భారత్-యూకే ద్వైపాక్షిక సంబంధాలు మరో కీలక దశలోకి ప్రవేశించబోతున్నాయి. బ్రిటన్ కొత్త ప్రధానమంత్రి కీర్ స్టార్మర్ (PM Keir Starmer) తన మొదటి అధికారిక భారత పర్యటనకు సిద్ధమవుతున్నారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi) ఆహ్వానం మేరకు స్టార్మర్ అక్టోబర్ 8 నుండి రెండు రోజులపాటు భారత్‌లో పర్యటించనున్నారు. ఈ విషయాన్ని భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ శనివారం అధికారిక ప్రకటన ద్వారా ధృవీకరించింది.
Trump: అమెరికాను విడిచి వెళ్లే వలసదారులకు భారీ ఆఫర్
యూకే ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత కీర్ స్టార్మర్ భారత్ పర్యటన ఇదే ప్రథమం కావడం విశేషం. ఆయన పర్యటనలో ద్వైపాక్షిక ఆర్థిక, వాణిజ్య, రక్షణ, విద్యా రంగాల్లో సహకారాన్ని మరింత బలోపేతం చేసే అంశాలపై చర్చలు జరగనున్నాయి. ముఖ్యంగా, భారత్-యూకే మధ్య జరుగుతున్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (Free Trade Agreement – FTA) చర్చలు ఈ సందర్శనలో ప్రధాన అంశంగా నిలవనున్నాయని సమాచారం.
ఈ పర్యటనలో భాగంగా అక్టోబర్ 9న ముంబైలో ప్రధాని మోదీ, స్టార్మర్ మధ్య ఉన్నత స్థాయి సమావేశం జరగనుంది. ఇరు దేశాల మధ్య కుదిరిన ‘సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం’ పురోగతిని ఇరువురు నేతలు సమీక్షించనున్నారు. ‘విజన్ 2035’ (Vision 2035’) రోడ్‌మ్యాప్‌లో భాగంగా వాణిజ్యం, పెట్టుబడులు, రక్షణ, భద్రత, సాంకేతికత, వాతావరణ మార్పులు, విద్య, ఆరోగ్యం వంటి కీలక రంగాల్లో సహకారంపై చర్చిస్తారు.

ముఖ్యంగా, ఇరు దేశాల ఆర్థిక భాగస్వామ్యానికి మూలస్తంభంగా భావిస్తున్న ‘సమగ్ర ఆర్థిక, వాణిజ్య ఒప్పందం’ (సెటా) ద్వారా లభించే అవకాశాలపై వీరు ప్రముఖ వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తలతోనూ సంప్రదింపులు జరుపుతారు.పర్యటనలో భాగంగా ఇరువురు ప్రధానులు ముంబైలో జరిగే 6వ గ్లోబల్ ఫిన్‌టెక్ ఫెస్ట్ (6th Global Fintech Fest) లో పాల్గొని కీలక ప్రసంగాలు చేస్తారు.
అంతర్జాతీయ ప్రాధాన్యత ఉన్న అంశాలపై కూడా
ఈ కార్యక్రమం సందర్భంగా పారిశ్రామిక నిపుణులు, ఆవిష్కర్తలతోనూ భేటీ కానున్నారు. ప్రాంతీయ, అంతర్జాతీయ ప్రాధాన్యత ఉన్న అంశాలపై కూడా తమ అభిప్రాయాలను పంచుకోనున్నారు.గత జులై 23-24 తేదీల్లో ప్రధాని మోదీ యూకే (UK) లో పర్యటించిన సంగతి తెలిసిందే. ఆ పర్యటనలో కుదిరిన ఒప్పందాలకు, చర్చలకు కొనసాగింపుగా స్టార్మర్ పర్యటన జరగనుంది.
ఆ సమయంలో ఇరు దేశాల మధ్య చరిత్రాత్మక ‘సెటా’ ఒప్పందం కుదిరింది. అలాగే, రక్షణ ఉత్పత్తుల సహ-రూపకల్పన, సహ-అభివృద్ధి, సహ-ఉత్పత్తిని ప్రోత్సహించేందుకు ‘రక్షణ పారిశ్రామిక రోడ్‌మ్యాప్’కు కూడా ఇరు దేశాలు ఆమోదం తెలిపాయి. తాజా పర్యటనతో భారత్-యూకేల మధ్య భవిష్యత్ భాగస్వామ్యం మరింత దృఢంగా మారుతుందని విదేశాంగ శాఖ విశ్వాసం వ్యక్తం చేసింది.
Read hindi news: hindi.vaartha.com
Read Also: