అమెరికా రోడ్ ఐలాండ్ ప్రావిడెన్స్‌లోని ప్రఖ్యాత బ్రౌన్ యూనివర్సిటీ(Brown University) క్యాంపస్‌లో శనివారం ఘోర కాల్పులు సంభవించాయి. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందగా, మరో ఎనిమిది మంది గాయపడ్డారు. కాల్పులు యూనివర్సిటీలో పరీక్షల సమయంలో చోటుచేసుకున్నాయి. నల్ల దుస్తులు ధరించిన ఒక షూటర్ ఈ ఘోరానికి కారణమయ్యాడు. అతని కోసం ప్రావిడెన్స్ పోలీసులు గాలిస్తున్నారు.
Read Also: Maria Machado: ప్రభుత్వ నిఘా నుంచి తప్పించుకుని నార్వే ప్రయాణం
దుర్గటన ఘటనా స్థలం
కాల్పులు బారస్ అండ్ హోలీ భవనంలో జరిగాయి, ఇది యూనివర్సిటీ(Brown University) క్యాంపస్‌లోని ఇంజినీరింగ్ స్కూల్, ఫిజిక్స్ విభాగాలతో కూడిన ఏడతస్తుల కాంప్లెక్స్. భవనంలో 100కి పైగా ల్యాబొరేటరీలు, డజన్ల తరగతి గదులు, కార్యాలయాలు ఉన్నాయి. ఇంజినీరింగ్ డిజైన్ ఫైనల్ పరీక్షల సమయంలో ఈ ఘటనా జరిగింది.
కాల్పుల తర్వాత క్యాంపస్‌ను తక్షణమే లాక్‌డౌన్ చేశారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు, వారి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని ప్రావిడెన్స్ మేయర్ బ్రెట్ స్మైలీ తెలిపారు. విద్యార్థులను సురక్షిత ప్రాంతాలకు తరలించి, క్యాంపస్ మొత్తం ఎఫ్బీఐ, పోలీసులు తమ నియంత్రణలోకి తీసుకున్నారు.
దర్యాప్తు & ఫెడరల్ సహాయం
ఘటనా స్థలానికి ఫెడరల్ అధికారులు, ఎమర్జెన్సీ సిబ్బంది చేరుకున్నారు. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ ఘటనపై స్పందిస్తూ, సమగ్ర దర్యాప్తుకు ఎఫ్బీఐని ఆదేశించారు. అలాగే, బ్యూరో ఆఫ్ ఆల్కహాల్, టొబాకో, ఫైర్‌ఆర్మ్స్ అండ్ ఎక్స్‌ప్లోజివ్స్ (ATF) ఏజెంట్లు కూడా దర్యాప్తులో భాగంగా సహకరించారు.
ప్రస్తుతానికి నల్ల దుస్తుల్లో ఉన్న అనుమానితుడు భవనం నుండి బయటకు వస్తూ విద్యార్థుల చేత గుర్తించబడ్డాడు. అతను ఇంకా పట్టుబట్టలేదని ప్రావిడెన్స్ డిప్యూటీ పోలీస్ చీఫ్ టిమోతీ తెలిపారు.కాల్పుల కారణంగా విద్యార్థులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. పోలీసులు ఎవరికీ బయటకు రావద్దని హెచ్చరించారు. తదుపరి ఆదేశాల వరకు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. మరణించిన వ్యక్తుల వివరాలు ఇంకా వెల్లడించాల్సి ఉంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read also :