📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Telugu News: Britain: విమానంలో బాలికపై లైంగిక దాడి.. శిక్ష విధించిన యూకే కోర్టు

Author Icon By Sushmitha
Updated: November 10, 2025 • 12:48 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

విమానంలో ప్రయాణిస్తున్న 12 ఏళ్ల బాలికపై లైంగిక దాడికి పాల్పడిన కేసులో ఓ భారతీయుడికి యూకే కోర్టు 21 నెలల జైలు శిక్ష విధించింది. ముంబైకి చెందిన షిప్పింగ్ కంపెనీ ఎగ్జిక్యూటివ్ జావేద్ ఇనామ్‌దార్ (34) 2024 డిసెంబర్ 14న ముంబై నుంచి లండన్(London) వెళ్తున్న బ్రిటిష్ ఎయిర్‌వేస్ విమానంలో ఈ దారుణానికి ఒడిగట్టారు. నిందితుడు జావేద్‌కు వివాహమై ఇద్దరు పిల్లలు ఉన్నారు.

Read also: Railway: టికెట్ బుకింగ్‌ వ్యవస్థలో మార్పులు

Britain

విమానంలో అసభ్య ప్రవర్తన, సిబ్బంది జోక్యం

‘ది సన్’ పత్రిక కథనం ప్రకారం, విమానంలో తన పక్క సీట్లో నిద్రిస్తున్న బాలిక పట్ల జావేద్ అసభ్యంగా ప్రవర్తించాడు. మొదట ఆమె చేతిని నిమిరి, ఆ తర్వాత ఆమె దుస్తుల్లో చేయి పెట్టాడు. దీంతో ఉలిక్కిపడి నిద్రలేచిన ఆ బాలిక “నా దగ్గరి నుంచి వెళ్ళిపో” అంటూ గట్టిగా అరుస్తూ ఏడ్చేసింది. వెంటనే స్పందించిన విమాన సిబ్బంది, బాలికను విచారించగా జరిగిన విషయం చెప్పింది. క్యాబిన్ మేనేజర్ రెబెక్కా రూనీ కోర్టుకు(court) తెలిపిన వివరాల ప్రకారం, ఆ బాలిక తీవ్ర భయాందోళనతో కనిపించింది. నిందితుడిని ప్రశ్నించగా, తన భార్య అనుకుని పొరపాటున తాకినట్లు చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేశాడు.

కోర్టులో వాదనలు, జడ్జి వ్యాఖ్యలు

ఐల్స్‌వర్త్ క్రౌన్ కోర్టులో జరిగిన విచారణలో నిందితుడు హిందీ అనువాదకుడి సహాయం తీసుకున్నాడు. అతని తరఫు న్యాయవాది వాదిస్తూ, నిందితుడు భారతదేశంలోని భిన్నమైన సంస్కృతి నుంచి వచ్చాడని, అతని శిక్షను నిలిపివేస్తే వెంటనే దేశం విడిచి వెళ్లిపోతాడని కోర్టుకు విన్నవించారు. అయితే, ఈ వాదనలను జడ్జి సైమన్ డేవిస్(Judge Simon Davies) తీవ్రంగా ఖండించారు. “భార్య అనుకున్నాననే వాదన నమ్మశక్యంగా లేదు. ఇది దారుణమైన చర్య. ఇలాంటి వారి నుంచి ఈ దేశం చిన్నారులను కచ్చితంగా కాపాడుతుంది” అని ఆయన వ్యాఖ్యానించారు. నిందితుడు చాలాకాలంగా యూకేలో ఉండటాన్ని మానవతా దృక్పథంతో పరిగణలోకి తీసుకుని శిక్షను కొంత తగ్గించినట్లు తెలిపారు. విచారణ అనంతరం ఇనామ్‌దార్‌ను దోషిగా నిర్ధారించిన కోర్టు, అతనికి 21 నెలల కఠిన కారాగార శిక్షను ఖరారు చేసింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com/

Read also:

British Airways Child Abuse flight attendant Google News in Telugu Indian citizen Isleworth Crown Court Javed Inamdar Latest News in Telugu Mumbai to London flight sexual assault Telugu News Today UK court

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.