📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Pakistan: పాక్, బంగ్లా సరిహద్దుల్లో బీఎస్ఎఫ్ మరింత భద్రతకు కేంద్రం కసరత్తు

Author Icon By Vanipushpa
Updated: May 6, 2025 • 12:42 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

భారత్ – పాకిస్తాన్ సరిహద్దులతో పాటు భారత్ – బంగ్లా సరిహద్దుల్లో పహారా బాధ్యతలు నిర్వర్తించే బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF)ను మరింత బలోపేతం చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. కేంద్ర ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం త్వరలో మరో 16 కొత్త బెటాలియన్లు, 2 కొత్త ఫీల్డ్ హెడ్‌క్వార్టర్‌లను నెలకొల్పనున్నట్టు తెలిసింది. ఈ ప్రతిపాదనలకు త్వరలో ఆమోదముద్ర పడే అవకాశం కనిపిస్తోంది. పాకిస్తాన్‌తో పాటు బంగ్లాదేశ్ కూడా భారత్‌కు వ్యతిరేకంగా మారిన పరిస్థితుల్లో ఈ రెండు దేశాల సరిహద్దుల భద్రతను మరింత పటిష్టం చేయాల్సిన అవసరం ఏర్పడింది.
ఒక్కో సరిహద్దుకు ప్రత్యేక బృందం
రక్షణ శాఖ పరిధిలో ఉన్న భారత సైన్యం, వాయు సేన, నావికాదళంతో పాటు కేంద్ర హోం శాఖ పరిధిలో వివిధ సాయుధ బలగాలు ఉన్న విషయం తెలిసిందే. వాటిని పారా-మిలటరీ ఫోర్స్‌గా కూడా అభివర్ణిస్తారు. హోంశాఖ పరిధిలో ఉన్న సాయుధ బలగాల్లో సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF)ను అంతర్గత భద్రత కోసం వినియోగిస్తారు. మిగతా బలగాలను సరిహద్దు పహారాతో పాటు అంతర్గత భద్రత కోసం వినియోగిస్తుంటారు. వాటిలో బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF)ను పాకిస్తాన్ సరిహద్దులతో పాటు బంగ్లాదేశ్ సరిహద్దుల రక్షణ కోసం వినియోగిస్తున్నాం. చైనా ఆక్రమిత టిబెట్ సరిహద్దుల్లో పహారా కోసం ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ (ITBP), నేపాల్, భూటాన్ వంటి మిత్ర దేశాల సరిహద్దుల రక్షణ కోసం సశస్త్ర సీమా బల్ (SSB), మయన్మార్ సరిహద్దుల్లో రక్షణ కోసం అస్సాం రైఫిల్స్ (AR) వంటి ప్రత్యేక బలగాలను వినియోగిస్తాం.

బీఎస్ఎఫ్ కీలకం ఎందుకంటే..

భారత దేశానికి పక్కలో బల్లెంలా మారిన దాయాది దేశం పాకిస్తాన్‌తో మొదటి నుంచి శత్రుత్వం కొనసాగుతోంది. 1947లో స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి కొనసాగుతున్న ఈ శత్రుత్వంలో 1948, 1965, 1971లో యుద్ధాలు కూడా జరిగాయి.
Read Also: Chinmoy Krishna Das: చిన్మయి కృష్ణదాస్‌ మళ్లీ అరెస్ట్..కారణం ఏమిటి ?

Breaking News in Telugu BSF will be Google news Latest News in Telugu of Pakistan and Bangladesh Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news trengthened on the borders

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.