📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Buddhism: ప్రపంచాన్ని ఊపేస్తున్న బౌద్ధసన్యాసుల లైంగిక సంబంధాలు

Author Icon By Sharanya
Updated: July 22, 2025 • 12:44 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ప్రపంచంలోనే బౌద్ధమతానికి (Buddhism) ఒక ప్రత్యేకస్థానం ఉంది. ఇటీవల కాలంలో ప్రముఖ బౌద్ధ ఆధ్యాత్మిక నాయకుడు దలైలామా (Dalai Lama) తన వారసుడి ఎంపికపై భారత్, చైనా దేశాలమధ్య మాటల యుద్ధాలు జరుగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో థాయ్లాండ్లో బుద్ధిజంపై సంచలన విషయాలో వెలుగులోకి వస్తున్నాయి.

ఆ వివరాలు ఏమిటో మీరే చదవండి..


బుద్ధిజాన్ని (Buddhism) అనుసరించే దేశాల్లో థాయ్లాండ్ (Thailand) ఒకటి. ఆ దేశంలో నివసించే బౌద్ధ సన్యాసులకు ఎంతో గౌరవం, ఆదరణ ఉంది. అంతేకాదు రాజకీయంగా, సామాజికంగా వారిదే పై చేయి కూడా. ఇప్పుడు వారి ప్రతిష్ఠకు భంగం కలిగే పలు ఆరోపణలు వారిపై వస్తున్నాయి.


ఎవరీ విలావన్ ఎమ్మా వత్?


మిస్ గోల్ఫ్ గా పిలవబడే విలావన్ ఎమ్మా వత్ అనే మహిళ సన్యాసులకు సంబంధించిన సెక్స్ వీడియోలతో కోట్లు సంపాదిస్తుంది. ఈ బండారం బయటపడటంతో అనెల 15వ తేదీన బ్యాంకాక్ సమీపంలో నోంథబురి ప్రావిన్స్ లోని ఆమె లగ్జరీ హోమ్లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గత నెలలో బ్యాంకాక్ లోని వాట్ ట్రీ థోట్సాథెప్ మఠాధిపతి ప్రాడెప్ వచిరపమోక్ అనే సన్యాసి అదృశ్యం కావడంతో పోలీసులు విచారణ చేపట్టారు. దీనితో ఈ విషయం బయటకు వచ్చింది.


దేశవ్యాప్త సంచలన ఘటన


విలావన్ ఎమ్మా వత్ దాదాపు 11 మంది సన్యాసులతో శారీరక సంబంధం పెట్టుకుంది. అంతేకాక వారి బలహీన క్షణాలను రహస్యంగా ఫోటోలు తీసి వారిని బ్లాక్మెయిల్ చేసింది. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. దీనిపై ప్రజల నుంచి తీవ్ర ఆగ్రహావేశాలకు కారణమైంది. కొన్ని వందల ఏళ్లుగా తపోనిష్టతో కొనసాగుతున్న బౌద్ధమతానికి మచ్చగా మారింది. మఠాలపై ఉన్న గౌరవం పోయింది.

బ్లాక్మెయిల్తో కోట్లు దండుకున్న విలావన్ ఎమ్మా వత్


కాగా విలావన్ ఎమ్మా వత్ బౌద్ధ సన్యాసులతో లైంగిక సంబంధాలు కొనసాగించడంతో పాటు
ఆమె వారికి సంబంధించిన ఫోటోలు, వీడియోలను రికార్డు చేసింది. అలా సుమూరు 80 వేల
వీడియోలు, ఫోటోలు తీసింది. అంతటితో ఆగక వారిని బ్లాక్ మెయిల్ చేస్తూ రూ. 102కోట్లు దోచుకుంది. కేవలం మూడేళ్ల కాలంలోనే ఇంతగా సంపాదించింది అంటే ఆమె టాలెంట్ ఎంత
గొప్పదో ఊహించవచ్చు. పలానవారి వల్ల గర్భవతిని అయ్యాను అంటూ సన్యాసులను నమ్మించడం మాత్రమే కాదు తన బిడ్డకు తండ్రి అతనే అంటూ కొందరిని బ్లాక్మెయిల్ చేసి ఖరీదైన బహుమతులను తీసుకుంది. ఇలా కొన్ని కోట్లను కూడబెట్టింది.


థాయ్లాండ్ రాజు సీరియస్


కాగా ఈ ఘటనపై ఆదేశ రాసు వజిరలోంగ్ కోర్స్ సీరియస్ అయ్యారు. దీనితో ప్రత్యక్ష చర్యలకు
పూనుకున్నారు. ఇందులో భాగంగా తన జన్మదినరోజు వేడుకలకు బౌద్ధ సన్యాసులను ఆహ్వానించకూడదని నిర్ణయించుకున్నారు. అంతేకాదు ఈ మోసంలో ఇరుక్కున్న బౌద్ధ సన్యాసులను తొలగించి, దీనిపై విచారణకు ఆదేశించారు.


227 కఠినమైన నియమాలు ఉన్నాయి.


థాయ్లాండ్ పురుషులు తమ జీవితంలో ఒక్కసారైనా సన్యాసులుగా ఉండాలనే నియమం
ఉంది. అలా కొన్ని వారాలు లేదా సంవత్స రాలు కూడా ఉంటుంది. ఈ మతాధికారులకు 227
కఠినమైన నియమాలు ఉంటాయి. చాలా నిరాడంబరమైన జీవితాన్ని జీవించాలి. ఇహలోక
మాలిన్యాలకు దూరంగా ఉండాలి. ఆడంబరాల జోలు అసలు వెళ్లకూడదు. ప్రభుత్వం ఇచ్చే తక్కువ స్టైఫండ్తోనే సాంప్రదాయ భిక్షతో జీవించాలి. విలావన్ ఎమ్మా వత్ చేసిన పనికి దేశంలో
బుద్ధిజానికి మాయని మచ్చను తెచ్చిందని ఈ దేశస్తులు మండిపడుతున్నారు .

Read hindi news: hindi.vaartha.com

Read also: Bangladesh plane crash: పాఠశాలపై కూలిన విమానం.. 20 మంది విద్యార్థుల దుర్మరణం

Breaking News Buddhism Buddhist Monks latest news Monk Misconduct Sexual Abuse in Religion Spiritual Accountability Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.