గోపురంపై ఎక్కి హల్‌చల్ న్యూ ఇయర్ దాడి కుట్ర విషంతో పిల్లలను చంపేయండి..వార్డెన్ హుకుం చేపల వేట బోటులో అగ్ని ప్రమాదం

Mexico Earthquake: మెక్సికోలో భారీ భూకంపంతో కంపించిన భవనాలు..

Author Icon By Anusha
Updated: January 3, 2026 • 11:58 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి
Buildings shook in a massive earthquake in Mexico..

మెక్సికోలో భారీ భూకంపం (Mexico Earthquake) సంభవించింది. భూకంప తీవ్రత రిక్టరు స్కేలుపై 6.5గా నమోదైనట్లు మెక్సికో నేషనల్ సిస్మోలాజికల్ సర్వీస్అధికారులు వెల్లడించారు. శాన్ మార్కోస్ నగరానికి 14 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు అధికారులు పేర్కొన్నారు. దీని వల్ల ఏకంగా 33 సెకన్ల పాటు భూమి కంపించింది. భూకంపం (Mexico Earthquake)ధాటికి భారీ భవనాలు ఊగిపోవడంతో జనం తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ఇంట్లో నుంచి బయటపడి వీధుల్లోకి చేరారు.

Read also: Canada: చట్టబద్ధ హోదా కోల్పోయే ప్రమాదంలో 10 లక్షల మంది భారతీయులు

పలుచోట్ల నివాస సముదాయాలు కూలిపోయాయి

మెక్సికో సిటీ, శాన్ మార్కోస్ లతో పాటు ప్రముఖ పర్యాటక ప్రాంతం అకపుల్కో నగరంలో భూకంప తీవ్రత ఎక్కువగా ఉంది. పలుచోట్ల నివాస సముదాయాలు కూలిపోయాయి. ఇప్పటి వరకు ఇద్దరు మరణించారని,అధికారులు పేర్కొన్నారు. మొత్తం 50కి పైగా భారీ భవనాలకు పగుళ్లు ఏర్పడ్డాయని చెప్పారు.మెక్సికో ప్రెసిడెంట్ క్లాడియా షెయిన్ బామ్ మీడియా సమావేశంలో మాట్లాడుతుండగా భూకంపం సంభవించింది.

దీంతో అప్రమత్తమైన భద్రతా సిబ్బంది ప్రెసిడెంట్ ను వెంటనే బయటకు తరలించారు. మరోవైపు భూకంపం నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది. భూకంపం ప్రభావిత ప్రాంతాల్లో స్థానిక ప్రభుత్వ యంత్రాంగం సహాయక చర్యలు చేపట్టింది.లౌడ్ స్పీకర్లలో ప్రకటనలు చేస్తూ ఇళ్లల్లోని వారిని వీధుల్లోకి చేరుకోవాలని హెచ్చరించింది. మొబైల్ ఫోన్లకు భూకంపం అలర్ట్ సందేశాలను పంపి అప్రమత్తం చేసింది. రెస్కూ ఆపరేషన్ చేపట్టామని, ప్రాణనష్టం తగ్గించేందుకు చర్యలు చేపట్టామని ప్రెసిడెంట్ క్లాడియా తెలిపారు.

Read hindi news:hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read also:

Acapulco Earthquake latest news mexico Mexico City Seismic Activity Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.